హాకీ

From Wikipedia, the free encyclopedia

హాకీ అనేది ఒక క్రీడా కుటుంబము. హాకీ క్రీడలో, రెండు జట్లు ఒక బంతిని లేదా ఒక పక్కు అనబడు ఒక రబ్బరు ముక్కని తమ పోటీదారుల గోలులలో వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రపంచంలో వేరు వేరు భాగాలలో, అక్కడ ఆడబడే ప్రముఖ హాకీ జాతి క్రీడని ఉత్త 'హాకీ' అని వ్యవహరిస్తుంటారు.ఈ హాకీని మన భారతదేశం లోనే మొదటి సాదాగా కనుగొన్నారు.

మైదాన హాకీ

ముఖ్య వ్యాసము: మైదాన హాకీ

Thumb
మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో హాకీ ఆడుతున్న క్రీడాకారులు.

ఇది భారతదేశంలో ఎక్కువగా అడే హాకీ రకము. దీనిని భారతదేశంలో హాకి అనే పరిగణిస్తాhockey team

రు.

దీనిని మట్టి నేల మీద, గడ్డిమీద, కృత్రిమ గడ్డి మీద ఆడతారు. ఇక్కడ ఒక చిన్న గట్టి బంతిని ప్రత్యర్థుల గోలులో వెయ్యాలి. దీనిని ప్రపంచమంతట స్త్రీ పురుషులు విరివిగా ఆడతారు. ప్రముఖంగా దీనిని ఐరోపాలో, భారత ఉపఖండంలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, దక్షణాఫ్రికాలో ఆడతారు. మాములుగా రెండు పక్షాలలో ఉంటే అందరూ మగ లేదా అందరూ ఆడ వారు ఉంటారు, కాని అప్పుడప్పుడు కలసి కూడా అడుతుంటారు. అమెరికా సంయుక్త రాష్టాలలో, కెనడాలో మగవారికంటే ఆడవారు ఎక్కువగా ఆడుతుంటారు.

మైదాన హాకీని అంతర్జాతీయ హాకీ సంఘం అనబడు 116 సభ్యుల సంఘం పర్యవేక్షిస్తుంది. ఈ క్రీడను 1924లో తప్ప 1908 నుండి అన్ని వేసవి ఒలింపిక్సులలో అడుతున్నారు.

హాకీలో వాడబడు కర్ర ఆంగ్ల అక్షరమైన జె (J) ఆకారంలో ఉంటుంది. దీనిని చెక్కతో గాని గాజు లేదా కార్బను ఫైబరుతో తయారు చేస్తారు. బంతిని తాకు పక్క తిన్నగాను, వెనక పక్క కోలగానూ ఉంటుంది.

నాలుగు వేల ఏళ్ళ నాటి ఈజిప్టు చిత్రాలలో హాకీ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆధునిక హాకీ 18వ శతాబ్దం ఇంగ్లాండు బడులలో ఆడడం మొదలు పెట్టారు. 19వ శతాబ్దంలో ఇది ఒక గుర్తింపగల క్రీడగా స్థిర పడింది. మొదటి క్లబ్బు 1849లో లండనులోని బ్లాక్‌హీత్ లో స్థాపింపబడింది.

ఐసు హాకీ

Thumb
ఐసు హాకీ ఆడుతున్న జట్లు

ఐసు హాకీని గడ్డ కట్టిన నీటి పైన ఆడతారు. ఇందులో బంతికి బదులుగా పక్ 3 అంగుళాల రబ్బరు బిళ్ళను వాడతారు. ఈ పక్కుని పెద్ద మ్యాచిల ముందు బాగా చల్ల బేడతారు. దాని వలన అది ఐసు మీద బాగా జారగలదు. ఇందులో ఇంకో ముఖ్యమైన అంశం ఏఁవిటంటే, ఆటగాళ్ళు ఐసుతలం పై స్కేటుల పై కదలడం. దాని వలన వారు చాలా వేగంగా కదలగలరు. ఈ తరహా హాకీని ఉత్తర అమెరికా, ఐరోపా, ప్రపంచంలో ఇతరదేశాలలో ఎక్కవగా ఆడుతుంటారు.

