Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ జిల్లాలోని 33 జిల్లాలలో కచ్ జిల్లా ఒకటి. (గిజరాతీ: કચ્છ, సింధీ: ڪڇ,) జిల్లా వైశాల్యం 45,652 చ.కి.మీ.[1] దేశంలో ఇది అతి పెద్దది. కచ్ అంటే తడి, పొడి కానిది అని అర్ధం. జిల్లాలో పెద్ద భాగం గ్రేట్ రాణ్ అంటారు. ఇది నిస్సారమైన తడిభూమి. వర్షాకాలంలో మునిగిపోతుంది. మిగిలిన కాలంలో పొడిగా ఉంటుంది. చిన్న భాగాన్ని లిటిల్ రాణ్ అంటారు. వర్షాకాలం పూర్తికాగానే ఈ భూమి పూర్యిగా ఆరిపోయి మంచులా కనిపిస్తుంది. ఈ భూభాగంలో నీటి అంచున బన్ని గ్రాస్ పెరుగుతుంది. బన్ని గ్రాస్ భూములకు ఈ ప్రాంతం ప్రఖ్యాతి చెందింది. కచ్ జిల్లా దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో గల్ఫ్ ఆఫ్ కచ్, అరేబియన్ సముద్రం, ఉత్తర, తూర్పు సరిహద్దులో గ్రేట్ రాన్ ఆఫ్ కచ్, లిటిల్ రాన్ ఆఫ్ కచ్ ఉన్నాయి. ఆనకట్టలు నిర్మించడానికి ముందు గ్రేట్ రాణ్ సంవత్సరంలో అధికభాగం తడిగానే ఉండేది. జిల్లా జనసంఖ్య 1,583,500.[2]
కఛ్ జిల్లా
કચ્છ જિલ્લો | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | గుజరాత్ |
ముఖ్య పట్టణం | Bhuj |
మండలాలు | 10 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Kutch |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
విస్తీర్ణం | |
• మొత్తం | 45,652 కి.మీ2 (17,626 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 20,92,371 |
• జనసాంద్రత | 46/కి.మీ2 (120/చ. మై.) |
జనాభా వివరాలు | |
• లింగ నిష్పత్తి | 951 |
ప్రధాన రహదార్లు | 1 |
కచ్ జిల్లా దేశంలో అతిపెద్ద జిల్లాగా గుర్తించబడుతుంది. జిల్లా వైశాల్యం 45692 చ.కి.మీ. జిల్లా కేంద్రంగా భుజ్ పట్టణం ఉంది. భౌగోళికంగా జిల్లాకు కేంద్రంలో ఉంది. జిల్లాలో గాంధీధాం, రాపర్, నఖత్రానా, అంజర్, మహాదేవ్, మధపర్, ముంద్ర, భచౌ మొదలైన పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో 969 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఎగువన కలా దుంగర్ (బ్లాక్ హిల్) ఉంది. కచ్ ఒక ద్వీపం. ఇది పూర్తిగా సముద్రజలాల మధ్య ఉంది. జిల్లా దక్షిణ, ఆగ్నేయ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కచ్, ఉత్తర, ఈశాన్య సరిహద్దులో రాన్ ఆఫ్ కచ్ ఉత్తర తీరంలో పాకిస్తాన్ ఉంది. కచ్ ద్వీపకల్పం థ్రస్ట్ ఫాల్ట్ టెక్టోనిజానికి ఉదాహరణగా ఉంది. కచ్ మధ్యలో ఫాల్ట్ ప్రొపగేషన్కు చెందిన 4 వరుసలలో కొండలు ఉన్నాయి. సరిహద్దులో సరిహద్దులో సరిహద్దులో [3]
కచ్ జిల్లాలలో 97 సెలయేర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా అరేబియన్ సముద్రంలో సంగమిస్తున్నాయి. వీటిలో కొన్ని రాణ్ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. [4] జిల్లాలో 20 ప్రధాన ఆనకట్టలు ఉన్నాయి. [5] వర్షపు నీటిని సేకరించి ఉంచడానికి, అనేక చిన్న చెక్ డాములు ఉన్నాయి.