పంజాబ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
హోషియార్పూర్ జిల్లా (పంజాబీ: ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ), ఉత్తర భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని జిల్లా. ఇది, పంజాబ్ లోని పురాతన జిల్లాలలో ఒకటి. దీనికి వాయవ్యంలో గురుదాస్పూర్ జిల్లా, నైరుతిలో జలంధర్, కపుర్తలా జిల్లాలు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్ జిల్లాలైన కాంగ్రా, ఊనా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. హోషియార్పూర్ జిల్లాలో 4 ఉప డివిజన్లు, 10 కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్, 9 పట్టణ స్థానిక సంస్థలు, 1417 గ్రామాలు ఉన్నాయి. ఈ జిల్లా 3365 కిమీ వైశాల్యం కలిగి ఉంది. జనాభా 2001 గణన ప్రకారం 14,80,736 జనాభా కలిగి ఉంది.
హోషియార్పూర్ పంజాబులో సాంస్కృతిక కేంద్రాలలో (నవంషహర్, కపుర్తల, జలంధర్) ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లా బియాస్, సట్లైజ్ మద్యన ఉపస్థితమై ఉంది. షివాలిక్ పర్వతపాదప్రాంతంలో చండీఘడ్ - పఠాన్‌కోట కుడివైపున ఉపస్థితమై ఉన్న హోషియార్పూర్ పర్వతమయంగా ఉంటుంది. ఈప్రాంతాన్ని కండి అంటారు.బియాస్,సట్లైజ్ నదులు, ఇతర సెలయేరులు ఈప్రాంతానికి అవసరమైన నీటిని అందిస్తున్నాయి. అదనంగా కండి ప్రాంతం అంతటా సీజనల్ సెలయేరులు ప్రవహిస్తుంటాయి.
జిల్లా కొండపాత్రం, మైదానప్రాంతంగా రెండుగా విభజించబడింది. జిల్లాతూర్పు భాగంలో సోలార్ సింఘీ కొండల పశ్చిమప్రాంతం ఉంటుంది. దీనికి సమాంతరంగా శివాలిక్ పర్వతశ్రేణి దిగువమార్గం జిల్లా ఉత్తరదక్షిణాలుగా ఉంటుంది. పశ్చిమప్రాతం సారవంతమైన భూభాగం ఉంటుంది.గణీయమైన ప్రభుత్వ వన్యప్రాంతం ఫారెస్ట్ ఆధీనంలో ఉంటుంది. చిత్తడిమైదానాలలో వరి విస్తారంగా పండిస్తూ ఉన్నారు. ఆనంద్పూర్, దసుయా, ముకెరియన్ చింట్‌పూర్ని జరిగే ఉత్సవాలు అనేకమంది పరిసర ప్రజలను ఆకర్షిస్తూ ఉంది.
కొండప్రాంతాలకు సమీప ంలో ఉన్న కారణంగా వాతావరణం చల్లాగా, తేమగా ఉంటుంది.
జిల్లాలో నూలు వస్త్రాలు తయారుచేయబడుతున్నాయి. చెరకు, వరి, ఇతర ధాన్యాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. పొగాకు, ఇండిగో ఎగుమతి చేయబడుతున్నాయి. హోషియార్పూర్ జిల్లా సన్యాసుల నగరంగా పిలువబడుతూ ఉంది. జిల్లాలో అనేక డేరాలు కనిపిస్తూ ఉంటాయి.
ప్రస్తుత హోషియార్పూర్ జిల్లా ప్రాంతం " సింధు లోయ నాగరికత " ప్రాంతాలలో ఒకటి. జిల్లాలో పలు ప్రాంతాలలో నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన ఆధారాలను అనుసరించి శివాలిక్ పర్వతపాదాలలో పాలియోలిథిక్ మానవుడు నివసించాడని భావిస్తున్నారు. అంతేకాక ప్రొటోహిస్టారిక్, హిస్టారిక్ కాలం నుండి ఈ ప్రాంతంలో మానవ ఆవాసాలు ఉన్నయని భావిస్తున్నారు.
పురాణ కథనాలను అనుసరించి ఈ జిల్లాలోని పలు ప్రాంతాలు పాండవులకు సంబంధించి ఉన్నాయని భావిస్తున్నారు. పాండవులకు అఙాతవాసంలో సహకరించిన విరాటరాజ్యం ఇదేనని భావిస్తున్నారు. మహిల్‌పూర్‌కు 11 కి.మీ దూరంలో ఉన్న భం ప్రాంతంలో పాండవులు అఙాతవాసం గడిపారని భావిస్తున్నారు. జైజాన్‌కు ఉత్తరంలో 19 కి.మీ దూరంలో ఉన్న శిలాలయం పాండవుల కాలంనాటిదని పరిశోధకులు భావిస్తున్నారు. చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ వ్రాతలలో ఇక్కడ పలు శతాబ్దాలు చంద్రపుత్ర రాజవంశీయులు స్వతంత్ర పాలకులుగా నివసించారని దాదాపు మహమ్మదీయుల దండయాత్రలు కొనసాగేవరకు వారి పాలన కొనసాగిందని భావిస్తున్నారు.
జలంథర్‌కు చెందిన కటోచ్ సామ్రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత ఈ ప్రాంతం చీలిపోయింది. ప్రస్తుత జిల్లా ప్రాంతం రాజా దాతర్పూర్, జస్వాన్‌లకు విభజించబడింది. 1759 నుండి సిక్కు సంస్థానాధీశులు నిశ్శబ్ధంగా ఈ ప్రాంతంలోని పర్వతప్రాంతాలలో ఆక్రమణలు అధికం చేయడం ఆరభించే వరకు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. 1815లో రంజిత్ సింగ్ జస్వన్ మీద వత్తిడి చేసిన తరువాత రాజా జస్వన్ కొంత రాజ్యం స్వీకరించి బదులుగా ఈ ప్రాంతం మీద అధికారాన్ని వదులుకున్నాడు. 3 సంవత్సరాల తరువాత దాతాపూర్ రాజా కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎదుర్కొన్నాడు. 1818 నాటికి సట్లైజ్ నుండి బీస్ వరకు ఉన్న ప్రాంతం పూర్తిగా లాహోర్ ఆధీనంలోకి వచ్చింది.
