Remove ads
మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో సోలాపూర్ జిల్లా ఒకటి. షోలాపూర్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. షోలాపూర్ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భీమా, సీనా నదీమైదానాల మద్య ఉంది. జిల్లా మొత్తానికి భీమానది నుండి నీటిపారుదల వసతి లభిస్తుంది..[1] సోలాపూర్ జిల్లా బీడి ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది. బీడి పరిశ్రమ అభివృద్ధితో జిల్లాలోని కుండల్సంగం, కర్మల, బర్షి ప్రాంతాలు పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అక్కల్కోట మల్లికార్జునఆలయంలో ప్రతిరోజూ అనేకమంది లింగాయత భక్తులు శివుని ఆరాధిస్తుంటారు.
సోలాపూర్ జిల్లా
सोलापूर जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | పూణే |
ముఖ్య పట్టణం | Solapur |
మండలాలు | 1. Akkalkot, 2. Barshi, 3. Karmala, 4. Madha, 5. Malshiras, 6. Mangalvedha, 7. Mohol, 8. Pandharpur, 9. Sangola, 10. Solapur North and 11. Solapur South |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Solapur (SC), 2. Madha (shared with Satara district), 3. Osmanabad (shared with Osmanabad district) (Based on Election Commission website) |
• శాసనసభ నియోజకవర్గాలు | 10 |
విస్తీర్ణం | |
• మొత్తం | 14,845 కి.మీ2 (5,732 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 43,15,527 |
• జనసాంద్రత | 290/కి.మీ2 (750/చ. మై.) |
• Urban | 31.83% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 71.2% |
• లింగ నిష్పత్తి | 935 |
ప్రధాన రహదార్లు | NH-9, NH-13, NH-211 |
అక్షాంశ రేఖాంశాలు | 17°50′N 75°30′E |
సగటు వార్షిక వర్షపాతం | 545.4 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
షోలాపూర్ పురాతనమైన చారిత్రాత్మక, మతప్రధానమైన ప్రాంతం. షోలాపూర్ ప్రజలు సిద్ధేశ్వర్‌ను గ్రామదేవతగా ఆరాధిస్తున్నారు. సిద్ధేశ్వర్ 12వ చెందిన వాడు. సిద్ధేశ్వర్ అనుసరించిన కర్మయోగం ఆయనను స్వస్థలంలో ఆరాధ్యదైవంగా మార్చింది. సిద్ధరామ లింగాయతులకు చెందినవాడు. లింగాయత గురువులు 6 గురులో సిద్ధరామ ఒకడని భావిస్తున్నారు. ఆయన సిద్ధి పొందాడు. షోలాపూర్‌లో కరువు సంభవించినప్పుడు శ్రీసిద్ధేశ్వర్ 4000 మంది సహాయకులతో ఒక సరసును త్రవ్వించాడు. సరసులో మంచినీరు లభించింది. ఆయన షోలాపూర్‌లో జివసమాధి అయ్యాడు.
స్వతంత్రసమర సమయంలో 1931 జనవరి 12న పూనా జైలులో శ్రీ మల్లప్ప ధనషెట్టి, శ్రీ కుర్బన్ హుస్సేన్, శ్రీ జగన్నాథ్ షిండే, శ్రీ కిసాన్ సర్దా ఉరితీయబడ్డారు. ఫలితంగా షోలాపూర్‌కు " ది సిటీ ఆఫ్ హుతాత్మాస్ " అనే పేరు వచ్చింది.
జిల్లాలోని పండరీపురంలో ఉన్న విట్ఠల మహారాష్ట్ర ప్రధాన దైవంగా ఆరాధించబడుతున్నాడు. సమర్ధ రామదాసును అనేకశిష్యులు ఆయన జీవితమంతా అనుసరించారు. షోలాపూర్ టెక్స్టైల్ నగరంగా గుర్తించబడుతుంది. జిల్లాలో ప్రసిద్ధులైన అనేక మంది నేతవారు ఉన్నారు. ఉత్తర- దక్షిణ రైలు మార్గంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో షోలాపూర్ రైల్వే జంక్షన్ ఒకటి..