[6] ఈ అనకట్టలు రాన్‌కు నష్టం ఎలాంటి నష్టం కలిగించడం లేదు. ఆనకట్టలు అరేబియా సముద్రంలో కలుస్తున్న నదీజలాలను సంరక్షించడానికి మాత్రమే నిర్మిచబడ్డాయి. వర్షాధార ఆనకట్టలు ఎగువ నుండి ప్రవహిస్తున్న సెలయేటి జలాలను వృధాకాకుండా సంరక్షిస్తున్నాయి. గ్రేట్ రాణ్‌లో నీరు స్వల్పంగానే లభిస్తుంది. లిటిల్ రాణ్‌లో ల్యూనీనది, రూపెన్ నది, బభన్నది, మాల్వన్, కంకావతి, నది, సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయి. గ్రేట్ రాణ్‌లో స్ట్రోం టైడ్స్, అతి వేగంగా ప్రవహించే వాయువులు సముద్రజలాలను అధికంగా గ్రేట్ రాణ్‌లో ప్రవహింపజేస్తున్నాయి. [7] కచ్ జిల్లాలో జలం ప్రధాన సమస్యగా మారింది.[8]
ఆనకట్ట | రిజర్వాయర్ | నది | లోతు మీ | సమీప ప్రాంతం |
---|---|---|---|---|
భుకి ఆనకట్ట | భుకి | 73.00 | ||
బెరచియా ఆనకట్ట | న్యార | 70.40 | ||
చంగ్ ఆనకట్ట | 18.00 | |||
డాన్ ఆనకట్ట | ఖర్ద్ | 47.75 | ||
ఫతేఘర్ ఆనకట్ట | మలన్ | 22.70 | ||
గజంసర్ ఆనకట్ట | గజంసర్ | పంజొర | 31.08 | |
గజొడ్ ఆనకట్ట | నాగ్మతి | 90.82 | ||
గోధాతద్ ఆనకట్ట | మితియారివలి | 23.00 | ||
గోయాల ఆనకట్ట | గోయాల | సుగంధి | 8.00 | |
జంగదియా ఆనకట్ట | జంగదియా | ఖరి | 38.60 | |
కైల ఆనకట్ట | కైల | 79.25 | ||
కలఘొఘ ఆనకట్ట | ఫోట్ | 37.00 | ||
కంకవతి ఆనకట్ట | కంకవతి | 131.67 | ||
కస్వతి ఆనకట్ట | కస్వతి | 51.20 | ||
మథల్ ఆనకట్ట | ధదూత్ | 82.78 | ||
మిట్టి ఆనకట్ట | మిట్టి | మిట్టి | 18.50 | |
నారా ఆనకట్ట | నారా | 27.43 | ||
నిరునా ఆనకట్ట | భురుద్ | 43.58 | ||
రుద్రమాతా ఆనకట్ట | పూర్ (ఖర్) | 66.44 | ||
సాంద్రో ఆనకట్ట | కాలి | 59.74 | ||
సువి ఆనకట్ట ఆనకట్ట | సువి | 42.67 | లిల్పార్ | |
తప్పర్ (డబల్యూ.ఎస్) ఆనకట్ట | సకర | 40.85 | ||
భుజు నగరం పర్యావరణ సుసంపన్నమై ఉంది. జిల్లాలో ఇండియన్ యాస్ అభయారణ్యం, కచ్ డిసర్ట్ వన్యప్రాణి అభయారణ్యం, నారాయణ్ సరోవర్ శాంచ్యురీ, కచ్ బసర్టర్డ్ అభయారణ్యం, బన్ని గ్రాస్లాండ్ రిజర్వ్, చారి - ధండ్ వెట్ లాండ్ కంసర్వేషన్ రిజర్వ ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,090,313,[10] |
ఇది దాదాపు. | మెసిడోనియా దేశ జనసంఖ్యకు సమానం.[11] |
అమెరికాలోని. | న్యూమెక్సికోనగర జనసంఖ్యకు సమం.[12] |
640 భారతదేశ జిల్లాలలో. | 217 వ స్థానంలో ఉంది.[10] |
1చ.కి.మీ జనసాంద్రత. | 46 [10] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 32.03%.[10] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 907:1000 .[10] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 71.58%.[10] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో సింధీ భాషకు స్వల్పంగా తేడా ఉన్న కచ్ భాష వాడుకలో ఉంది. తరువాత స్థానాలలో గుజరాతీ, హిందీ భాషలు వాడుకలో ఉన్నాయి. కుచ్ లిపి ప్రత్యేకత కలిగి ఉంది. ప్రస్తుతం కచ్ భాష వ్రాయడానికి గుజరాతీ లిపి వాడబడుతుంది. ప్రస్తుతం కచ్ భాషా లిపి మ్యూజియంలో లభ్యం ఔతుంది. గుజరాతీ భాష వాడుక వలన విద్యాబోధన గుజరాతీ మాధ్యమంలో నిర్వహించబడుతుంది. కచ్ గుజరాతీ భాషలా అనిపిస్తుంది కాని కచ్ భాష అధికంగా సింధీ భాషను పోలి ఉంటుంది. తక్కువగా గుజరాతీ భాషాను పోలి ఉంటుంది.
