ఘోష
ఘోష పురాతన వేద కాలంకు చెందిన భారతీయ మహిళా తత్వవేత్త. పజ్ర వంశీయుడైన కక్షీవంతుని కుమార్తె. From Wikipedia, the free encyclopedia
ఘోష పురాతన వేద కాలంకు చెందిన భారతీయ మహిళా తత్వవేత్త.[1] పజ్ర వంశీయుడైన కక్షీవంతుని కుమార్తె. ఈమె రుగ్వేదం దశమ మండలంలోని కొన్ని సూక్తలను దర్శించి ఋషీక అయింది. చిన్న వయస్సు నుండే ఈమె చర్మ వ్యాధితో బాధపడుతోంది. అశ్వినీ దేవతలు ఆమె వ్యాధిని నయంచేసి, ఆమె యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని, అందాన్ని తిరిగి ప్రసాదించారు. దాంతో, ఆమె వివాహం చేసుకొని, ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆమె వేదాలలో ప్రావీణ్యం కలిగివున్న ఘోష, రుగ్వేదంలో రెండు శ్లోకాలను కూడా రాసింది.[2] మంత్రాలలో ప్రావీణ్యం ఉన్నందున ఈమెను మంత్రద్రిక అని పిలుస్తారు.[3] ఈమె బ్రహ్మవాదిని లేదా వక్త లేదా బ్రాహ్మణ ప్రకటనకర్త అని కూడా పిలువబడింది. ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపింది.[2]
ఘోష | |
---|---|
జననం | వేద కాలం భారతదేశం |
మరణం | వేద కాలం భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | వేద తత్వవేత్త |
వీటికి ప్రసిద్ధి | రుగ్వేదంలో శ్లోకాల రచన |
గుర్తించదగిన సేవలు | అశ్వినీ దేవతలను కీర్తిస్తూ రుగ్వేదంలో రెండు శ్లోకాల రచన |

జీవిత చరిత్ర
ఘోష భారతదేశంలో వేద కాలంలో జన్మించింది. ఆమె తండ్రి కక్షివంతుడు, తాత దిర్గాతామస్ ఇద్దరూ రుగ్వేదంలో శ్లోకాలు రాశారు. ఆమె చర్మ వ్యాధితో బాధపడుతున్న ఘోష, ఇంటికే పరిమితం చేయబడింది. ఆమె కుష్టు వ్యాధితో బాధపడుతూ వికృతంగా మారింది.[2][4] ఆమె చాలాకాలంపాటు బ్రహ్మచారిగా ఉండిపోయింది. ఆ సమయంలో దైవిక వైద్యుడి కవలలైన ఆశ్వనీ దేవతలను ప్రార్థించింది. చర్మవ్యాధుల నుండి నయం చేయటానికి మధు విద్యా అనే వేదబోధన, యవ్వనాన్ని తిరిగి పొందడానికి, అపారమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మంత్రాలు నేర్పించారు. తన నిరంతర ప్రార్థనల వల్ల అశ్వినీ దేవతలు చర్మ వ్యాధిని నయంచేసి అందాన్ని తిరిగి ప్రసాదించారు. ఆ తర్వాత ఆమెకు వివాహం జరిగింది. ఆమెకు సుహ్త్స్య అని ఒక కుమారుడు కలిగాడు. సుహ్త్స్య రుగ్వేదంలో ఒక శ్లోకం కూడా కంపోజ్ చేశాడు.
రుగ్వేదంలోని పదవ మండలం (పుస్తకం), X వ అధ్యాయం 39, 40లోని రెండు సూక్తులు (శ్లోకాలు), అశ్వినీ దేవతలను కీర్తిస్తూ ఘోష రెండు శ్లోకాలను కంపోజ్ చేసింది. ఒక్కొక్కటి 14 శ్లోకాలను కలిగి ఉంది. మొదటి శ్లోకం అశ్వినీ దేవతలను స్తుతిస్తుంది. రెండవ శ్లోకం వివాహిత జీవితం కోసం ఆమె సన్నిహిత భావాలను, కోరికలను వ్యక్తపరిచే వ్యక్తిగత కోరికలను తెలియజేస్తుంది.[5][6][7]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.