ఆరంభకాలంలో ఈ ప్రాంతాన్ని బదామీ చాళుఖ్యులు పాలించారు. వారి రాజధానులు కన్నడ దేశంలో ఉండేవి. వీరిని కుంతలేశ్వర్లు అని కూడా అనేవారు. రాజధాని మణపురాలో (ప్రస్తుత సతారా జిల్లాలో ఉంది) ఉండేది. పొరుగు ప్రాంతం ప్రస్తుతం సతారా జిల్లా, సోలాపూర్ జిల్లాలోఉన్నాయి. దీనిని మనదేశ అనే వారు. దేవగిరికి చెందిన సెయున యాదవుల చారిత్రక ఆధారాలలో మనదేశ గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. షోలాపూర్‌తో చేర్చిన కుంతల దేశం అశోకచక్రవర్తి సామ్రాజ్యంలో భగంగా ఉండేది.
రాష్ట్రకూట వంశ స్థాపకుడు మనక సిర్కా ఎ.డి 350 ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆయన మణపురాను స్థాపించి దానిని తన రాజధానిని చేసుకున్నాడు. ఆయన తన సామంత రాజైన కుంతల రాజ్యం గురించి వర్ణించాడు. పురాతన కాలంలో ఎగువ కృష్ణానదీ లోయను కుంతల అనేవారు. సామంత రాజ్యాల గురించి వర్ణించిన ప్రదేశాలు ప్రస్తుతం సతారా, సోలాపూర్ జిల్లాలలో ఉన్నాయి. రాజధాని మణపురా ప్రస్తుతం సతారా జిల్లా మాన్ తాలూకాలోని ప్రధానపట్టణంగా ఉంది. రాష్ట్రకూటులు, వత్సగిల్మా శాఖలో ఒకటైన ఒకతకాల మద్య తరచుగా కలహాలు జరుగుతుండేవి. పాండరగపల్లి అవిధేయ రాజ్యంలో ఉండేది. మనక అస్మక, విధర్భ పాలకులను వేధిస్తూ ఉండేవాడు. 106వ అజంతా గుహలో ఒకతక రాజు వింద్యసేనుడు కుంటల రాజును (రాష్ట్రకూట కుటుంబం) ఓడించిన దృశ్యం ఉంది.
సోలాపూర్ జిల్లాలోని మర్ది వద్ద ఉన్న ఒక శిలలో దేవగిరికి చెందిన సెయిన యాదవుల కాలంలో ఉన్న పలు సామంతరాజులు యోగేశ్వరునికి సమర్పించిన దానధర్మాల గురించిన వివరాలు ఉన్నాయి. వీరిలో రాజా భిల్లమ, జైతుగి, సింఘన (సా.శ. 1173 నుండి 1247) గురించిన వివరాలు ఉన్నాయి.[2] ఇక్కడ ఉన్న వివరణలు భిల్లమ పాలన 4వ సంవత్సరం అని ఉంది. ఇది అనుసరించి భిల్లమ 1106 లో (సా.