దర్శకుడు From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ యేలేటి (జననం మార్చి 4, 1973) తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. [1] ఆయన అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. [2] తన దశాబ్ద వృత్తి జీవితం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు నంది పురస్కారాలను పొందాడు. [3]
చంద్రశేఖర్ యేలేటి | |
---|---|
జననం | తుని, ఆంధ్ర ప్రదేశ్, India | 1973 మార్చి 4
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003–present |
ఆయన 1973 మార్చి 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తుని లో జన్మించాడు. గుణ్ణం గంగరాజు ఆయన బంధువు. చంద్రశేఖర్ మే 19న వివాహం జరిగింది.[4][5] గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన తెలుగు చలన చిత్రం లిటిల్ సోల్జర్స్ లో సహాయ దర్శకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. బహుళ ప్రజాదరణ పొందిన హాస్య ధారావాహిక అయిన అమృతం (ధారావాహిక) మొదటి 10 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాడు.
అసిస్టెంటు డైరక్టరుగా పనిచేసిన తరువాత ఆయన ఐతే సినిమాతో దర్శకత్వ భాద్యతలు చేపట్టాడు. ఈ చిత్రం నిర్మాణానికి 1.5 కోట్ల ఖర్చయింది. కానీ ఈ చిత్రం 6 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రెండు సంవత్సరాల తరువాత ఆయన అనుకోకుండా ఒక రోజు చిత్రాన్ని విదుదల చేసాడు. ఈ రెండు చిత్రాలకు గున్నం గంగరాజు నిర్మాణ భాద్యతలు చేపట్టాడు. కొంత కాలం వ్యవధి తరువాత ఆయన గోపీచంద్ కథా నాయకునిగా ఒక్కడున్నాడు చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2009లో ఆయన తన నాల్గవ చిత్రం మంచు మనోజ్ కథానాయకునిగా ప్రయాణం చిత్రానికి దర్శకత్వం వహించాడు.
సంవత్సర | చిత్రం | పురస్కారాలు |
---|---|---|
2003 | ఐతే | National Film Award for Best Feature Film in Telugu Nandi Award for Best Story Writer Nandi Special Jury Award - Pavan Malhotra Filmfare Best Villain Award (Telugu) - Pavan Malhotra |
2005 | అనుకోకుండా ఒక రోజు | Nandi Award for Best Screenplay Writer Nandi Award for Second Best Feature Film Santosham Best Actress Award - Charmme Kaur |
2007 | ఒక్కడున్నాడు | |
2009 | ప్రయాణం | |
2013 | సాహసం | |
2016 | మనమంతా | నంది స్పెషల్ జ్యూరీ అవార్డు |
2021 | చెక్ | [6] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.