మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సిద్ది జిల్లా ఒకటి. సిద్ధీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా రీవా డివిజన్లో ఉంది.
Sidhi జిల్లా
सिधी जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Rewa |
ముఖ్య పట్టణం | Sidhi |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Sidhi |
విస్తీర్ణం | |
• మొత్తం | 10,536 కి.మీ2 (4,068 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 11,26,515 |
• జనసాంద్రత | 110/కి.మీ2 (280/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.09% |
• లింగ నిష్పత్తి | 952 |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
సిద్ధీ జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది. జిల్లాకు అధిక చరిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. జిల్లా రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. సిద్ధీ ప్రకృతి సౌందర్యానికి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. జిద్ది జిల్లాలో విస్తారమైన ఖనిజ సంపద ఉంది. నదులు ఈ జిల్లాలో సముద్రంలో సంగమిస్తున్నాయి. జిల్లాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇవి దేశంలోని ప్రధాన పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకును అందిస్తుంది.
విభాగాలు
- సిద్ధీ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి:- గోపాడ్ బనాస్, చుర్హట్, రాంపూర్ నాయికిన్, మఝౌల్, కుస్మి, పత్పర సిహవల్.
- జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- చుర్హట్, సిద్ది, సిహవల్, ధౌహని.
- పార్లమెంటు నియోజకవర్గం: సిద్ది.
ఆర్ధికం
జిల్లాలో " ది వింధ్యా సూపర్ థర్మల్ పవర్ స్టేషను " నుండి విశాలమైన ప్రాంతానికి విద్యుత్తు సరఫరా జరుగుతుంది. జిల్లా సాంఘిక - సాంస్కృతిక వైవిధ్యం, గిరిజన సంప్రదాయ చరిత్ర కలిగి ఉంది. కైమూర్, కెహెజుయా, రాణిముండా కొండలు, పుష్పాలతో, మహువా సువాసనలతో కాలుష్య నివారణ చేస్తున్న అరణ్య ప్రాంతాలు పర్యాటకులను రంజింపజేస్తున్నాయి. మొత్తం సిద్ధీ జిల్లా ప్రాంతం రీవా రాజాస్థానంలో భాగంగా ఉండేది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సిద్ధీ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
షిర్ధి పాలకులు
- 1800 లో సిద్దిని ముగ్గురు పాలకులు పాలించారు :
- బర్ది నుండి చందేల పాలకులు (ఖతై ).
- మధ్వస్ యొక్క రాజాసాహెబ్ . అతను ఒక బాలన్ రాజపుత్ర ఉంది.
- థర్డ్ సిగ్రౌల్ యొక్క రాజాసాహెబ్ ఉంది.
తరువాత ఈ ప్రాంతంలో కసౌటా రీవా నుండి బఘేలా రాజపుత్రులు ప్రవేశించారు. వారు రీవాలో 19వ శతాబ్దం ప్రారంభంలో ప్రవేశించారు. వారు సిద్ధీ పశ్చిమ ప్రాంతాన్ని పాలించారు. (చుర్హత్/రాంపూర్). దేశానికి స్వతంత్రం లభించే వరకు వారి పాలన కొనసాగింది. చుర్హత్ చివరి పాలకుడు రావు బహదూర్ సింగ్జీ. (అర్జున్‌సింగ్ అన్న). బర్ది ఖాతై చెందిన రాజా కాంత్ దేవ్ సోనే నదీతీరంలో ఉన్న తమ పూర్వీక రాజభవనంలో నివసిస్తున్నాడు. ఆయన భారతీయ జనతాపార్టీకి సభ్యుడుగా చురుకుగా పార్టీకార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తున్నాడు.
భౌగోళికం
సిద్ధీ జిల్లా రాష్ట్ర వాయవ్య భూభాగంలో 22,475 నుండి 24.4210 డిగ్రీల ఉత్తర అక్షాంశం , 81:1840 నుండి 824830 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సిగ్రౌలి జిల్లా, తూర్పు సరిహద్దులో చత్తీస్ ఘడ్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో రీవా జిల్లా ఉన్నాయి. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 18,31,152 (రాష్ట్ర జనసంఖ్యలో 3.03%).
