ఛత్తీస్‌గఢ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 27 జిల్లాలలో జాంజ్‌గిర్- చంపా జిల్లా ఒకటి. అలాగే రాష్ట్రంలో తక్కువగా అభివృద్ధి చెందిన జిల్లాలలో ఇది ఒకటి. జిల్లాకేంద్రగా జాజ్ంజ్గిర్ పట్టణం ఉంది. కుల్చురీ సామ్రాజ్యానికి చెందిన మహారాజా జాజ్వల్యదేవ్ రాజ్యంలో జాంజ్‌గిర్- చంపా ఒక నగరం. ఇది గతంలో బిలాస్పూర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1998లో జాంజ్‌గిర్ జిల్లా ఏర్పాటు చేసినప్పుడు సరికొత్తగా రూపొందించబడిన జిల్లాకు పేరు నిర్ణయించే విషయంలోరాజకీయంగా వివాదాలు తలెత్తాయి. అందువలన ఈ జిల్లాకు రెండు పేర్లను ఒకటిగా చేర్చి జాంజ్‌గిర్- చంపా అని నామకరణం చేసారు. జిల్లాలో నివసించేవారు అధికంగా సమీపగ్రామాల నుండి వసలస వచ్చి స్థిరపడిన వారే.
జాంజ్‌గిర్ చంపా జిల్లా
जांजगीर-चाम्पा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | జాంజ్‌గిర్ |
మండలాలు | 10 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,853 కి.మీ2 (1,488 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 16,20,632 |
• జనసాంద్రత | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
• Urban | 2,25,199 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.7% |
• లింగ నిష్పత్తి | 986 |
సగటు వార్షిక వర్షపాతం | 1157.1 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
జాంజ్‌గిర్ జిల్లా 1998 మే 25న స్థాపించబడింది. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి హృదయం వంటిదని భావిస్తుంటారు. ఇది రాష్ట్రానికి మధ్యభాగంలో ఉండడమే ఇందుకు కారణం. ఈ జిల్లా గత వైభవాన్ని స్వర్ణయుగానికి విష్ణుమందిరం సాక్ష్యంగా ఉంది.
జిల్లా ప్రజల జీవన ఉపాధికి సహకరించడానికి అనుకూలంగా " ది హస్డియో - బాంగో " ప్రాజెక్ట్ ద్వారా కాలువ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా జిల్లాలోని 0.75% వ్యవసాయభూములకు నీటిపారుదల వసతి కల్పించబడింది. జాంజ్‌గిరి చంపా నగరం జాతీయరహదారి 49 పక్కన ఉంది. జాంజ్‌గిరి చంపా రహదారి మార్గంద్వారా బిలాస్‌పూర్‌కు 43 కి.మీ, రాష్ట్రరాజధాని రాయగఢ్‌కు 152కి.మీ దూరంలో ఉంది.
జాంజ్‌గిర్ జిల్లా వ్యవసాయం, వ్యాపారాలకు కేంద్రం. జాంజ్‌గిర్ జిల్లా రాష్ట్రంలో ఆహారధాన్యం అధికంగా జిల్లాగా గుర్తింపు పొందింది.జిల్లా మారెట్ వ్యవసాయ ఉత్పత్తులు, తోట ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. జిల్లాలో సున్నపురాయి కూడా అధికంగా లభిస్తుంది.
భారతదేశంలో జాంజ్‌గిరి జిల్లా త్వరితగతిలో అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటి. జిల్లాలో 52 పవర్ ప్లాంటులు ఆరంభించబడ్డాయి. దేశంలో జాంజ్‌గిరి విద్యుదుత్పత్తి కేంద్రంగా అభివృద్ధిచెందుతూ ఉంది. జాంజ్‌గిరి దేశంలోని ఇతర ప్రాంతాలకు 15-20 వేల మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. జిల్లాలో ప్రధాన ప్రైవేట్ విద్యుదుత్పత్తి కేంద్రమైన వార్ధా పవర్ ప్లాంటు (6 x 600 మెగావాట్లు) కు 2 శాఖలు ఉన్నాయి. ఇది ఆసియాలో బృహత్తర పవర్ ప్లాంటుగా గుర్తింపు పొందింది. అలాగే జిల్లాలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.
జిల్లా ప్రధాన కేంద్రము, రాష్ట్ర రాజధాని అయిన జంజ్ గిర్ పట్టణం దక్షిణ-తూర్పు రైల్వేలోని హౌరా-ముంబయి ప్రధాన మార్గము పైన యున్నది. ఇది రాయి పూరుకు 152 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో ప్రధాన రైల్వే స్టేషనులు [[చంపా, చత్తీస్ ఘర్-చంపా]], నైలా, అకల్తార. జంజ్ గిర్ లోవున్న రైల్వే స్టేషను పేరు నైలా. ఈ పట్టణ ప్రాంత ప్రజలు ఈ స్టేషను పేరును జంజ్ గిర్ గా మార్చమని చాల కాలంనుండి ఆందోళన చేస్తున్నారు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,620,632, [2] |
ఇది దాదాపు. | గునియా బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 308వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 421 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.01%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 991:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 73.7%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో వైష్ణవ సంప్రదాయం ప్రతిబింబించే కళాత్మకమైన విష్ణుమందిరం ఉంది.
జాంజ్‌గిర్ నగరం పురాతన ఙాపకాలకు చిహ్నంగా నిలిచింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.