శ. 1184) సింహాసనం అధిష్టించాడని భావిస్తున్నారు. భిల్లమ కలచురీ నుండి షోలాపూర్ భూభాగాన్ని జయించాడు. అదే ఆలయానికి కలచూరి రాజు శంకరదేవా నుండి కొంత నిధిసహాయం అందిందని భావిస్తున్నారు. శిలాశాసనం అనుసరించి ప్రస్తుత మర్ది పురాతన కాల మరుధి అని భావిస్తున్నారు. సోలాపూర్ జిల్లా లోని పలు శిలాశాసనాలు సింఘన కాలంలో కొన్ని దానాలు చేయబడ్డాయని భావిస్తున్నారు. సింఘన గురించిన వివరణలలో ఉన్న షకా వర్షం 1134 సింఘనా సింహాసనాధిష్టుడైన 13వ సంవత్సరం అని భావిస్తున్నారు. సోలాపూర్ జిల్లా పండరీపుర తూర్పున ఉన్న పులుంజ్ వద్ద సింఘన గురించిన మరొక రెండు శిలాశాసనాలు లభించాయి.[3] వీటిలో ఒకదానిలో శాతవాహన శకం 1121లో పూర్నజపురా (ప్రస్తుత పులంజ్) లోని సిద్ధసోమనాధుని కొరకు అమ్ముగిదేవరకు సింఘన నిధిసహాయం చేసినట్లు వివరణలు లభించాయి. శిలాశాసనాలలో పొరుగున ఉన్న పులుంజ్, సొయిజన, (సౌదానె), కురువలగె (కురుల్), దేగవె (దేగావ్), లలిగె (నులీ), పథరిగె (పథరి), కొరవల్లి (కురౌలి), చించవల్లి (చించోలి), అసుతిగె (అష్తి), రెవలపాల (రొపాలె), తుంగతిహ (తుంగత్), ఎవెంతిగె (యెవతి), పొరగవె (పొహర్గావ్) ప్రాంతాల గురించిన వివరణలు ఉన్నాయి. వీటిలో అధికంగా కన్నడ భాషలో ఉన్నాయి. సోలాపూర్ జిల్లాలోని మాల్షిరాస్కు 16కి.మీ దూరంలో ఉన్న వెలపూర్ వద్ద రాజా రామచంద్రా పాలలనాకాలం నాటి శిలాశాసనం లభించింది. .[4]
1351లో అలా- ఉద్దీన్- హాసన్ గంగు బహమని ప్రాంతీయ అధికారులను స్వతంత్రంగా, స్నేహపూర్వక భావంతో ఆదరించాడు. అందువలన దక్కన్ ప్రాంతం అంతా ఆయన అధీనంలోకి తీసుకోవడానికి సాధ్యం అయింది. ఈ ప్రాంతం అంతకు ముందు ఢిల్లీ పాలనలో ఉండేది. హాసన్ గంగు 1347లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. తరువాత గుల్బర్గాను రాజధానిగా చేసుకుని పాలించాడు. హాసన్ కర్నాటక, తెలంగాణ కోటలను స్వాధీనం చేసుకున్నాడు. హాసన్ స్థాపించిన కొత్త రాజ్యంలో మరాఠీ రాజ్యభూభాగం కూడా ఉంది. తరువాత రాజ్యం 4 విభాగాలుగా విభజించబడింది. అవి ఉత్తరంలో దౌలతాబాద్, బేరర్ దక్షిణంలో గుల్బర్గా, తెలంగాణా భూభాగాలుగా విభజించబడ్డాయి. 1357లో అలాఉద్దీన్ సామ్రాజ్యాన్ని 4 తరాఫులుగా విభజించి ఒక్కొక తరాఫుకు ఒక గవర్నరును నియమించాడు. షోలార్పూర్ ప్రాంతం గుల్బర్గా భూభాగంలో కలుపబడింది.