1846లో మొదటి అంగ్లో - సిఖ్ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకువచ్చింది. పదవీ చ్యుతులైన దాతాపుర్, జస్వన్ రాజాలు భరణం అందుకుంటూ వచ్చారు. అయినప్పటికీ వారు కోల్పోయిన గత వైభవం తిరిగి పొందలేక వారు నిరాశకు గురైయ్యారు. 1848లో రెండవ అంగ్లో - సిఖ్ యుద్ధంలో పదవీచ్యుతులైన రాజులు తిరుగుబాటుదారులలో చేరారు. వారు చేసిన తిరుగుబాటులో రాజులిద్దరూ, తిరుగుబాటు నాయకులు మాత్రం బ్రిటిష్ సైన్యాలకు పట్టుబడ్డారు. వారి రాజ్యాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. హిందూ కావ్యకాలంలో హోషియార్పూర్ కేంద్రంగా ఉండేది. ప్రస్తుత నగరంలోని ఉనారోడ్డుకు 4కి.మీ దూరంలో ఉన్న బజ్వారాలో పాండవులు అఙాతవాసం పూర్తిచేసారని విశ్వసిస్తున్నారు.
హోషియార్పూర్ అత్యధికంగా పురాతన జ్యోతిషశాస్త్రంతో సంబందితమై ఉంది. ఇక్కడ భూత, వర్తమాన, భవిష్యత్తులో జన్మించబోయే వ్యక్తుల వివరాకను వివరించగలిగిన పురాతన దస్తావేజులు ఉన్నాయని ప్రాంతీయ వాసులు విశ్వసిస్తున్నారు. అవి వివరంగా వ్రాయబడి ఇక్కడ సురక్షితంగా బద్గ్రపరచబడి ఉన్నాయని విశ్వసిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి అనేకమంది వారి భూత, వర్తమాన, భవిష్య జన్మలగురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు.
హోషియార్పూర్ జిల్లాలో ఉన్నవ్పురాతన సాంస్కృతిక కేంద్రాలలో జైజాన్ ఒకటి. దీనిని 11వ శతాబ్దంలో జైజ్జత్ ఋషి శివాలిక్ పర్వతపాదప్రాంతంలో స్థాపించాడని భావిస్తున్నారు. జైజాన్ వాణిజ్యకేంద్రంగా వర్ధిల్లింది. ఇది తూర్పు ఆసియా విద్యాకేంద్రంగా ప్రసిద్ధిచెందింది. ప్రముఖ సంస్కృతం, జ్యోతిషం, ఆయుర్వేదం, సంగీత విద్వాంసులు ఈప్రాంతంలో సమావేశం అయ్యారని భావిస్తున్నారు. సంగీతదర్శకుడు హుస్సేన్ లాల్, భగత్ రాం, ప్రముఖ పాకిస్తాన్ కవి తుఫైల్ హోషియార్పురి ఈప్రాంతానికి చెందినవారే.గతించిన ఆయుర్వేద పండితుడు గోవింద్ రాం వాత్సాయన్, కీ.శే. సంస్కృత సాహిత్యకారుడు ఆచార్య విశ్వనాథ్ జైజాన్ చెందినవారే. చండీగఢ్ ఉనికిలోకి వచ్చిన తరువాత జైజాన్ ప్రాముఖ్యత కోల్పోయింది. ప్రస్తుతం ఇది పంజాబు సరిహద్దులు, శివాలిక్ పర్వతప్రాంతాలలో ఉన్న జైజాన్ నగరం నిద్రిస్తున్ననగరంగా భావించబడుతుంది. శివాలిక్ పర్వతప్రాంతాలలో ఉన్న మహిల్పూర్‌ను చైనా యాత్రికుడు హ్యూయంత్సాంగ్ సందర్శించాడు. ఈప్రాంతాన్ని మహిపాల్పూర్ అని ప్రస్తావించాడు.
శివాలిక్ లోయలో గర్శంకర్ సమీప ంలో సదార్పూర్ అనే చిన్న గ్రామం ఉంది.
హోషియార్పూర్, వైశాల్యం 3198 చ.కి.మీ.గ్రామాల సంఖ్య 1,449.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,579,160,[1] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 31వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 603 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.95%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 992:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 85.40%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
షెడ్యూల్డ్ కులాలు | 32% |
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సరాసరి శాతం 28% కంటే | అధికం |
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సరాసరి శాతంలో | 5 వ స్థానం |
4 మండలాలలో షెడ్యూల్డ్ కులాల శాతం | 40% |
హోషియార్పూర్1-2 షెడ్యూల్డ్ కులాల శాతం | 48% |
బుంగా మండలం షెడ్యూల్డ్ కులాల శాతం | 41% |
మిగిలిన మండలాలు షెడ్యూల్డ్ కులాల శాతం | 40 కంటే తక్కువ |
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో హోషియార్పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పంజాబు రాష్ట్ర ఒకేఒక జిల్లాలో ఈ జిల్లా ఒకటి.[4]
హోషియార్పూర్ జిల్లాలో 4 ఉపవిభాగాలు, 10 మండలాలు, 8 ముంసిపల్ కౌంసిల్స్ ఒక ఏరియా కమిటీ ఉన్నాయి:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.