సైఫాబాద్ ప్యాలెస్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
సైఫాబాద్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైఫాబాద్‌లో ఉన్న భవనం. లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్ మాదిరిగా నిర్మించబడిన ఈ సైఫాబాద్ ప్యాలెస్, నిజాంకు ఖాజానాగా ఉపయోగపడి, ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని జి-బ్లాకుగా ఉపయోగించబడుతుంది.[1][2]
సైఫాబాద్ ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
నిర్మాణ శైలి | యూరోపియన్ |
ప్రదేశం | సైఫాబాద్, హైదరాబాదు, తెలంగాణ |
భౌగోళికాంశాలు | 17.4099°N 78.4690°E |
పూర్తి చేయబడినది | 1888 |
ప్రారంభం | 1940 |
క్లయింట్ | హైదరాబాదు రాష్ట్ర నిజాం రాజులు |
ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన నివాసంకోసం 1887లో లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. డంగ్ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో పెద్ద గోడలు, ఎత్తైన గేట్లతో 1888లో యూరోపియన్ శైలిలో రెండంతస్తుల్లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మించబడింది.[3] కానీ ఆలీఖాన్ ఒక్కరోజు కూడా ఈ భవనంలో గడపలేదు.
మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు, హుస్సేన్ సాగర్ సమీపంలోని ప్రశాంత వాతావరణంలో సేద తీరితే ఆరోగ్యం మెరుగవుతుందని ఆస్థాన వైద్యులు (హకీంలు) సూచించారు. 1987లో సైఫాబాద్ ప్యాలెస్ నిర్మాణం జరుగుతుండగా, ఒక రోజు తన ఆస్థాన ప్రధాన మంత్రి మహారాజ కిషన్ ప్రసాద్‌తో కలసి ప్యాలెస్‌ను చూడడానికి ఏనుగు అంబారీపై అలీ ఖాన్ బయల్దేరాడు. ప్యాలెస్ సమీపంలోకి రాగానే ఒక అశుభ సూచకం ఎదురొచ్చింది. అది చూసిన జ్యోతిషులు పురానా హవేలీని వదలడం మంచిది కాదని నిజాంకు జోస్యం చెప్పడంతో సైఫాబాద్ ప్యాలెస్ కు వచ్చే ఆలోచనను మానుకున్నాడు. దాంతో నిజాం ఆర్థికమంత్రి సర్ అక్బర్ హైద్రీ, ప్రధానమంత్రి కార్యాలయాల కోసం ఈ ప్యాలస్ కేటాయించబడింది.
స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డిన తరువాత బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, భవనం వెంకట్రామ్, టి. అంజయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి తదితర ముఖ్యమంత్రులు జి బ్లాక్ నుంచి పరిపాలన వ్యవహారాలు కొనసాగించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సచివాలయంలో కొత్తగా కొన్ని భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయాలను వాటిల్లోకి మార్చాడు. చివరగా నందమూరి తారక రామారావు ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులోనే తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు.[4]
130 ఏళ్లు పైబడిన వారసత్వ కట్టడమైన ఈ ప్యాలెస్ ను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.