1459లో హుమాయూన్ తెలంగాణ యుద్ధంలో ప్రవేశించాడు. హుమాయూన్ లేని సమయంలో బీదర్‌లో తిరుగుబాటు తలెత్తింది. హుమాయూన్ తిరిగి వచ్చి తిరుగుబాటును అణిచివేసాడు. ఈ అలజడిలో హుమాయూన్ సహోదరులిద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1460లో సంభవించిన దామాజీ పంత్ కరువు దక్కన్ ప్రాంతప్రజలు తిరిగి కడగండ్లు ఎదుర్కొన్నారు. ప్రాంతీయ ప్రజల కథనం అనుసరించి దామాజి అనే బ్రాహ్మణుడు పండరీపురానికి 12 కి.మీ దూరంలో ఉన్న మంగల్వేధాలో బీదర్ రాజాస్థానం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవాడు. మంగల్వేధాలో ఉన్న పెద్ద ధాన్యాగారం దామాజీ ఆధీనంలో ఉండేది. మంగల్వేధా లోని వందలాది బ్రాహ్మణులు, ఇతరప్రజలకు దామాజీ ఆధీనంలో ఉన్న ధాన్యాగారంలో ఉన్న ధాన్యం సరఫరా చేసి వారి ప్రాణాలు కాపాడాడు. ఈ వార్త విన్న బీదర్ రాజు దామాజీని బంధించి తన ముందు నిలపమని ఆదేశించాడు. దామాజీ బీదర్ ప్రయాణంలో ఉన్న సమయంలో దామాజీ ఆరాధిస్తున్న విధోభా భగవాన్ దామాజీ మీద దయతలచి గ్రామస్తుని రూపంలో దామాజీ పంచి ఇచ్చిన ధాన్యానికి సమానమైన ధనాన్ని రాజుకు సమర్పించాడు. [5]
అహ్మద్‌నగర్‌కు చెందిన నిజాంషాహీ రాజు మాలిక్ అహ్మద్, బీజపూర్‌కు చెందిన యూసఫ్ అదిల్ షా, బేరర్‌కు చెందిన ఇమాద్- ఉల్- ముల్క్ మద్య 1497లో జరిగిన విభజన ఒప్పందం అనుసరించి 11 జిల్లాలతో చేర్చిన పరండతో చేరిన దౌలతాబాద్ భూభాగం అంతా మాలిక్ అహ్మద్ రాజ్యంలో భాగం అయింది. ఖ్వాజా జహన్ పరెండా ఆయన సోదరుడు జైన్ ఖాన్‌కు ఇవ్వబడ్డాయి. పరెండా, పరిసరాలలో ఉన్న 11 జిల్లాలు అహ్మద్‌నగర్‌లో భాగంగా ఉన్నాయి. షోలాపూర్ గవర్నరుగా ఉన్న జైన్ ఖాన్ 11 జిల్లాలో సగభాగం కావాలని వివాదం ఆరంభించాడు. ఫలితంగా బీదర్ నుండి నిధి పొందడానికి ప్రయత్నించాడు.
1510లో యూసఫ్ ఆదిల్ షా మరణించిన తరువాత బీజపూర్ ప్రతినిధి కమల్ ఖాన్ యువరాజు అస్మాయిల్ ఆదిల్ షా, ఆయన తల్లి బభుజి ఖనంలను ఖైదు చేసి సైన్యంతో షోలాపూర్ వైపు ముందుకు కదిలి మూడు మాసాల కాలంలో షోలాపూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అహమ్మద్ నగర్ నుండి సహాయం అందని కారణం చేత జైన్ ఖాన్ తనను తన కుటుంబాన్ని, సంపదను రక్షించుకోవడానికి 1511 న తన ఆధీనంలో ఉన్న షోలాపూర్, 51/2 జిల్లాలను కమల్ ఖాన్ పరం చేసాడు. ప్రస్తుత సోలాపూర్ జిల్లాలోని కర్మలా, మాధా, బర్షి, మూడు నార్తెన్ సబ్- డివిషన్లు పలు సంవత్సరాలకాలం ఖ్వాజా జహన్ ఆధీనంలో ఉండిపోయాయి.
1623లో మాలిక్ అంబర్ అద్భుతమైన సైన్యాన్ని సమీకరించి షోలాపూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. 1635లో మొఘల్ సైనికాధికారి షైస్తా ఖాన్ బీజపూర్ సరిహద్దులను చేరుకున్నాడు. తరువాత షోలాపూర్, బీదర్ మద్యప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1636లో బీజపూర్ రాజు, మొఘల్ మద్య జరిగిన ఒప్పందం అనుసరించి నిజాంషాహి సామ్రాజ్యం అంతం అయింది. పండేరా, షోలాపూర్ ఆధారిత జిల్లాలు బీజపూర్ రాజు మహ్మద్ ఆదిల్ షాకు ఇవ్వబడ్డాయి.
