షేక్‌పేట సరాయి

From Wikipedia, the free encyclopedia

షేక్‌పేట సరాయి

షేక్‌పేట సరాయి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోల్కొండ సమీపంలో ఉన్న భవనం. ఇది 1633-34 మధ్యకాలంలో కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా చే నిర్మించబడింది.[1][2]

త్వరిత వాస్తవాలు షేక్‌పేట సరాయి, సాధారణ సమాచారం ...
షేక్‌పేట సరాయి
Thumb
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంగోల్కొండ, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1633-34
మూసివేయి

నిర్మాణం

ఈ సరాయితో ఒక మసీదు,ఒక దర్గా, 30గదులతో కూడిన రెండంతస్తుల మేడ, గుర్రం, ఏనుగు, ఒంటెలను ఉంచేందుకు వివిధ నిర్మాణాలు చేపట్టబడ్డాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా 15 గదుల చొప్పున 30 గదులు నిర్మించబడ్డాయి. ఒకేసారి 500మంది ప్రార్థనలు చేసుకునేవిధంగా ప్రధాన ద్వారానికి కుడిపైపున మసీదు నిర్మించబడింది.[3]

ఉద్దేశ్యం

గ్రామీణ, ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇతర పనుల మీద నగరానికి వస్తూపోతున్న వారికి మూడు రోజుల పాటు ఉచిత వసతి భోజన సదుపాయాలను అందించడంకోసం ఈ సరాయి (అతిథి గృహం) నిర్మించబడింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.