ఇరానీ కప్
From Wikipedia, the free encyclopedia
Remove ads
ZR ఇరానీ కప్ లేదా కేవలం ఇరానీ ట్రోఫీ, (IDFC ఫస్ట్ బ్యాంక్ ఇరానీ ట్రోఫీ) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నిర్వహించే ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంటు. [3] ఇది రంజీ ట్రోఫీ విజేతలకు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకూ మధ్య ప్రతి సంవత్సరం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో వివిధ రాష్ట్రాల రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లు ఉంటారు.
రంజీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌కు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ టోర్నమెంట్ 1959-60 సీజన్‌లో రూపొందించబడింది. దివంగత BCCI ప్రెసిడెంట్ జల్ R. ఇరానీ పేరు దీనికి పెట్టారు. 1928లో BCCI ప్రారంభం నుండి 1970లో మరణించే వరకు అతనికి బిసిసిఐతో అనుబంధం ఉంది.
Remove ads
చరిత్ర
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌కు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకూ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ 1959-60లో ఆడారు. ఈ ట్రోఫీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో దీర్ఘకాలం పాటు కోశాధికారిగా, అధ్యక్షుడిగా చేసిన, ఆటకు గొప్ప పోషకుడైన జల్ ఇరానీ పేరిట స్థాపించారు. మొదటి కొన్ని సంవత్సరాలు, దీన్ని సీజన్ ముగింపులో ఆడేవారు. దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన బిసిసిఐ దానిని సీజన్ ప్రారంభానికి తరలించింది. 1965-66 నుండి 2012-13 వరకు, ఇది కొత్త దేశీయ సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఉండేది. 2013లో, ఇది రంజీ ట్రోఫీ ఫైనల్ ముగిసిన వెంటనే జరిపారు. ఫలితంగా 2012/13 సీజన్‌లో రెండు ఇరానీ కప్ మ్యాచ్‌లు జరిగాయి. అప్పటి నుండి దీన్ని సీజన్ చివరిలో జరుపుతున్నారు. రంజీ ట్రోఫీ ఫైనల్ అయ్యాక కొన్నాళ్లకు దీన్ని జరుపుతారు.[4]
2022లో, ఇరానీ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా, టోర్నమెంట్‌లోని రెండు సీజన్‌లను బ్యాక్‌టు బ్యాక్‌గా (2019–20, 2022–23 ట్రోఫీలు) నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. [5]
Remove ads
విజేతలు
కింది పట్టిక 1959–60 నుండి 2022–23 వరకు ఇరానీ ట్రోఫీ ఫలితాలను చూపుతుంది. [6]
జట్ల వారీగా ప్రదర్శనలు
Remove ads
ప్రసారకులు
BCCI అధికారిక ప్రసారకర్తలు Sports18, JioCinema దీనిని TV, ఇంటర్నెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. BCCI వెబ్‌సైట్ bcci.tv మ్యాచ్ హైలైట్‌లు, స్కోర్‌లను ప్రసారం చేస్తుంది. [8]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads