Map Graph

ధోలా సాదియా వంతెన

ధోలా-సాదియా వంతెనను ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలుపుతూ నిర్మించిన ఒక బీమ్ వంతెన. ఈ వంతెన బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది అయిన లోహిత్ నదిపై కట్టారు. ఇది దక్షిణాన ధోలా గ్రామాన్ని ఉత్తరాన టిన్సుకియా జిల్లాలో ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతుంది. దీనికి అధికారికంగా భూపేన్ హజారికా వంతెన అని పేరు పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌ వెళ్ళేందుకు చక్కటి వీలు కలిగిస్తుంది. సాదియా నుండి కొద్ది దూరం లోనే అరుణాచల్ సరిహద్దు ఉంటుంది. ఈ వంతెన ఉత్తర అస్సాం, తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య మొదటి శాశ్వత రహదారి.

Read article
దస్త్రం:SMOOTHEST_CURVE_IN_VIADUCTS_MADE_THROUGH_SEGMENTS.JPGదస్త్రం:Dhola_Sadia_Bridge_or_Dr_Bhupen_Hazarika_Setu.png