1689లో ఔరంగజేబు బీజపూర్‌ను వదిలి పండరీపురం సమీప ంలోని అక్లుజ్‌లో మకాం చేసాడు. అక్లుజ్ మాల్షిరాస్ నుండి 13 కి.మీ దూరంలో ఉంది. అక్కడ నుండి శభాజీకి వ్యతిరేకంగా తన శక్తినంతటినీ కేంద్రీకరించాడు. అక్లుజ్ వద్ద ఔరంగజేబును మరాఠీ దోపిడీ దారులు హింసించారు. ఔరంగజేబు సైన్యం శంభాజీ భూభాగంలో ప్రవేశించారు. వారిలో ఒకరైన ముక్వారబ్ ఖాన్ కొల్హాపూర్‌కు పంపబడ్డాడు. ముక్వారబ్ ఖాన్ రత్నగిరిలో ఉన్న సంగమేశ్వర్ వద్ద విజయవంతంగా శంభాజీ, 26మందిని పట్టుకున్నాడు. తరువాత ముక్వారబ్ ఖాన్ ఖైదీలతో మొఘల్ మకాము వైపు కదిలాడు. శభాజీ పట్టుబడిన విషయం ఔరంగజేబుకు అందింది.
ఔరంగజేబు మరణించిన తరువాత దక్కన్ బేరర్, ఔరంగజేబు, బీదర్, బీజపూర్ భూభాగాలుగా విభజించబడింది. బీజపూర్ భుభాగంలో భాగంగా షోలాపూర్ ప్రాంతం ఔరంగజేబు కుమారుడు కాం బక్షా ఆధీనం చేయబడింది. 1708లో కాం బాక్షా వధించబడ్డాడు. ఉరంగజేబు మరణించిన తరువాత జరిగిన వారసత్వ యుద్ధంలో రాజకుమారుడు అజం చత్రపతి షాహూను ఒక ఒప్పందం మీద విడుదల చేసాడు. షాహూ శంభాజీ కుమారుడు. 1689లో మొఘల్ పాలకుల చేతిలో శంభాజీ మరణించిన తరువాత షాహూ మొఘల్ చెరశాలలో ఉన్నాడు. యుద్ధంలో ఆజం రాకుమారుడు ఓడిపోయాడు. తరువాత ఈ ప్రాంతం బహదూర్ షా వశం అయింది.
1722 జనవరిలో నిజాం - ఉల్- ముల్క్ దక్కన్‌ను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత ఇక్కడ వజీరుగా నియమించబడ్డాడు. నిజాం - ఉల్- ముల్క్ త్వరలోనే రాజకీయ కలహాలతో విసిగిపోయాడు. నిజాం - ఉల్- ముల్క్ చక్రవర్తికి విశ్వాసం ప్రకటించి దక్షిణ భూభాగానికి తరలి వెళ్ళాడు. చక్రవర్తికి విశ్వాసం ప్రకటించినప్పటికీ నిజాం - ఉల్- ముల్క్ దక్కన్లో స్వయంగా రాజ్యస్థాపన కొరకు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. 1724లో జరిగిన ఫాచ్ కర్దా యుద్ధంలో దక్కన్ సుబేదార్ ముబారిజ్‌ఖాన్ చంపబడ్డాడు. చక్రవర్తి నిజాం - ఉల్- ముల్క్‌ను దక్కన్ సుబాహ్‌గా నియమించాడు. తరువాత నిజాం - ఉల్- ముల్క్ నర్మదాకు దక్షిణంలో ఉన్న దక్కన్కు పాలకుడు అయ్యాడు. షోలాపూర్ కోట, పట్టణం, కర్మల, షోలాపూర్ ఉత్తర పశ్చిమ భూభాగాలు స్వతంత్రంగా పాలించబడ్డాయి. తరువాత ఈ ప్రాంతం నిజాం ఆధీనం అయింది. ఖర్దా యుద్ధం తరువాత నిజాం దౌలతాబాద్, ఔరంగాబాదులతో చేర్చి షోలాపూర్ మరాఠీయుల వశం అయింది. 1803లో బ్రిటిష్ సాయంతో నిజాం తిరిగి దౌలతాబాదు, ఔరంగాబాదులను స్వాధీనం చేసుకున్నాడు.