కచ్ జిల్లాలో పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ప్రజలు శతాబ్ధాల క్రితం మేవార్ (పశ్చిమ రజస్థాన్), సింధ్, ఆఫ్ఘనిస్తాన్, ఇతరప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పటికీ జిల్లాలో సంచార, అర్ధ సంచార, విశ్వకర్మ జాతి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. కచ్‌లో అధికసంఖ్యలో అహిర్ ప్రజలు నివసిస్తున్నారు. [13]
చారిత్రకంగా కచ్ భౌగోళిక కారణాల వలన వెనుకబడిన జిల్లాగా గుర్తించబడుతుంది. 2001 భూకంపం తరువాత పరిస్థితి మరింతగా దిగజారింది. తరువాత దశాబ్ధకాలంలో అనూహ్యంగా పరిస్థితిలో మార్పులు సంభవించాయి. ప్రస్తుత కచ్ రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా మారింది. ఇది భారత్ పశ్చిమ తీరంలో ఉన్నందున ఇక్కడ మథుర, ఖండ్ల వద్ద రెండు నౌకాశ్రయాలు నిర్మించబడ్డాయి. ఈ నౌకాశ్రయాలు 2 గల్ఫ్ కు అతి సమీపంలో ఉన్నాయి.
ఈ జిల్లాలోని భుజ్ నగరం దేశంలోకెల్లా అత్యంత సంపన్నమైన నగరాల్లో ఒకటిగా పేరు పొందింది. ఇక్కడి ప్రజలు దేశదేశాల్లో వ్యాపారం చేసి తిరిగివచ్చి స్థిరపడడంతో ఈ ప్రాంతం సంపద్వంతం అవుతోంది. భుజ్ సమీపంలోని బల్దియా, మాధాపూర్ వంటి పలు గ్రామాలు కోటీశ్వరుల గ్రామాలుగా పేరొందాయి.[14]
జిల్లాలో రహదార్లు చక్కగా పరామర్శంచబడుతున్నాయి. 2001 భూకంపం తరువాత కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతగా సాగింది. చారిత్రకంగా కచ్ జిల్లాలోని ప్రజలు గుజరాత్, సింధ్ ల మధ్య వ్యాపారానికి వెన్నెముకగా ఉన్నారు. పాకిస్తాన్ విభజన తరువాత వ్యాపారం ఆపివేయబడింది. ఖండ్లా వద్ద నౌకాశ్రయం నిర్మించబడిన తరువాత వ్యాపారం తిరిగి అభివృద్ధి అయింది.
