Remove ads

నీరు, ఉదకం లేదా జలం (సాంకేతిక నామం H2O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనే జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం (సముద్రాలు, నదులు, తటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.

ద్రవీకృత నీటి బిందువు
ఘనీభవనం చెందిన నీటి దిమ్మ (మంచు)
వాతావరణంలో మేఘాల రూపంలో ఉన్న నీటి ఆవిరి
Remove ads

భాషా విశేషాలు

తెలుగు భాషలో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. నీరే ప్రాణాధారం అని ఒక పద్యంలో ప్రయోగముంది. భగవద్గీత...... యజ్ఞంవలన వర్షం, వర్షంవలన నీరు లభింస్తుందని చెప్పబడింది.

నీటి చక్రం

Thumb
నీటి చక్రం.

నీరు ఈ భూమండలంపై 71 శాతానికి పైగా ఆవరించి ఉంది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) ఈ నీటి చక్రము అనగా నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి ద్రవ రూపంలోనికి నిరంతరము మారుతూ వుంటుంది.

నీటి స్థితులు

భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ, వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని వేడిమికి ఆవిరి రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి ఆకాశం నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, నదులు, జలాశయాలు.... ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.

జలకాలుష్యము

నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత మేఘాలు వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.

Remove ads

జీవ శాస్త్రం

జీవం నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి.

జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదా: రక్తం, శోషరసం, మూత్రం.

మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే.

మనకు నీళ్ళవల్ల చాలా లాభాలు ఉన్నాయి

  1. ఇది వాతావరణ పీడనాలనుండి మనల్ని కాపాడుతుంది
  2. శరీరంలో రవాణా సౌకర్యాలు కలిగిస్తుంది
  3. చెత్తని బయటకి పంపిస్తుంది
Remove ads

నీటివనరులు

నీరు లభించే ప్రదేశాలు భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతుంది. వీటిని అన్నింటిని ఆ ప్రాంతపు నీటివనరులు (Water Resources) అంటారు.

స్వచ్ఛమైన నీరు

స్వచ్ఛమైన నీరు త్రాగుటకు అవసరము. మనకు అందుబాటులో వున్న నీరు వివిధ రకాలుగా కలుషితమైనది. దీనిని త్రాగుటకు యోగ్యమైనదిగా చేయటానికి చాలా రకాల పద్ధతులున్నాయి.

  • వేడి చేయుట
  • ఆధునిక పద్ధతులు (రివర్స్ ఆస్మోసిస్)

గ్రామాలలో రక్షిత మంచినీటి కేంద్రం ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు.

మంచి నీరు

స్వచ్ఛమైన త్ర్రాగు నీరు ఎలా ఉండాలంటే?:

  • లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు.
  • నైట్రైట్‌ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్‌ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు.
  • హెచ్‌.టు.ఎస్‌. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి మారితే బ్యాక్టీరియా ఉన్నట్లే.
  • ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
  • నీటి స్వచ్ఛతను పి.హెచ్‌. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్‌. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి.
  • లీటరు నీటిలో 2 వేల వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటే తాగేందుకు మంచిదే. అంతకు మించి ఖనిజాలు ఉండకూడదు.
  • ఒక లీటరు నీటిలో ఆల్‌కలైనిటి 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు.
  • ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు.
  • లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు
  • 400 మిల్లీగ్రాముల సల్ఫేట్స్‌ ఉండాలి.
  • లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల క్లోరైడ్‌ కణాలుండవచ్చు.
  • మెగ్నీషియం కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి.
Remove ads

తాగునీటిని వృథా చేస్తే జైలు

ముంబయిలో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో https://luckypatcherapk.wiki/జరుగుతున్నట్లు%5B%5D దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads