టి.వి.శంకరనారాయణన్

From Wikipedia, the free encyclopedia

టి.వి.శంకరనారాయణన్

టి.వి.శంకరనారాయణన్ (తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్, జననం 7 మార్చి 1945) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు.

త్వరిత వాస్తవాలు తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్, వ్యక్తిగత సమాచారం ...
తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్
Thumb
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుTVS
జననం (1945-03-07) 7 మార్చి 1945 (age 79)
మయిలదుతురై, తమిళనాడు, భారతదేశం
మూలంభారతదేశం
సంగీత శైలిభారత శాస్త్రీయ సంగీతం
వృత్తిగాత్ర విద్వాంసుడు
క్రియాశీల కాలం1968 నుండి
మూసివేయి

విశేషాలు

Thumb
1995లో ఓనం వేడుకల సందర్భంగా త్రివేండ్రంలో టి.వి.శంకరనారాయణన్ కచేరీ. సహ వాద్యకళాకారులు ఎన్.వి.బాబూ నారయణన్ (వయోలిన్), ఎరిక్కవు ఎన్.సునీల్ (మృదంగం), త్రిపనితుర రాధాకృష్ణన్ (ఘటం)
Thumb
త్యాగరాజ - పురందరదాస సంగీతోత్సవంలో టి.వి.శంకరనారాయణన్

ఇతడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, మయిలదుత్తురై గ్రామంలో 1945, మార్చి 7వ తేదీన జన్మించాడు. ఇతడు తన మామ మదురై మణి అయ్యర్ వద్న 9వ ఏటి నుండి సంగీతం అభ్యసించడం ప్రారంభించాడు.ఇతని తండ్రి వెంబు అయ్యర్‌కూడా మదురై మణి అయ్యర్ వద్ద రెండు దశాబ్దాలపాటు శిష్యరికం చేశాడు. ఇతడు 1968లో తన మొదటి కచేరీ చేసి క్రమంగా కర్ణాటక గాత్ర విద్వాంసునిగా తన సత్తాను చాటాడు. తన గురువు వలె ఇతని స్వరకల్పన గానం కూడా విభిన్నమైన రీతిలో సర్వలఘుతో అలరారుతూ వుంటుంది.[1]

ఇతని శిష్యులలో ఆర్.సూర్యప్రకాష్, ఇతని కుమార్తె అమృతా శంకరనారాయణన్, కుమారుడు మహదేవన్ శంకరనారయణన్ మొదలైన వారున్నారు.

అవార్డులు, గౌరవాలు

  • 1981లో అమెరికాలో భైరవి సంస్థ వారిచేగాయక శిఖామణి
  • 1986లో రిషీకేశ్ శ్రీవిద్యాశ్రమానికి చెందిన రామకృష్ణానంద సరస్వతి స్వామిచే స్వర లయ రత్నాకర
  • 1987లో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌చే గానకళారత్నం
  • 1975లో వాసర్ కళాశాల వారిచేసంగీత రత్నాకర
  • 1997లో యోగ జీవన సత్సంగచేస్వర యోగ శిరోమణి
  • 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 2003లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం[2]
  • 2003లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి పురస్కారం
  • 2005లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారిచే సంగీత కళాశిరోమణి
  • 2012లో తపస్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే విద్యాతపస్వి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.