జమ్మూ జిల్లా
జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జమ్మూ జిల్లా, జమ్మూ కాశ్మీరు, రాష్ట్రంలోని 20 జిల్లాలలో జమ్మూ జిల్లా ఒకటి. రాష్ట్రానికి ఇది శీతాకాలపు రాజధానిగా ఉంటుంది. వేసవిలో రాజధాని శ్రీనగర్‌కు మార్చబడుతుంది. ఈ జిల్లాలో అత్యంత పెద్ద నగరం జమ్ము.జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతమని 2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.[1]
జమ్మూ జిల్లా | |
---|---|
![]() బాహు పోర్టు, జమ్మూ | |
![]() జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో జమ్మూ జిల్లా | |
Coordinates (జమ్మూ): 32.73°N 74.87°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
విభాగం | జమ్మూ విభాగం |
ముఖ్య పట్టణం | జమ్మూ |
తహసీల్స్ | 1. అక్నూర్, 2. బిస్నహ, 3. జమ్మూ, 4. రణబీర్ సింగ్ పోరా |
Government | |
• లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం | జమ్మూ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,336 కి.మీ2 (902 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,29,958 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
జనాభా | |
• అక్షరాస్యత | 83.45% |
• లింగ నిష్పత్తి | 880 |
Time zone | UTC+05:30 |
Vehicle registration | JK-02 |
Website | http://jammu.nic.in/ |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ జమ్మూ జిల్లా పరిధిలో మొత్తం 15,29,958 మంది జనాభా ఉండగా, వారిలో పురుషులు 8,13,821 మంది, మహిళలు 716,137 మంది ఉన్నారు. ఈ జిల్లా పరిధిలో 3,14,199 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ జిల్లా లేదా పట్టణ సగటు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 880 మంది మహిళలు ఉన్నారు ఈజిల్లా జనాభా మొత్తంలో 50% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 50% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.జిల్లా సగటు అక్షరాస్యత రేటు పట్టణ ప్రాంతాలలో 88.5% ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 78.2%గా ఉంది. పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 1000:856 ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో 1000:905 గా ఉంది.ఈ జిల్లా లేదా పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1,67,363 (11%) మంది ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు మధ్య 93,242మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 74121 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యత రేటు 83.45% ఉండగా పురుషుల అక్షరాస్యత రేటు 78.88%, మహిళా అక్షరాస్యత రేటు 69.15%గా ఉంది.[2]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం, జమ్మూ జిల్లా మొత్తం వైశాల్యం 2,342 చ.కి.మీ. జమ్మూ జిల్లా సాంద్రత చదరపు కిలోమీటరుకు 653 మంది. సుమారు 252 చదరపు కి.మీ. విస్తీర్ణం పట్టణ ప్రాంతంలో ఉండగా, 2,090 చదరపు కి.మీ. గ్రామీణ ప్రాంతంలో ఉంది.[2]
ఈ జిల్లా 2,336 చ.కి.మీ.విస్తీర్నంలో విస్తరించి ఉంది.జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు, 771 గ్రామాలు, 21 తాలూకాలు, 20 బ్లాకులు, 296 పంచాయితీలు, 2,546విద్యా సంస్థలు,332 ఆరోగ్య కేంద్రాలు, 2533 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.[3]
జమ్మూ జిల్లాలో 7 ఉప విభాగాలు (రెవెన్యూ డివిజన్లు) ఉన్నాయి.
జమ్మూ జిల్లాలోని 93% ప్రజలు హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు. ఇతరులు ఇస్లాం, సిక్కు, క్రైస్తవ మతాలను అవలంబిస్తున్నారు.[2]
మతం | మొత్తం | పురుషులు | స్తీలు | |
---|---|---|---|---|
హిందువులు | 1,289,240 | (84.27%) | 6,85,679 | 6,03,561 |
మస్లింలు | 107,489 | (7.03%) | 56,927 | 50,562 |
క్రిష్టియన్లు | 12,104 | (0.79%) | 6,455 | 5,649 |
సిక్కులు | 114,272 | (7.47%) | 6,1,098 | 53,174 |
బౌద్ధులు | 470 | (0.03%) | 266 | 204 |
జైనులు | 1,987 | (0.13%) | 1,038 | 949 |
ఇతర మతాల వారు | 321 | (0.02%) | 171 | 150 |
గుర్తించని మతాలువారు | 4,075 | (0.27%) | 2,187 | 1,888 |
Seamless Wikipedia browsing. On steroids.