మార్చి 7: పోర్చుగల్‌ను ప్రాన్సు ఆక్రమించడంతో పోర్చుగీసు యువరాజు, అతడి కుటుంబమూ పోర్చుగీసు రాజదర్బారును బ్రెజిల్ లోని రియో డి జనీరో నగరానికి తరలించారు. దాంతో యావత్తు పోర్చుగీసు సామ్రాజ్యానికి ఇది కేంద్రమైంది.
ఏప్రిల్: పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆ సంవత్సరం అక్కడి సముద్రపు గాలి చుట్టుపక్కల గాలి ఉష్ణోగ్రత పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు గాలి ఉష్ణోగ్రతలు ఐదేళ్ళ పాటు తగ్గిపోయాయి. [2]
జూన్ 15: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
జూన్ 30: హంఫ్రీ డేవీ ఒక కొత్త మూలకాన్ని కునుగొని దానికి బొరాసియం అని పేరు పెట్టాడు. దానికే తరువాత బోరాన్ అని పేరు పెట్టారు.[3] ఇదే సంవత్సరం కాల్షియం మూలకాన్ని కూడా కనుగొన్నాడు
సెప్టెంబరు 29: రష్యా ఫిన్లాండుల మధ్య సంధి కుదిరింది. కాని అక్టోబరు 19 న ఇది భగ్నమైంది.
Chenoweth, M. (2001), Two major volcanic cooling episodes derived from global marine air temperature, AD 1807–1827, Geophys. Res. Lett., 28(15), 2963–2966, doi:10.1029/2000GL012648.