షేక్‌పేట

From Wikipedia, the free encyclopedia

షేక్‌పేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1][2] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 110లో ఉంది.[3] టోలిచౌకి, దర్గా, మణికొండ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు షేక్‌పేట, దేశం ...
షేక్‌పేట
Thumb
షేక్‌పేట
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Thumb
షేక్‌పేట
షేక్‌పేట (India)
Coordinates: 17°40′55″N 78°39′08″E
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
  Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
  అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 008
Vehicle registrationటిఎస్ 13
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకార్వాన్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
మూసివేయి

భౌగోళికం

షేక్‌పేట 29 చ.కి.మీ.ల విస్తార్ణంలో ఉంది. ఇది 17°40′55″N 78°39′08″E అక్షాంశరేఖాంశాల మధ్యన ఉంది.

ఉప ప్రాంతాలు

  • షేక్‌పేట్ నాలా
  • అలీజాపూర్
  • ద్వారకా నగర్
  • వినోభా నగర్
  • ఓయూ కాలనీ
  • అల్-హమ్రా కాలనీ
  • గుల్షన్ కాలనీ
  • డైమండ్ హిల్స్
  • కుతుబ్ షాహీ టూంబ్స్
  • వివేకానంద నగర్ కాలనీ
  • మారుతి నగర్
  • దత్తాత్రేయ నగర్
  • జైహింద్ నగర్
  • హరిజన్ బస్తీ
  • సక్కు భాయి సొసైటీ
  • వినాయక నగర్
  • ఫ్రెండ్స్ కాలనీ
  • మినీ గుల్షన్ కాలనీ

జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 2,50,932 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,28,314 మంది పురుషులు కాగా, 1,22,618 మంది స్త్రీలు ఉన్నాయి. గ్రామంలో 57,917 గృహాలు ఉన్నాయి.

రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షేక్‌పేట మీదుగా మెహదీపట్నం, లక్డికాపూల్, అబిడ్స్, కోఠి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పటాన్‌చెరు, భెల్ వరకు బస్సులు నడుపబడుతున్నాయి.[4]

ఇతర వివరాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.