1802లో యశ్వంతరావు హోల్కర్ దక్షిణంవైపు దండెత్తి అహ్మద్‌నగర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత ష్రీగొండా, జంబ్గావ్ (షిండే ప్రాంతాలను) కాల్చాడు. షిండే అధికారులలో ఒకడైన ఫతేసిన్ మానే పండరీపూర్ వెళే సమయానికి అక్కడ పూజారులు, మతాధికారులు చేరి షిండేను రక్షించమని రాత్రిబవళ్ళు తీవ్రంగా ప్రార్థించడం గమనించి ఎటువంటి కీడు చేయకుండా భగవంతునికి కానుకలను సమర్పించి తిరిగివెళ్ళాడు. భాజీరావు ఆలస్యమైన షిండే సైన్యం వద్తుందన్న నమ్మకంతో ఎదురుచూసాడు. యశ్వతరావు బారామతి వైపు కదిలాడు. 1802 అక్టోబరులో పూర్తిగా షిండేను జయించాడు. ప్రమాదం పసికట్టిన రెండవభాజీరావు పూనాకు పారిపోయాడు. యశ్వంతరావు అందించిన స్నేహ అభ్యర్ధనను తిరస్కరించి ఆంగ్లేయులను ఆశ్రయించాడు. తరువాత భాజీరావు మరాఠీ సామ్రాజ్యం మీద ఆధిపత్యం ఆంగ్లేయిలకు ఇస్తున్నట్లు 1802 డిసెంబరు 31 న జరిగిన బాసియన్ ఒప్పందం మీద సంతకం చేసాడు. 1803 ఏప్రిల్ మాసం బాసియన్ ఒప్పందం ఆధారంగా ఆర్థర్ వెల్లెస్లీ (వెల్లింగ్టన్ మొదటి ప్రభువు) పండరీపురం, అక్రుల్ దాటి పూనా వైపు కదిలాడు. అక్లుజ్ వద్ద జెనరల్ వెల్లెస్లీతో కల్నల్ స్టీవెంసన్ చేరుకున్నాడు.
1818లో బాపూ గోకలే పేష్వా రెండవ భాజీరావు తరఫున జనరల్ స్మిత్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. పారిపోయే ప్రయత్నంలో ఉన్న రెండవ భాజీరావు చనిపోయిన వీరుని, మిగిలిన వారిని గమనించే ఓర్పు వహించలేదు. యుద్ధభూమిలో నిస్సహాయంగా మిగిలిపోయిన ప్రతాప్‌సింగ్, చత్రపతి, వారి సైన్యం కోటిరూపాయల భాజీరావు నిధితో బ్రిటిష్ సైన్యం చేతికి చిక్కారు. జనరల్ స్మిత్ చత్రపతిని దక్కన్ కమీషనర్ ఎల్ఫింస్టోన్కు అప్పగించాడు. మారాఠీలు గణ్పరావు నాయకత్వంలో షోలాపూర్ వద్ద పోరాటం సాగించారు. గణ్పరావు గాయపడడం వలన యుద్ధం ముగింపుకు వచ్చింది.
1818లో భాజీరావు మహారాష్ట్రాకు వెళ్ళాడు. బ్రిటిష్ ఆఫ్హ్వర్యంలో భగవంతరావు షోలాపూర్‌కు మామ్ల్దార్ అయ్యాడు. వెంకటప్ప, శ్రీనివాసరావు, భవంతరావు నిర్వాహకులుగా ఉన్నారు. నిర్వహణలో భాగంగా జరుగిన భూభాగ విభజనలో ప్రస్తుత సోలాపూర్ జిల్లా పండరీపురం సతారా రాజా న్యాయపరిధిలోకి మారింది.మంగల్వేధాతో కూడిన జిల్లా దక్షిణ భూభాగం సంగ్లీకి చెందిన పత్వర్ధన్ సర్దారుల వద్ద మిగిలిపోయింది.
