జనవరి: ఫ్రాన్స్ స్పెయిన్పై యుద్ధాన్ని ప్రకటించింది. ఇది క్వాడ్రపుల్ అలయన్స్ యొక్క 2 సంవత్సరాల యుద్ధానికి దారితీసింది.
మే: దక్షిణ కెరొలినాలోని చార్లెస్టన్ నౌకాశ్రయాన్ని దిగ్బంధించడానికి ఇంగ్లీష్ సముద్రపు దొంగ బ్లాక్ బేర్డ్ నాలుగు నౌకలలో 400 మంది నావికులతో దాడి చేసాడు.
జూన్: సముద్రపు దొంగలు బ్లాక్బియర్డ్, బోనెట్ లు నార్త్ కరోలినాలోని బాత్లో ఆశ్రయం పొందారు, అక్కడ గవర్నర్ చార్లెస్ ఈడెన్ వారికి, వారి సిబ్బందికీ క్షమాభిక్ష ప్రసాదించాడు
జూన్ 16: బాడెన్ ఒప్పందం (1718) కుదరడంతో టోగెన్బర్గ్ యుద్ధం ముగిసింది. .
అక్టోబరు: స్టెడ్ బోనెట్ ను అతని సిబ్బందిని కేప్ ఫియర్ నది ముఖద్వారం దగ్గర బంధించి దక్షిణ కెరొలినా లోని చార్లెస్టన్కు తీసుకువెళతారు. అక్కడ వారి నేరాలను విచారించి దోషులుగా తేల్చి మరణశిక్ష విధించారు.
అక్టోబరు 24: స్టెడ్ బోనెట్ జైలు నుండి తప్పించుకున్నాడు.
నవంబరు 8: 22 మంది స్టెడే బోనెట్ యొక్క పైరేట్ సిబ్బందిని చార్లెస్టన్ వద్ద ఉరితీశారు.
నవంబర్ 22: బ్లాక్బియార్డ్ క్షమాభిక్ష ఒప్పందం ఉల్లంఘించినట్లు పేర్కొంటూ, వర్జీనియా గవర్నరు ఉత్తర కరోలినాకు రాయల్ నేవీ బృందాన్ని పంపాడు. అక్కడ వారు బ్లాక్ బేర్డ్ ను చంపేసారు.
డిసెంబర్ 10: తిరిగి అదుపు లోకి తీసుకున్న తరువాత స్టెడ్ బోనెట్ను చార్లెస్టన్ వద్ద ఉరితీశారు.