Remove ads
From Wikipedia, the free encyclopedia
ఆసియా క్రీడలు (ఆంగ్లము : Asian Games), వీటికి ఏషియాడ్ అని కూడా అంటారు. ప్రతి నాలుగేండ్లకొకసారి జరిగే ఈ క్రీడలు వివిధ క్రీడా పోటీల వేదిక. ఆసియా ఖండానికి చెందిన దేశాల క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటారు. దీని నిర్వాహక, నియంత్రణా సంస్థ ఆసియా ఒలంపిక్ మండలి (Olympic Council of Asia), ఈ మండలిని నియంత్రించే సంస్థ అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (International Olympic Committee) (IOC). 1951లో ఢిల్లీలో ప్రారంభమైన ఆసియా క్రీడలలో ప్రతి క్రీడాంశంలోనూ తొలి మూడు స్థానాలకు వరుసగా బంగారు పతకం, వెండి పతకం, కాంస్య పతకం పతకాలు ప్రదానం చేస్తారు.
పోటీదారులు, తమ పౌరసత్వం గల దేశ జాతీయ ఒలంపిక్ కమిటీ ద్వారా తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. పతకాల ప్రదానోత్సవాలలో ఆయా దేశాల జాతీయగీతాలు ఆలాపించి,, పతాకాలు ఎగురవేస్తారు.
15వ ఆసియా క్రీడలు కతర్ లోని దోహాలో జరిగాయి, ఇవి డిసెంబరు 1 నుండి డిసెంబరు 15 2006, వరకూ జరిగాయి. 16వ ఆసియా క్రీడలు చైనా లోని గువాంగ్జౌలో నవంబరు 12 నుండి నవంబరు 27 2010 వరకూ జరుగుతాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఆసియాలోని అనేక దేశాలు, బ్రిటిష్ వారి దాస్యశృంఖనాలనుండి విముక్తి పొందాయి, స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నాయి. ఈ దేశాలు తమ దేశాల మధ్య సయోద్య, సత్సంబాధలకొరకు, క్రీడలు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఆగస్టు 1948 లో లండన్‌లో జరిగిన ఒలంపిక్ క్రీడలు జరిగే సమయాన, భారత ఒలంపిక్స్ కౌన్సిల్ ప్రతినిథి గురుదత్ సోంధి, ఆసియా క్రీడల గురించి తన అభిప్రాయాలను ప్రకటించాడు. ఆసియా దేశాలు, ఈ విషయాన్ని అంగీకరించి, ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ తన అంగీకారాన్ని తెలిపింది. 1949 లో ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సమావేశమై ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి, 1951 లో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరపాలని నిశ్చయించాయి. ఈ క్రీడలు ప్రతి నాలుగేండ్లకొకసారి జరపాలని కూడా నిశ్చయించాయి.
1962 లో చైనా, ఇస్రాయేలు లను ఈ ఫెడరేషన్ లో సభ్యత్వాన్ని నిరాకరించింది. ఇండోనేషియా, చైనా, ఇస్రాయేలుల సభ్యత్వాన్ని నిరాకరించింది. 1970 లో దక్షిణ కొరియా, ఉత్తరకొరియా నుండి అపాయాల సాకుతో ఈ క్రీడలను అతిథ్యమివ్వడానికి నిరాకరించింది. 1973లో అమెరికా సన్నిహిత దేశాలు చైనా సభ్యత్వాన్ని నిరాకరించగా, అరబ్బు దేశాలు ఇస్రాయేలు సభ్యత్వాన్ని నిరాకరించాయి. 1977 లో పాకిస్తాన్ ఈ క్రీడలకు అతిథ్యమివ్వడానికి నిరాకరించింది, కారణం భారతదేశం, బంగ్లాదేశ్ లతో యుద్ధాలుండడం. ఈ నిరాకరణల సందర్భాలలో ఈ క్రీడలను బాంకాక్ థాయిలాండ్‌లో నిర్వహించారు.
1994 ఆసియా క్రీడలలో, ఇతర దేశాల తిరస్కారాలున్ననూ, ఓ.సీ.ఏ., వెనుకటి సోవియట్ యూనియన్ కు చెందిన రిపబ్లిక్కులైన కజకస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్, తజికిస్తాన్ లను సభ్యులుగా అంగీకరించింది.
2006 లో ఆస్ట్రేలియా అభ్యర్థనను, ఓ.సీ.ఏ. ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ అల్-ఫహద్ అల్-సబా తిరస్కరించాడు. దీని కారణం, ఆస్ట్రేలియాకు సభ్యత్వమిస్తే, ఓషియానియాకు చెందిన అనేక చిన్న దేశాలు నష్టపోతాయని.[1] క్రికెట్‌ను 2010 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు.[2]
1951లో మొదటి ఆసియా క్రీడలు భారత దేశంలోని ఢిల్లీలో జరిగాయి. ఆ తరువాత మళ్ళీ 1982లో 9వ ఆసియా క్రీడలకు వేదిక కూడా ఢిల్లీ అయింది.
సంవత్సరం | క్రీడలు | ఆతిథ్యమిచ్చిన నగరం | దేశము |
---|---|---|---|
1951 | I | ఢిల్లీ | భారతదేశం |
1954 | II | మనీలా | ఫిలిప్పైన్స్ |
1958 | III | టోక్యో | జపాన్ |
1962 | IV | జకార్తా | ఇండోనేషియా |
1966 | V | బాంకాక్ | థాయిలాండ్ |
1970 | VI 1 | బాంకాక్ | థాయిలాండ్ |
1974 | VII | టెహరాన్ | ఇరాన్ |
1978 | VIII 2 | బాంకాక్ | థాయిలాండ్ |
1982 | IX | ఢిల్లీ | ఇండియా |
1986 | X | సియోల్ | దక్షిణ కొరియా |
1990 | XI | బీజింగ్ | చైనా |
1994 | XII | హిరోషిమా | జపాన్ |
1998 | XIII | బాంకాక్ | థాయిలాండ్ |
2002 | XIV | బుసాన్ | దక్షిణ కొరియా |
2006 | XV | దోహా | కతర్ |
2010 | XVI | గువాంగ్జో | చైనా |
2014 | XVII | ఇంచియోన్ | దక్షిణ కొరియా |
1 అసలు ఆతిథ్యమిచ్చినది దక్షిణ కొరియా
2 అసలు ఆతిథ్యమిచ్చినది పాకిస్తాన్
క్రింద నుదహరింపబడిన క్రీడలు ఆడబడుతాయి, వాటి ప్రక్కనే అవి ప్రవేశపెట్టబడిన సంవత్సరం చూడవచ్చును.
|
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.