జూన్ 10: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయసైన్యంతోకోయిలకుంట్ల లోని బ్రిటిషు వారి ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు. దాంతో అతడి తిరుగుబాటు మొదలైంది
సెప్టెంబరు 10: ఎలియాస్ హోవ్ కు కుట్టుమిషను పేటెంటు లభించింది.[2]
సెప్టెంబరు 23: జర్మను ఖగోళవేత్తలు యోహన్ గాట్‌ఫ్రీడ్ గాల్, హీఓంరిచ్ లూయీ డి అరెస్ట్‌లు నెప్ట్యూన్ గ్రహాన్ని కనుగొన్నారు.\
తేదీ తెలియదు: ఇంగ్లండులో కలరా అంటువ్యాధి వ్యాప్తి మొదలైంది
అక్టోబరు 16: అమెరికా లోని మసాచుసెట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్ థామస్ గ్రీన్ మార్టన్ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఇదే మత్తుమందు వాడడం మొదలైన ఈ రోజే ప్రపంచ అనస్థీసియా దినోత్సవం