కచ్ జిల్లాలో లిగ్నైట్ అత్యధికంగా లభిస్తుంది.[15] బాక్సైట్, జిప్సం ఖనిజాలు ఇతర ఖనిజాలలో ముఖ్యమైనవి. 2001 జనవరి 26 తరువాత సంభవించిన భూకంపం తరువాత జిల్లాలోని పరిశ్రమలకు 15 సంవత్సరాలు పన్ను మినహాయింపు ఇవ్వబడింది. గుజరాత్ మినరల్ డెవెలెప్మెంటు డిపార్ట్మెంటు గుజరాత్లో లిగ్నైట్ గనులలో మాత్రమే త్రవ్వకాలు కొనసాగిస్తుంది. దీనికి పనంధ్రొ, మాతా నొ మాధ్ వద్ద గనులు ఉన్నాయి.[16]
కచ్ జిల్లాలో సంఘీ ఇండస్ట్రీ లిమిటెడ్ సిమెంట్ ప్లాంట్ ఉంది. ఇది దేశంలో పెద్ద సిమెంట్ ప్లాంటుగా గుర్తించబడుతుంది. ఈ కపనీ అబ్దసా ప్రాంతంలో ఉన్న శాఖలో ఉత్పత్తి 3-9 టన్నులకు అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది.[17] By 2015, the company plans to produce 20 million tons.[17] కచ్ జిల్లాలో కండ్ల నౌకాశ్రయం ఉంది. ఇది ఉత్తర భరతానికి ద్వారంగా భావించబడుతుంది. దీనిని ఖండ్లా పోర్ట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది.
కచ్‌లో ఉన్న ఇతర పరిశ్రమలలో 4000 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న టాటాపవర్ ప్రధానమైనది. 2012 లోఅదాని పవర్ ఈ సస్థ భాగస్వామ్యంతో 3,300 మె.వా విద్యుత్తును ఉత్పత్తి ప్లాంట్ స్థాపించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2013 నాటికి ఇది 10,000 మె.వా చేరుకుంటుందని భావిస్తున్నారు. జిల్లాలో ఇతర పరిశ్రమలలో వెస్టర్న్ గ్రూప్ ఆఫ్ కంపనీలు, అజంతా క్లాక్స్, ఒర్పాత్, జయ్పీ సిమెంట్స్, జిండల్ స్టీల్,, విండ్‌మిల్స్ కంసెంట్రేషన్ ప్రధానమైనవి. కచ్ జిల్లాలో ఉప్పు అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.
కుచ్ జిల్లాలో అరణ్యభాగం తక్కువగా ఉంది. అలక్ష్యం కారణంగా అడవులు అక్రమంగా నరికేయబడడం కూడా అరణ్యాలు క్షీణించడానికి ఒక కారణంగా ఉంది. ఖండలాలో నిర్మించబడిన నౌకాశ్రయం టింబర్ ఎగుమతులకు సహకరించడం కూడా అడవుల నరికివేతకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడనికి టింబర్ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి 1987లో ఖండ్ల వద్ద " ఖండ్ల టింబర్ అసోసియేషన్ " స్థాపించబడింది. గాంధీదాం, ఖండ్ల వద్ద 300 సామిల్లులు అభివృద్ధి చెందడం జిల్లాలో టిబర్ వ్యాపార అభివృద్ధికి చిహ్నంగా ఉంది.
