ఉప్పు నీటిని పెద్ద భాగం From Wikipedia, the free encyclopedia
మహా సముద్రం లేదా మహాసాగరం, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు మిలియనుకు 35 వంతులు (3.5%). దాదాపు అన్ని సముద్ర జలాల సెలైనిటీ మిలియనుకు 31 నుండి 38 వంతులు ఉంటుంది. మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం[1] .
ఐదు మహాసముద్రాలు అని చెప్పబడుతున్నా గాని ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును.[2][3]. ఈ విషయం జలావరణ శాస్త్రం అధ్యయనంలో ప్రధానమైన అంశం.[4]
మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను సముద్రాలు, సింధుశాఖలు అని అంటారు. అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల, సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). కాస్పియన్ సముద్రం, అరల్ సముద్రం, గ్రేట్ సాల్ట్ లేక్ ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు.
భౌగోళికంగా మహాసముద్రం అంటే భూగోళంపై నీటితో కప్పబడిన "సముద్రపు అడుగు". (ఓషియానిక్ క్రస్ట్). Oceanic crust is the thin layer of solidified volcanic basalt that covers the Earth's mantle where there are no continents.
.
మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. (139 మిలియన్ చదరపు మైళ్ళు.).[5] మొత్తం ఘన పరిమాణం (volume) సుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. (310 మిలియన్ క్యూబిక్ మైళ్ళు.),[6] సరాసరి లోతు 3,790 మీటర్లు (12,430 అడుగులు).[5] సముద్రాలలో సగం పైగా నీరు 3,000 మీటర్లు (9,800 అడుగులు) కంటే ఎక్కువ లోతుగా ఉంది.[3] భూమి ఉపరితలం పైని 71% సముద్రంతో కప్పబడి ఉంది.[7] (వేరుగా ఉన్న సముద్రాలు కాకుండా).
మొత్తం హైడ్రోస్ఫియర్ మాస్ 1.4 × 1021 కిలోగ్రాములు. అంటే భూమి మాస్‌లో 0.023%. ఇందులో 2% లోపే మంచినీరు, మిగిలినది (అధికంగా సముద్రాలలో ఉన్న) ఉప్పునీరు.
సముద్రాలు నీలంగా ఉంటాయని అభిప్రాయం ఉంది. కాని ఇది నిజం కాదు. నీటికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ అది అతిపెద్ద పరిమాణాలలో మాత్రమే కనుపిస్తుంది. ఆకాశం ప్రతిబింబం కూడా సముద్రం నీలంగా కనుపించడానికి కొద్దిగా దోహదం చేస్తుంది. కాని అది ప్రధాన కారణం కాదు.[8] నీటి కణాల కేంద్రాలు తమపై బడిన కాంతిలో ఎరుపు రంగు ఫోటానులను గ్రహిస్తాయి. వైబ్రేషనల్ డైనమిక్స్ ద్వారా (ఎలక్ట్రానిక్ డైనమిక్స్ కాకుండా) ప్రకృతిలో రంగు మార్పిడి సంభవించడానికి ఇది ఒకే ఒక ఉదాహరణ.[9]
పురాతన కాలంనుండి మానవుడు సముద్రాలపై ప్రయాణిస్తున్నప్పటికీ సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం ఇటీవల కాలంలోనే సాధ్యమయ్యింది.
ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్ (Marianas Trench . ఇది పసఫిక్ మహాసముద్రంలో ఉత్తర మెరియానా దీవులు ప్రాంతంలో ఉంది. దీని అత్యధిక లోతు 10,923 మీటర్లు (35,838 అడుగులు) [10] . 1951 బ్రిటిష్ నౌక "చాలంజర్ II" చే ఇది సర్వే చేయబడింది. అప్పుడు ఈ ట్రెంచ్‌లో అత్యంత లోతైన చోటుకు ఛాలెంజర్ డీప్ (Challenger Deep) అని పేరు పెట్టారు. 1960లో ట్రెయిస్టి అనే 'బాతీస్ఫియర్ ఇద్దరు మనుషులతో ఈ ఛాలెంజర్ డీప్ అడుగు భాగానికి చేరుకొంది.
ఇప్పటికీ సముద్రాంతరతలం చాలావరకు అన్వేషించబడలేదు.
సముద్ర భాగాలు అక్కడి భౌతిక, జీవ లక్షణాలను బట్టి, లోతును బట్టి కొన్ని ప్రాంతాలుగా విభజింపబడుతున్నాయి.
పైన చెప్పిన విధంగా పెలాజిక్ జోన్ను ఫోటిక్ జోన్లో ఎపిపెలాజిక్ జోన్ అంటారు. అఫోటిక్ జోన్లో పెలాజిక్ జోన్ను లోతును బట్టి మరి నాలుగు విధాలుగా విభజించారు.
పైన చెప్పిన పెలాజిక్ అఫోటిక్ జోన్తో బాటు బెంతిక్ అఫోటిక్ జోన్లు ఉన్నాయి. ఇవి మూడు లోతైన జోన్లు.
మరో విధంగా పెలాజిక్ జోన్ను రెండు ఉప ప్రాంతాలుగా విభజింపవచ్చును.
పెలాజిక్ జోన్ అన్ని వేళలా నీటి అడుగు భాగంలో ఉంటుంది. కాని లిట్టొరల్ జోన్ ప్రాంతం ఆటు, పోటుల హద్దుల మధ్య ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే ఈ భాగం పోటు సమయంలో మాత్రమే నీటి అడుగున ఉంటుంది. ఈ ప్రాంతలోనే భౌగోళికంగాను, జీవ వైవిధ్యం పరంగాను భూతలం లక్షణాలనుండి సముద్రాంతర లక్షణాలు రూపాంతరం చెందడం గమనించవచ్చును. ఈ ప్రాంతాన్ని ఇంటర్ టైడల్ జోన్ అని కూడా అంటారు.
భూమి వాతావరణాన్ని సముద్రాలు చాలా పెద్దయెత్తున ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలకు, తుఫానులకు, ఇతర గాలులలకు సముద్రాలే పుట్టినిళ్ళు. సముద్రాంతర్గతంగా ప్రవహించే ప్రవాహాలు (ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు) సమీప ఖండాలలో ఉష్ణోగ్రతను బాగా ప్రభావితం చేస్తాయి. భూమిపైని వాతావరణం ఉష్ఞోగ్రత నియంత్రించడంలోను, కొన్ని వాయువులను పీల్చుకోవడంలోనూ సముద్ర జలాలు చాలా ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.