ఆఫ్ స్పిన్ అనేది క్రికెట్‌లో ఒక రకమైన వేళ్ళతో స్పిన్ చేసే బౌలింగు. ఈ పద్ధతిని ఉపయోగించే బౌలర్‌ను ఆఫ్ స్పిన్నర్ అంటారు. ఆఫ్ స్పిన్నర్లు కుడిచేతి వాటం స్పిన్ బౌలర్లు. వారు బంతిని స్పిన్ చేయడానికి వేళ్లను ఉపయోగిస్తారు. వారి సాధారణ డెలివరీ ఆఫ్ బ్రేక్. [1] పిచ్‌పై బంతి బౌన్స్ అయ్యాక, ఎడమ నుండి కుడికి (బౌలరు వైపు నుండి చూస్తే) తిరుగుతుంది. కుడిచేతి వాటం బ్యాటరుకు, ఇది ఆఫ్ సైడ్ నుండి లెగ్ సైడ్ వైపు పోతుంది (అంటే కుడిచేతి వాటం బ్యాటరు మీదికి లేదా ఎడమచేతి వాటం బ్యాటరు‌ నుండి దూరంగా). బంతి ఆఫ్ సైడ్ నుండి బ్రేక్ అయి పోతుంది కాబట్టి, [2] దీనికి 'ఆఫ్ బ్రేక్' అని పేరు వచ్చింది.

ఒక సాధారణ ఆఫ్ స్పిన్ డెలివరీ యానిమేషన్, ఓవర్ ది వికెట్ నుండి బౌల్ చేయబడింది.

ఆఫ్ స్పిన్నర్లు ఎక్కువగా ఆఫ్ బ్రేక్‌లను బౌలింగ్ చేస్తారు, డెలివరీల లైన్‌ను, లెంగ్తునూ మారుస్తూ బంతుల్లో వైవిధ్యాన్ని తీసుకొస్తారు. ఆఫ్ స్పిన్నర్లు విభిన్నంగా స్పిన్నయ్యే ఇతర రకాల డెలివరీలను కూడా వేస్తారు. స్పిన్‌లో ఈ వైవిధ్యాలను పక్కన పెడితే, ఆఫ్ స్పిన్నరుకు బంతి వేగం, లెంగ్తు, ఫ్లైట్ మారడం కూడా ముఖ్యమైనవి.

టెస్ట్ మ్యాచ్‌లు, వన్‌డేల చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు ముత్తయ్య మురళీధరన్ ఆఫ్ స్పిన్నరే. [3]

చరిత్ర

ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, గతంలో బౌలర్లు ఆఫ్-బ్రేక్ చర్యను ఉపయోగించేవారు. వారు ఉద్దేశపూర్వకంగా బంతిని పెద్దగా స్పిన్‌ చేయకుండా వేస్తారు. బ్యాటరును నిస్పృహ పరచేందుకు లైను, లెంగ్తులపై (లేదా వేగ వైవిధ్యాలు కూడా)పై ఆధారపడతారు. వారు బ్యాటరు గట్టిగా షాట్ కొట్టలేని ప్రాంతంలో బంతిని వేస్తారు. బ్యాటరు క్రీజులో కదిలుతూంటే దాన్ని బట్టి చివరి క్షణంలో సర్దుబాట్లు కూడా చేసుకుంటారు. ఇది ప్రాథమికంగా రక్షణాత్మక బౌలింగు శైలి. అయితే, వికెట్లు సాధించడానికి, బ్యాటరు‌ను దురుసుగా ఆడేందుకు ప్రలోభపెట్టేలా వేయడం లేదా స్టంప్సు మీదికి నేరుగా బౌలింగ్ చేస్తారు. వికెట్ తీసుకునే మరొక పద్ధతి ఏమిటంటే, బంతిని సాధారణం కంటే ఎక్కువ స్పిన్‌ చెయ్యడం.

అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మరింత సాహసోపేతమైన బ్యాటింగు పద్ధతులను అవలంబిస్తున్నందున, ఈ తరహా బౌలింగ్ క్షీణించింది. అయితే కొంతమంది ఆఫ్-స్పిన్నర్లు పిచ్‌పై పెద్దగా టర్న్ లేనపుడు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. కేన్ విలియమ్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అప్పుడప్పుడు బౌలింగ్ చేసినప్పుడు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తాడు. ఎందుకంటే అతని బౌలింగ్ శైలి ఫ్లాట్‌గా, వేగంగా ఉంటుంది.