లిటిల్ రాన్ కుచ్ సంప్రదాయ ఉప్పు ఉత్పత్తికి కేంద్రంగా ఉంది. పలు పరిశోధనల ఫలితంగా 600 సంవత్సరాల నుండి జిల్లాలో ఉప్పు ఉత్పత్తి చేయబడుతున్నట్లు తెలుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వపాలనలో ఉప్పు ఉత్పత్తి పలు రెట్లు అధికం అయింది. బ్రిటిష్ ప్రభుత్వ మిలటరీ వ్యయంలో అధికభాగం ఉప్పు ఉత్పత్తి నుండి లభించిందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
జిల్లాలో 107 గ్రామాలలో నివసిస్తున్న చుంవాలియా కోలి, అహిర్, మియానా (ముస్లిములు) ప్రజలు ఉప్పు ఉత్పత్తిని చేపడుతున్నారు. వీరికి ఉప్పు ఉత్పత్తిలో మెళుకువలు చక్కగా తెలుసు. వీరిని అగారియాలు అంటారు. ఈ 107 గ్రామాలలో నీటిలో ఉప్పుశాతం అధికంగా ఉండి వ్యవసాయ యోగ్యం కాని కారణంగా గ్రామీణ ప్రజలు ఉప్పు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అగారియాలకు ఉప్పు ఉత్పత్తి మాత్రమే జీవనాధారంగా ఉంది. జిల్లాలో 45,000 మంది అగారియాలు ఉప్పు ఉత్పత్తిలో పనిచేస్తూ ఉన్నట్లు సాల్ట్ కమిషన్ నివేదిక తెలియజేస్తుంది. ఇండియాలో సంవత్సరానికి 108 టన్నుల ఉప్పు ఉత్పత్తి ఔతుండగా అందులో 75% కచ్, సౌరాష్ట్రాలో ఉత్పత్తి ఔతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
2001 గణాంకాలను అనుసరించి జిల్లాజనసంఖ్య 1,526,331. విరిలో అధికంగా హిందువులు ఉన్నారు. మిగిలిన ప్రజలలో జైనులు, ఇస్లాం మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. జిల్లాలోని లఖ్‌పత్ వద్ద గురుద్వారా ఒకటి నిర్మించబడి ఉంది. జిల్లాలో సిక్కులు కూడా గుర్తుంచతగినంతగా నివసిస్తున్నారు. మొదటి సిక్కు గురువు గురునానక్ మక్కా యాత్రచేస్తున్న సమయంలో ఇక్కడ కొంతకాలం విశ్రమించాడు. జిల్లాలో స్వామినారాయణ అనుయాయులు కూడా ఉన్నారు. భుజులో ఉన్న స్వామినారాయణ మందిరం జిల్లాలో ప్రధాన ఆలయంగా గుర్తించబడుతుంది. అంజర్ పట్టణం కూడా స్వామినారాయణ ఆలయానికి ప్రసిద్ధిచెంది ఉంది. అంజర్‌లో కూడా స్వామినారాయణ అనుయాయులు గుర్తించతగినంతగా ఉన్నారు. కుచీ " సరస్వత్ బ్రాహ్మణ్ " అనబడే బ్రాహ్మణులు కూడా జిల్లాలో నివసిస్తున్నారు. మహేశ్వరీ సంప్రదాయానికి (మహేష్పంథి) చెందిన ప్రజలు కూడా జిల్లాలో ఉన్నారు. జిల్లాలో కుచ్ జైనులకు సమానంగా కుచ్ ముస్లిములు నివసిస్తున్నారు.
జిల్లాలోని ప్రజలలో అధికంగా శాఖాహాహారులు ఉన్నారు. జైనులు, బ్రాహ్మణులు, ఇతర కుల్లాలో కొందరు శాఖారులు ఉన్నారు. జైనులు ఉర్లగడ్డలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కంద కందమూలాలను (భూమీలోపల పెరిగేవి) ఆహారంలో వాడడం నివారిస్తుంటారు. హిందువులు పలురకాల ఆహారవిధానం అవలంబించినా బీఫ్ మాత్రం ఆహారంగా తీసుకోరు.
గ్రమీణప్రజలు సజ్జలు, పాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. సజ్జరొట్టెలు, పెరుగు, పాలు సాధారణ ఆహారంగా తీసుకుంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మహారాజు లఖోఫులానీ ఈ ప్రాంతానికి సజ్జలను పరిచయం చేసాడు. రాజు రాజ్యం నుండి దూరంగా నివసించిన కాలంలో ఆయన కొన్ని గిరిజన ప్రాంతాలలో ఈ ఆహారం గురించి తెలుసుకున్నాడు. వారు భోజనసమయంలో విస్రారంగా మజ్జిగ త్రాగడం కూడా చూసాడు. పాలు మాత్రం చాలా అపురూపంగా చూసేవారు. పాలను అతిథి మర్యాదలలో భాగంగా బంధుమిత్రులకు మాత్రమే ఇచ్చేవారు. పాలు ఇవ్వడం తీసుకోవడం గరూవానికి చిహ్నంగా భూవిస్తారు. కుచ్ వివాహం తాంబూలాలు పుచ్చుకునే సమయంలో వధువు తల్లితండ్రులు వరుని తల్లితండ్రులకు పాలను గౌరవపూర్వకంగా ఇవ్వడం ఆచారంగా ఉంది.
