సోలాపూర్ జిల్లా
మహారాష్ట్ర లోని జిల్లామహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో సోలాపూర్ జిల్లా ఒకటి. షోలాపూర్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది. షోలాపూర్ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భీమా, సీనా నదీమైదానాల మద్య ఉంది. జిల్లా మొత్తానికి భీమానది నుండి నీటిపారుదల వసతి లభిస్తుంది.. సోలాపూర్ జిల్లా బీడి ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది. బీడి పరిశ్రమ అభివృద్ధితో జిల్లాలోని కుండల్సంగం, కర్మల, బర్షి ప్రాంతాలు పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అక్కల్‌కోట మల్లికార్జునఆలయంలో ప్రతిరోజూ అనేకమంది లింగాయత భక్తులు శివుని ఆరాధిస్తుంటారు.
Read article