ఇతర రకాల స్పిన్ బౌలింగ్‌తో పోలిక

Thumb
నాథన్ లియాన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్

ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్‌లలో తేడా ఏంటంటే, లెగ్ స్పిన్‌లో బంతి లెగ్ నుండి ఆఫ్‌ వైపుకు తిరుగుతుంది. ఇది చాలా భిన్నమైన యాక్షనుతో (మణికట్టు స్పిన్) బౌల్ చేస్తారు.[4] సాధారణంగా ఆఫ్ స్పిన్ వేయడం లెగ్ స్పిన్ కంటే తక్కువ కష్టంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆఫ్ బ్రేక్‌లు సాధారణంగా లెగ్ బ్రేక్‌ల కంటే తక్కువగా స్పిన్ అవుతాయి. లెగ్ బ్రేక్‌లకు ఉండే లూపు, మోసపూరితమైన ఫ్లైటు వీటికి ఉండవు. దానికి తోడు, ఆఫ్ స్పిన్‌లో ఎక్కువ వైవిధ్యమైన బంతులుండవు. ఆఫ్ స్పిన్‌లో బంతి, కుడిచేతి వాటం బ్యాటరు శరీరం మీదికి పోతుంది. అంటే బ్యాట్‌ బంతిని మిస్సైతే, లేదా అంచుకు తగిలినా బ్యాటరు కాళ్లు బంతి మార్గంలో ఉంటాయి. దీనివలన బ్యాటరు‌ను బౌల్డ్ చేయడం, లేదా ఆఫ్ బ్రేక్ నుండి క్యాచ్ ఇవ్వడం బౌలర్‌కు కష్టతరం చేస్తుంది. అయితే లెగ్ స్టంప్‌ను మిస్ అయ్యేంతగా బంతి తిరగలేదని భావించి లెగ్ బిఫోర్ వికెట్ అయ్యే అవకాశం ఉందని దీని అర్థం కాదు. అయితే, ఆఫ్ స్పిన్నరు లెగ్ స్పిన్నరు కంటే వేగంగా, మరింత ఖచ్చితంగా బౌలింగ్ చేస్తాడు. అందువల్ల బంతి వేగంలో మార్పులతో బ్యాటరు‌ను మోసం చేయవచ్చు. ఎడమచేతి వాటం బ్యాటరుకు ఆఫ్ బ్రేక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే బంతి అతని శరీరం నుండి దూరంగా పోతుంది. దీనర్థం సరైన అంచనా వేయకపోతే, బ్యాటు వెలుపలి అంచుకు తగిలి క్యాచ్‌కు దారి తీస్తుంది.

ఆఫ్ స్పిన్నర్ వలె అదే (ఫింగర్ స్పిన్) యాక్షనుతో బౌలింగు చేసే ఎడమ చేతి బౌలర్‌ను లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలరు అని పిలుస్తారు. ఆర్థడాక్స్ స్పిన్నర్ యాక్షను ఆఫ్-స్పిన్నర్ లాగానే ఉంటుంది గానీ, బంతి వ్యతిరేక దిశలో తిరుగుతుంది (కుడి చేతి లెగ్ స్పిన్నరు తిప్పినట్లుగా). [5] అటువంటి బంతిని సాధారణంగా ఆఫ్ బ్రేక్ అని పిలవరు, ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్నర్ అని అంటారు.

పరిభాష

ఆఫ్ స్పిన్: కొన్నిసార్లు ఆఫ్ స్పిన్ అనే పదాన్ని ఆఫ్ బ్రేక్ డెలివరీ అని అర్థంలో ఉపయోగిస్తారు. [6] [7] [8] [9] ఇతర సమయాల్లో ఆఫ్ స్పిన్ అనే పదానికి విస్తృతమైన అర్థంలో ఆఫ్ స్పిన్నర్ వేసే అన్ని రకాల డెలివరీలను, ఆఫ్ బ్రేక్ కాని డెలివరీలను కూడా కలిపి చెబుతారు.[10] [11] [12]

ఆఫ్ స్పిన్నర్: ఆఫ్ స్పిన్నర్ అనే పదాన్ని బౌలరు [13] [14] లేదా ఆఫ్ బ్రేక్ డెలివరీ అని అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. [15] [16] [17] [9]

సాంకేతికత

బంతిని అరచేతిలో పట్టుకుని ఆఫ్ బ్రేక్ వేస్తారు. సీమ్ అడ్డంగా అన్ని వేళ్ల క్రింద ఉంటుంది. [2] బంతి విడుదలైనప్పుడు, వేళ్లు బంతిని కుడి వైపున (కుడిచేతి వాటం బౌలరు కోసం) క్రిందికి దొర్లిస్తూ, బంతిని సవ్యదిశలో (వెనుక నుండి చూసినపుడు) స్పిన్ చేస్తారు.

చెప్పుకోదగ్గ ఆఫ్ స్పిన్నర్లు

ప్రముఖ ఆఫ్ స్పిన్నర్లు:

ఆఫ్ స్పిన్ బౌలర్లు వేసే ఇతర డెలివరీలు

ఆఫ్ స్పిన్నర్ అమ్ములపొది లోని మరొక సాధారణ ఆయుధం ఆర్మ్ బాల్. ఇది స్పిన్ చేయదు కానీ "చేయి తిరిగే దిశలోనే" నేరుగా వెళ్తుంది. [21] మరింత నైపుణ్యం కలిగిన ఆఫ్‌స్పిన్నర్లు టాప్‌స్పిన్నరు కూడా వేస్తారు.[22]

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.