సోలాపూర్ జిల్లా ప్రాంతం ముందు అహ్మద్‌నగర్, పూనా, సతారాలో ఉంది. అహ్మద్‌నగర్‌లో కర్మలా, పూనాలో మొహిల్, సతారాలో పండరీపూర్, మాల్షిరాస్, సంగోలా భారతీయ రాజాస్థానాలుగా ఉండేవి. బర్షీ, షోలాపూర్ అహ్మద్‌నగర్, పూనా జిల్లాల మద్య పరిమార్పిడి చేయబడ్డాయి. 1830లో అహ్మద్‌నగర్ షోలాపూర్ సబ్కలెటరేట్ ఉండేది. 1838లో షోలేపూర్ జిల్లా రూపొందించబడింది. ఇందులో షోలాపూర్, బర్షి, మొహొల్, మాధా, కర్మల, ఇండి, హిప్పర్గి, ముద్దెబిహల్ ఉప విభాగాలు చేర్చబడ్డాయి. 1864 ఈ జిల్లా రద్దుచేయబడింది. 1869లో షోలాపూర్, బర్షి, మొహొల్, మాధా, కర్మలతో సతారా జిల్లా నుండి పండరీపురం, సంగోలాలను కలిపి తిరిగి జిల్లా రూపొందించబడింది. 1875లో షోలాపూర్ నుండి మాల్షిరాస్ సతారా జిల్లాకు మార్చబడింది. 1891, 1941 వరకు జిల్లాలో కాని తాలూకాలో కాని మార్పులు సంభవించలేదు. తరువాత 1949లో భారతీయ రాజాస్థానాలు దేశంలో విలీనం చేయబడిన సమయంలో జంఖిండి నుండి 2 గ్రామాలు, జాత్ రాజాస్థానం నుండి 21 గ్రామాలు, కురుంద్వాడి రాజాస్థానం నుండి 13 గ్రామాలు ఒక పట్టణం మొహొల్, మిరాజ్ సెనియర్ రాజాస్థానం నుండి 13 గ్రామాలు, మిర్జా జూనియర్ నుండి 3 గ్రామాలు, సంగ్లి రాజాస్థానం నుండి 28 గ్రామాలు ఒక పట్టణం, అక్కల్కోట్ రాజాస్థానం నుండి కొంత భూభాగం అక్కల్కోట్, మొహొల్, మంగల్వేదా తాలూకాలో విలీనం చేయబడ్డాయి. షోలాపూర్ తాలూకా దక్షిణ, ఉత్తర షోలాపూర్ తాలూకాలుగా విభజించబడ్డారు.