ఈ క్రీడని 64 సభ్యుల అంతర్జాతీయ ఐసు హాకీ సంఘం పర్యవేక్షసిస్తుంది. పురుషుల ఐసు హాకీని శీతల ఒలింపిక క్రీడలలో 1924 లో ప్రవేశ పెట్టారు. 1920 లో ఇది వేసవి ఒలింపిక్సులో ఆడబడింది. స్త్రీల ఐసు హాకీని శీతల ఒలింపిక క్రీడలలో 1998 లో ప్రవేశ పెట్టారు. ఉత్తర అమెరికాలోని జాతీయ హాకీ లీగు (NHL) ప్రపంచంలోని అతి పెద్ద హాకీ లీగు. ఇక్కడికి ప్రపంచంలోని అతి ప్రజ్ఞాశాలలైన హాకీ క్రీడాకారులు వస్తుంటారు. NHLలో హాకీ నిభంధనలకీ ఒలింపిక్సులో హాకీ నిభంధనలకీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి.

ఐసు హాకీలో వాడే కర్ర పొడవుగా L ఆకారంలో ఉంటుంది. వాటిని చెక్కతోగాని, గ్రాఫైట్ తో గాని, లేద ఇతర కాంపోజిట్ పదార్థాలతో తయారు చేస్తారు. వీటికి క్రంది భాగంలో బ్రేడు ఉంటుంది. ఆ బ్లోడు ఆటవారి జిత్తుకు తోడ్పడడానికి కొద్దిగా వక్రంగా ఉంటుంది. ఈ కర్రలకు ప్లెక్సు సంఖ్య అనే ఒక స్వభావం ఉంటుంది. ఈ సంఖ్య కర్ర ఎంత వరకూ వంగగలదో తెలుపుతుంది. అలా వంగే కర్రలతో ఆగి ఉన్న పక్కును ఇంకా వేగంగా గోలు వైపు పంపవచ్చు. దీనినే స్లేప్ షాట్ అంటారు.

హాకీ లాంటి క్రీడలని ఐసు పై ఆడే చరిత్ర నెథర్లాండ్సులోనూ, కెనడాలోనూ 19 శతాబ్ధపు ఆదినుండి ఉంది, కాని క్రమబద్దమైన ఐసు హాకీని పుట్టించిన ఘనత మాంట్రియాల్ లోని మెక్ గిల్ విశ్వవిద్యాలయ విద్యార్థలుకే చెందుతుంది. వారు మొదటి హాకీ ఆటలను 1875లో ఆడారు.

వీధి హాకీ

Thumb
వాషింగ్టన్ లో రోడ్ హాకీ ఆడుతున్న దృశ్యం

దీనిని వీధులలో స్కేటులు వేసుకోని ఆడతారు. ఇక్కడ బంతిని ఉపయోగిస్తారు. ఇక్కడ రక్షణా కవచాలు ఎక్కవగా ధరించకపోవడం వల్ల, తోసుకోవడాలు గెంటు కోవడాలు కుదరవు.

చక్రాల హాకీ

రెండు చక్రాలపై హాకీ

ఇది ఐసు హాకీని కొద్దిగా మార్చి తయారు చేయబడినది, అందుకే ఇది అచ్చం ఐసు హాకీ లా ఉంటింది, కాని ఐసు ఉండదు. ఇందులో నాలుగు ఆటగాళ్ళు ఒక గోలీ ఉంటారు.

నాలుగు చక్రాలపై హాకీ

ద్విచక్ర స్కేట్లు రాక ముందు నుండి హాకీని నాలుగు చక్రాల స్తేట్లపై ఆడడం జరిగింది. దానినే క్వాడ్ హాకీ అని రోలర్ హాకీ అని అంటారు. రోలర్ హాకీ 1992 బాల్సిలోనా ఒలింపిక్ క్రీడలలో ప్రదర్శనా క్రీడగా ఆడడం జరిగింది.

హాకీ లో ఇతర రకములు

హాకీ లేదు దాని పూర్వీకుల ఆధారంగా తయారుచేయబడ్డ వేరే క్రీడలు

  • బాల్ హాకీ
  • గాలి హాకీ, దీనిని టేబుల్ మీద పక్ తో ఇద్దరు ఇండోర్ ఆటగా ఆడతారు.
  • బ్యాండి, దీనిని కూడా ఐసు మీద ఆడతారు ! దీనికీ ఫుట్ బాల్ కి చాలా పోలిక. దీనిని శీతాకాలంలో గడ్డకట్టేసిన సరస్సుల మీద బంతితో ఆడతారు.
  • బ్రూంబాల్, ఐసు హాకీని ఐసు లేకండా, బంతితో ఆడడం.
  • బుడగ హాకీ, దీనిని బల్ల మీద ఆడతారు బొమ్మ క్రీడాకారులతో.
  • పోలో, గుఱ్ఱాల మీద స్వారీ చేస్తూ హాకీ లాంటి ఆట ఆడడం.

మూలాలు

బాహ్య లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.