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,126,515,[2] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 411వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 232 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.66%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 952:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 66.09%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
భాషలు
సిద్ధీ జిల్లాలో బఘేలి భాష వాడుకలో ఉంది. ఇది హిందీ భాషను పోలి ఉంటుంది. ఈ భాష 72.91% ప్రజలకు వాడుక భాషగా ఉంది. [5] (జర్మన్, ఇంగ్లీష్ 60% పోల్చితే) [6] ఈ భాషకు 78,00,000 మంది వాడుకరులు ఉన్నారు.[5]
విద్య
1980లో అర్జున్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధీ జిల్లాలో విద్యాసంబంధిత విషయాల అభివృద్ధి అవకాశాలను పరిశీలించడానికి ఒక కమిటీ రూపొందించబడింది. ఈ పరిశీలలో జిల్లాలో మొదటి పాఠశాల, మొదటి పట్టదారి ఎవరు అన్న విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ప్రధానంగా మధ్వాస్ మొదటి పట్టదారిగా భావిస్తూ వచ్చారు. కాని పరిశీలనలో చుర్హత్ తాలూకాలోని ఝల్వార్ గ్రామవాసి అయిన శ్రీ బహదూర్ సింగ్ మొదటి పట్టదారిగా నిర్ణయించబడింది. 1924లో ఆయన బి..ఎ పట్టా పుచ్చుకుని 1926లో ఎల్.ఎల్.బి పట్టా అలహబాదులో పుచ్చుకున్నాడు. తరువాత ఆయన ఝాల్వార్ గ్రామానికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆయన వారసులు ఇప్పటికీ ఝల్వార్ గ్రామంలో నివసిస్తున్నారు. వీరిలో బతక్ ప్రతాప్ వద్ద జిల్లా గురించిన చారిత్రక వివరాలు లభిస్తున్నాయి. సర్వే సమయానికి జిల్లాలో 100 సంవత్సరాలకు పూర్వం 1880 ప్రారంభించబడిన పాఠశాల ఉన్నట్లు కనుగొనబడింది.
విద్య
- SGS Govt. PG College,సిధి
- ప్రభుత్వ . గరల్స్ డిగ్రీ కాలేజ్, సిధి
- టాటా కాలేజ్, సిధి
- కమల కాలేజ్, సిధి
- IPS Academy, సిధి
- SIT College & Group of Institutions, సిధి
ప్రముఖ వ్యక్తులు
- బీర్బల్ అక్బర్ కోర్టు వెళ్లడానికి ముందు బఘేలా రాజవంశం (ప్రస్తుతం మధ్యప్రదేశ్) రీవా రాజ్యసభ రాజా రామచంద్ర సింగ్ దర్బార్ (1555-1592) లో ఒక రాజభృత్యురాలు (షివాల్ బ్లాక్ (సిద్ధి ) లో గ్రామంలో ఘోఘ్రా మహేష్ దాస్ జన్మించారు) .
- అర్జున్ సింగ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
- గోవింద్ మిశ్రా, పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంటరీ నియోజకవర్గం నం 11 సిద్ధి
- అజయ్ సింగ్ (రాజకీయవేత్త) మధ్యప్రదేశ్ Govt, మాజీ కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత. శాసనసభ సభ్యుడిగా, అసెంబ్లీ నియోజకవర్గం నం 76 చౌహత్
- కేదార్ నాథ్ శుక్లా, శాసన సభ సభ్యుడు, అసెంబ్లీ నియోజకవర్గం నం 77 సిద్ధి
- విశ్వామిత్ర పాఠక్, శాసన సభ సభ్యుడు, అసెంబ్లీ నియోజకవర్గం నం 78 సిహవల్
- గవరనమెంటు షెడ్యూల్డ్ తెగలు " నేషనల్ కమిషన్ ఆఫ్ కున్వర్ సింగ్ టీకం శాసనసభ, అసెంబ్లీ నియోజకవర్గం నం 82 ధౌహని, సభ్యుడు మాజీ చైర్మన్. భారతదేశం, న్యూ ఢిల్లీ
- అరునోడే - సింఘ్ (నటుడు), 2009-ప్రస్తుతం
పర్యాటక ఆకర్షణలు
జిల్లాలో " సంజయ్ గాంధి నేషనల్ పార్క్ " ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇందులో తెల్లని పులులు, నల్లని బక్ , పలు అందమైన వన్యమృగాలు ఉన్నాయి. భగదారణ్య వద్ద సన్ నది సమీపంలో " సన్ గడియా " కూడా పర్యాటక ఆకర్షణగా ఉంది. సిద్ధీ జిల్లాకు 60కి.మీ దూరంలో మఝౌలీ సమీపంలో ఉన్న పసిలి రెస్ట్ హౌస్ కుడా ఒక ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. దీనిని అంషుల్ శ్రీవాత్సవ విమానం ఆకారంలో రూపొందించాడు.
మూలాలు
వెలుపలి లింకులు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.