1950లో హైదరాబాద్ రాష్ట్ర నుండి 53 గ్రామాలు మార్చబడి సోలాపూర్ జిల్లాలో చేర్చబడ్డాయి. అలాగే సోలాపూర్ జిల్లాకు చెందిన 12 గ్రామాలు ఉస్మానాబాద్ జిల్లాకు మార్చబడ్డాయి. తరువాత 1950లో విజాపుర జిల్లాలో ఇండీ తాలూకా నుండి ఒక గ్రామం మంగల్వేధా తాలూకాకు మార్చబడింది. 1956లో రాష్ట్రాలు పునర్నిర్మాణం చేయబడిన సమయంలో సోలాపూర్ జిల్లా బాంబే రాష్ట్రానికి తరలించబడింది. 1960 నుండి ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగంగా మారింది. 1884 గజటీర్ అనుసరించి జిల్లా 7 ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లా వైశాల్యం 646 చ.కి.మీ. 102 గ్రామాలు ఉండేవి. జనసంఖ్య 83,212. తాలూకాలు 11 ఉండేవి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,315,527,[6] |
ఇది దాదాపు. | మాల్డోవా దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 43 వ స్థానంలో ఉంది..[6] |
1చ.కి.మీ జనసాంద్రత. | 290 [6] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.1%.[6] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 932:1000 [6] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 77.72%.[6] |
జాతియ సరాసరి (72%) కంటే. |
విషయాలు | వివరణలు |
---|---|
రెవెన్యూ ఉపవిభాగాలు | 3 సోలాపూర్, మాధా (కుర్దువాడి), పంథర్పూర్ |
తాలూకాలు | అక్కల్కోట్, బర్షి తాలూకా, కార్మల, మధా, మాలాషిరాస్, మంగల్వెధె, మొహొల్, పండరపుర, సగోలా, షోలాపూర్ ఉత్తర, దక్షిణ షోలాపూర్. |
పండర్పూర్ ప్రత్యేక జిల్లా ప్రతిపాదన. సోలాపూర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి పండర్పూర్ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. కొత్త జిల్లాలో సోలాపూర్ జిల్లా నుండి పండర్పూర్, సంగోలా, కర్మల, మంగల్వెధా, మాల్షిరాస్, మాధా తాలూకాలను పొరుగున ఉన్న సంగ్లి నుండి అత్పది తాలూకాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది.
జిల్లాలో అధికంగా మరాఠీ, కన్నడ, ఉర్దూ, తెలుగు భాషలు వాడుకలో ఉన్నాయి.
లావణి, గొంధాల్, ధంగరి, అరధి, భలరి పాటలు మొదలైన జానపద కళారూపాలు ఉన్నాయి.
జిల్లాలో 4,859.15 ప్రాంతానికి నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది.
నీటిపారుదల ప్రాంతాలు
ప్రధాన పంటలు జొన్న, గోధుమ, చెరకు పండించబడుతుంది. మంగల్వెధా జొన్న పంటకు ప్రసిద్ధిచెందింది. మల్దండి జొన్నకు మహారాష్ట్ర రాష్ట్రమంతటా ప్రాముఖ్యత ఉంది. సోలాపూర్ ప్రాంతంలో డిసెంబరు- జనవరి మాసాలలో హుర్దా పార్టీ జరుగుతుంది. హుర్దా అంటే జొన్నకంకి పాలు పోసుకునే సమయం. వ్యవసాయదారులు సంకరజాతి హుర్దా (దూద్ మొగ్రా, గుల్బెంది) పండిస్తున్నారు.
జిల్లాలో పంధర్పూర్, కుందల్సంగం, అక్కల్కోట్, అక్లుజ్, బర్షి, కర్మల, నానజ్ (నార్త్ షోలాపూర్ తాలూకా) మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. పండరీపూర్‌కు ఆషాధి ఏకదశిన, కార్యిక ఏకాదశి రోజులలో వర్కరీలు విఠ్ఠల్ దర్శనానికి వస్తుంటారు. ఎండలు, వర్షాలు లెక్కచేయక లక్షలాది వార్కరీలు పండరీపురానికి యాత్రార్ధం వస్తుంటారు. వారు తుకారాం కీర్తనలను గానం చేస్తూ వందలాది మైళ్ళు ప్రయాణం చేస్తూ విఠ్ఠల్ దర్శనానికి వస్తుంటారు. విఠ్ఠల్ భగవానుని ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ విఠ్ఠల్ భగవానుని భక్తులు స్పృజించి ఆరాధించడానికి అవకాశం ఉంది. దామాజి, కంహొపాత్రా, తికచార్యా ప్రంతాలలాగ మంగల్వేధ కూడా సన్యాసులకు నిలయం. దామాజీ కొరకు విఠ్ఠల్ భగవానుడు స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చాడు. బీదర్ బాద్షా ప్రధాన సేవకుడైన దామాజీ కరువు సమయంలో ప్రజల కొరకు ధాన్యాగారం ద్వారాలను తెరచి ప్రజలప్రాణాలు కాపాడాడు. .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.