ఈ ప్రాంతంలో టీ ప్రజలకు అభిమాన పానీయంగా ఉంది. స్త్రీ పురుషబేధం, కులం, మతం, మతం తారతమ్యం లేకుండా టీ త్రూగుతుంటారు. టీ దుకాణాలలో ప్రజలు గుంపులుగా చేరి ముచ్చటించుకుంటూ ఉంటారు. గ్రామాలలో, పట్టణాలలో పలు ప్రాంతాలలో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు టీ దుకాణాల వద్ద ప్రజలు ముచ్చటిచడం సాధారణంగా కనిపిస్తుంటుంది. చాలామంది ప్రజలు టీని పాలు, చక్కెర చేర్చి త్రాగుతుంటారు. అతిథులకు బ్లాక్ టీ ఇవ్వడం అమర్యాదగా భావిస్తుంటారు. మరణసమయంలో బంధువులు విచారించడానికి హాజరైన సందర్భాలలో మాత్రమే బ్లాకు టీ ఇవ్వడం సంప్రదాయంగా ఉంది. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాపించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చికిత్సలో భాగంగాటీని ఈ ప్రాంతంలో పరిచయం చేసారు. మద్యపానం మీద నిషేధం ఉన్నప్పటికీ మద్యం మాత్రం ఈ ప్రమ్ంతంలో ప్రజల అభిమాన పానీయాలలో ఒకటిగా ఉంది.మద్యం అధికంగా గ్రామాలలో మాత్రమే తయారుచేయబడుతుంది. స్త్రీ మద్యంత్రాగడానికి సాంఘిక నిషేధం ఉంది.
.
వస్త్రాంలంకరణకు కచ్ ప్రత్యేకగుర్తింపును కలిగి ఉంది. కచ్ ఎంబ్రాయిడరీ వస్త్రాలంకార కళలలో ప్రత్యేకత సంతరించుకుంది. ఎంబ్రాయిడరీలో అద్దాలను చేర్చి వస్రాలను అందంగా తయారుచేస్తారు. కచ్ ఎంబ్రాయిడరీలో పలు విధాలు ఉన్నాయి. ఒక్కో గిరిజన వర్గం ఒక్కొక ఒక్కొక విధమైన విధానంలో ఉంటుంది.
సూదూరంగా, అరుదైన జనసాంధ్రత కలిగిన కచ్ చరిత్రలో ప్రాధాన్యత సంతరించికున్న ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఐపురాతనమైన సిధూనాగరికత వధిల్లిందని భావిస్తున్నారు. కచ్ ప్రాంతంలో సింధునాగరికతకు చెందిన పలు ప్రాంతాలు కనుగొనబడ్డాయి.[18] బ్రిటిష్ ఇండియా విడగొట్టబడిన తరువాత సింధునదిలో చాలభాగం పాకిస్థాన్‌లో ఉంది.
