From Wikipedia, the free encyclopedia
గాంధీ, మై ఫాదర్ ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ రచించిన హిందీ చలన చిత్రం. ఇది 2007లో నిర్మించబడిన భారతీయ జీవితచరిత్ర చిత్రం. దీనిని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నిర్మించాడు. ఇది 2007 మార్చి 3న విడుదలైంది.
గాంధీ, మై ఫాదర్ | |
---|---|
దర్శకత్వం | ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ |
రచన | ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ చందూలాల్ దలాల్ (పుస్తకం) నీలంబేన్ పారిఖ్ (పుస్తకం) |
నిర్మాత | అనిల్ కపూర్ |
తారాగణం | దర్శన్ జరీవాలా అక్షయ్ ఖన్నా భూమికా చావ్లా షెఫాలీ షా |
ఛాయాగ్రహణం | డేవిడ్ మెక్ డోనాల్డ్ |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | పీయూష్ కానోజియా |
విడుదల తేదీ | 3 ఆగస్టు 2007 |
సినిమా నిడివి | 136 min. |
భాషలు | హిందీ, గుజరాతీ, ఆంగ్లం |
బడ్జెట్ | ₹80 million[1] |
బాక్సాఫీసు | ₹74.9 million[1] |
ఈ చిత్రంలో దర్శన్ జరివాలా, అక్షయ్ ఖన్నా, భూమిక చావ్లా లు ప్రధాన తారాగణంగా నటించారు..
ఈ చిత్రం మహాత్మా గాంధీ, అతని కుమారుడు హరిలాల్ గాంధీ మధ్య గల సమస్యాత్మక సంబంధాన్ని విశ్లేషిస్తుంది.
చందూలాల్ భాగూభాయ్ దలాల్ "హరిలాల్ గాంధీ: ఎ లైఫ్" అనే పేరుతో రచించిన హరిలాల్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2] ఖాన్ నాటకం, మహాత్మా వర్సెస్. గాంధీ,[3] ఈ సినిమాకి భిన్నంగా ఉన్నప్పటికీ, గుజరాతీ రచయిత దినకర్ జోషి నవల ఆధారంగా ఇదే విధమైన కథ ఉంది.[4] ఈ చిత్రాన్ని దక్షిణాఫ్రికా, ముంబై, అహ్మదాబాద్ తో సహా అనేక భారతీయ నగరాల్లో చిత్రీకరించారు.
గాంధీ మై ఫాదర్ సినిమాలో తన కుమారుడు హరిలాల్ గాంధీతో గాంధీకి ఉన్న క్లిష్టమైన, సంక్లిష్టమైన, ఒత్తిడితో కూడిన సంబంధాన్ని చిత్రించాడు. ప్రారంభం నుండి తండ్రీ కొడుకులిద్దరికీ విభిన్న కలలు ఉన్నాయి. హరిలాల్ గాంధీ ఆశయం విదేశాలలో చదివి, తన తండ్రి లాగా బారిస్టర్ కావడమే, అయితే గాంధీ తన కుమారుడు తనతో కలిసి భారతదేశంలో తన ఆదర్శాలకనుగుణంగా స్వాతంత్ర్యం కోసం పోరాడాలని ఆశించాడు.
గాంధీ తన కుమారుడు హరిలాల్కి విదేశాలలో చదువుకునే అవకాశం ఇవ్వకపోయినప్పుడు హరిలాల్ మనసుకు కష్టం కలిగింది. అతను తన తండ్రి ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. దక్షిణాఫ్రికాను వదిలి భారతదేశానికి వెళ్తాడు. అక్కడ అతను తన భార్య గులాబ్ ( భూమిక చావ్లా ), పిల్లలతో కలుస్తాడు. అతను తన డిప్లొమా సంపాదించడానికి తన విద్యకు కొనసాగించడానికి వెళ్తాడు, కానీ ఆర్థిక సమస్యల కారణంగా విఫలమవుతాడు. డబ్బు కోసం అతను చేసిన వివిధ ప్రయత్నాలు విఫలమవుతాయి. తన కుటుంబం ఆర్థిక సమస్యల వల్ల పేదరికంతో బాధపడుతుంది. అతని వైఫల్యం కారణంగా భార్య తన పిల్లలను తీసుకున్ని కన్నవారింటికి వెళుతుంది. చివరికి ఆమె ఫ్లూ మహమ్మారి కారణంగా మరణించింది. దిక్కుతోచని స్థితిలో హరిలాల్ త్రాగుడుకు బానిస అవుతాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. రాజకీయ ఉద్రిక్తత వేడెక్కడంతో, గాంధీ, అతని పెద్ద కుమారుడి మధ్య విభేదాలు పరిష్కరించలేని సమస్యగా తయారవుతాయి. హరిలాల్ తన తండ్రి వద్ద జీవించడం భరించలేనిదిగా భావిస్తాడు. ఇద్దరూ రాజీపడకముందే గాంధీ హత్య చేయబడ్డాడు. హరిలాల్ తన తండ్రి అంత్యక్రియలకు దాదాపు అపరిచితుడిగా హాజరవుతాడు. అతని చుట్టూ ఉన్నవారు దాదాపుగా అతనిని గుర్తించరు. కొద్దిరోజుల తరువాత, అతను పేదరికంలో, తన స్వంత గుర్తింపును కనుగొనడంలో విఫలమై మరణిస్తాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.