కచ్‌లో సింధునాగరితకు చెందిన ప్రధానపట్టణాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న ధొల్వియా (కొటడా తింబ) దేశంలోని సింధూనాగరికతకు చెందిన అత్యంతవిశాలమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలలో ఒకటి. .[18] ఇది కచ్ జిల్లా ఉత్తరభూభాగంలో ఉన్న ఖాదిర్ ద్వీపంలో ఉంది. వర్షాకాలంలో ద్వీపంచుట్టూ నీరు ఉంటుంది. ధొలవీర ప్రాంతంలో 2900, 100 మధ్యకాలంలో మాననివాసాలు ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 2100 నుండి ఇక్కడ మానవనివాసాలు క్షీణిస్తూ చివరకు పూర్తిగా ఈ ప్రాంతం పూర్తిగా నిర్జనప్రదేశంగా మారింది. క్రి.శ 1450 తరువాత శిధలమధ్య గ్రామస్థులు తిరిగి జీవించడం మొదలు పెట్టారు.[18]
సమ్మ రాజపుత్రుల సంతతికి (గిరిజన) చెందిన జడేజాలు 13వ శతాబ్దంలో కచ్ రాజ్యస్థాపన చేసారు. జడేజా రాజపుత్రులు కచ్ రాజ్యాన్ని మాత్రమే కాక కతియావర్ ప్రాంతాన్ని కూడా కొన్న శతాబ్ధాల వరకు పాలించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు వీరిపాలన కొనసాగింది. 1815 నుండి కచ్ బ్రిటిష్ ప్రభుత్వానికి స్వతంత్ర రాజ్యంగా ఉండేది. కచ్ రాజాస్థానానికి భుజ్ రాజధానిగా ఉంది. రాజాస్థానికి గుర్తుగా 1760లో భుజ్‌లో నిర్మించిన ఐనా మహల్ (అద్దాల మండపం ) ఇప్పటికీ సజీవంగా ఉంది. దీనిని రాంసింగ్ మలాం నిర్మించాడు. ఆయన డచ్ ప్రజల నుండి గ్లాస్, ఎనామిల్, టైల్ వర్క్ ను నేర్చుకున్నాడు. ఆ సమయంలో డచ్ ప్రజలకు ప్రత్యేకమౌన నాణ్యాలు చెలామణిలో ఉండేవి. మిగిలిన బ్రిటిష్ ప్రభుత్వంలో రూపాయలు చెలామణిలో ఉండేది. కచ్ రాజాస్థానంలో మహారావు తన స్వంతఖర్చుతో కచ్ రైల్వే స్టేషను నిర్మించాడు.
స్వతంత్రం వచ్చిన తరువాత కచ్ భారతీయ సార్వభౌమ్యం అంగీకరించి రాజాస్థానంగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ 1950 వరకూ ఇండియన్ యూనియన్‌లో కొనసాగింది. 1948 జూన్ 1 న కచ్ రాజాస్థానానికి చోటారావు ఖొవ్షల్దన్ దేశాయి మొదటి కమీషనర్‌గా నిమించబడ్డాడు. ఆయన తరువాత 1952లో సంభాజీరావు అప్పాసాహెబ్ ఘట్గి కమీషనర్ పదవిని చేపట్టాడు. 1956 అక్టోబరు 31 వరకు ఆయన కమీషనర్‌గా కొనసాగాడు. తరువాత నవంబరు 1 నుండి కచ్ రాజ్యం బాంబే స్టేట్‌తో సలుపబడింది. 1960లో బాంబే రాష్ట్రం భాషాపరంగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలుగా విభజించబడింది. కచ్ రాజాస్థానం గుజరాత్ రాష్ట్రంలో భాగంగా మారింది.
1947లో దేశ విభజన సమయంలో సింధు భూభాగం కరాచీ నౌకాశ్రయంతో సహా పాకిస్తాన్లో భాగంగా మారింది. బదులుగా భారతప్రభుత్వం ఖండ్ల వద్ద నౌకాశ్రయం నిర్మించింది. కుచ్ భూభాగం విషయంలో భారత్, పాక్ మధ్య దీర్ఘాకాలం వివాదం సాగింది. ఫలితంగా ఇరుదేశాలకు మధ్య రెండవ కాశ్మీర్ యుద్ధానికి ముందు యుద్ధం జరిగింది. మొత్తం 3,500 చ.కి.మీ భూభాగంలో పాకిస్థాన్‌కు 350 చ.కి.మీ భూభాగం మిగిలిన భూభాగం భారత్‌కు ఇస్తూ అంతర్జాతీయ సరిహద్దురేఖ నిర్ణయించబడింది. 1999 కార్గిల్ యుద్ధం తరువాత కొన్ని వారాల తరువాత వివాదాలు తిరిగి తలెత్తాయి. 185 సంవత్సరాల కాలంలో 90 మార్లు కచ్ ప్రాంతంలో భూకం సంభవించింది. కచ్ ప్రాంతంలో పలు జిల్లాలతో భుజ్ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఐనామహల్తో సహా భుజ్ ఆకర్షణలకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది..
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.