తమిళనాడు లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని 38 జిల్లాలలో (పరిపాలన జిల్లా) శివగంగ జిల్లా ఒకటి.ఈ జిల్లా 1985 మార్చి 15న రామనాథపురం జిల్లాను రామనాథపురం, విరుదునగర్, శివగంగై జిల్లాలుగా విభజించడం ద్వారా ఏర్పాటు చేయబడింది. శివగంగ జిల్లాకేంద్రంగా ఉంది.కరైకుడి, శివగంగ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన పట్టణాలు. దీనికి ఈశాన్యంలో పుదుక్కోట్టై జిల్లా, ఉత్తరాన తిరుచిరాపల్లి జిల్లా, ఆగ్నేయంలో రామనాథపురం జిల్లా, నైరుతిలో విరుదునగర్ జిల్లా, పశ్చిమాన మధురై జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.ఈ ప్రాంతంలోని ఇతర పెద్ద పట్టణాలలో శివగంగై, కళయార్ కోవిల్, దేవకోట్టై, మనమదురై, ఇళయంగుడి, తిరుప్పువనం, సింగంపునరి, తిరుప్పత్తూరు ఉన్నాయి.2011 నాటికి, జిల్లాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,003 స్త్రీల లింగ నిష్పత్తితో 1,339,101 జనాభా ఉంది.[4]
Sivaganga District
சிவகங்கை மாவட்டம் Sivagangai Mavattam | |
---|---|
District | |
Country | India |
State | తమిళనాడు |
జిల్లా | Sivaganga |
ప్రధాన కార్యాలయం | Sivaganga |
Boroughs | Sivaganga, Devakottai |
Government | |
• Collector & District Magistrate | V Rajaraman IAS |
విస్తీర్ణం | |
• Total | 4,189 కి.మీ2 (1,617 చ. మై) |
జనాభా (2011)[2] | |
• Total | 13,41,250 |
• జనసాంద్రత | 274.7/కి.మీ2 (711/చ. మై.) |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 630561 |
టెలిఫోన్ కోడ్ | 04575 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | TN-63[3] |
Largest city | Karaikudi |
లింగ నిష్పత్తి | M-49%/F-51% ♂/♀ |
అక్షరాస్యత | 52.5%% |
Legislature type | elected |
Climate | Very dry and hot with low humidity (Köppen) |
Precipitation | 875.2 మిల్లీమీటర్లు (34.46 అం.) |
రామ్నాడు, శివగంగై, పుదుకోట్టై భూభాలు కలిపి రామ్నాడు రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. రామ్నాడు రాజ్యం 7వ రాజైన రేగునాథా సేతుపతి (కిళవన్ సేతుపతి) 1674 నుండి 1710 వరకూ పాలించాడు. శివగంగైకు 4 కి.మీ దూరంలో ఉన్న నాలుకోట్టై పాలకుడు పెరియ ఉడైయ దేవరు ధైర్యసాలు చూడడానికి నాలుకోట్టైకు వచ్చాడు. పెరియ ఉడైయారు ధైర్యసాహసాలకు మెచ్చి 1,000 మంది సన్యలను నిర్వహించడానికి అవసరమైన భూమిని ఇస్తూ ఒప్పందం మీద సంతకం చేసాడు. కిళవన్ సేతుపతి మరణం తరువాత రామ్నాడు రాజ్యానికి విజయసేతుపతి 1710లో రామ్నాడు రాజ్యానికి 8వ రాజుగా వచ్చాడు. రాజు తనకుమార్తె ఆండాల్‌ఆచ్చిని నాలుకోట్టై పాలకుడైన పెరియదేవర్ కుమారుడైన శశివర్ణదేవరుకు ఇచ్చి వివాహం చేసాడు. కుమార్తెను ఇస్తూ భరణంగా శశివర్ణదేవరుకు 1,000 సైనికుల నిర్వహణ కొరకు పెరియదేవర్ పాలనలో ఉన్న భూములను శిస్తురహితంగా ఇచ్చాడు. అలాగే తిరుపత్తూరు, పిరన్మలై, తిరుపత్తూరు, షోలపురం, తిరుభువనం అలాగే తొండై నైకాశ్రయానికి రాజప్రతినిధిని చేసాడు. ఒకవైపు కిళవన్ సేతుపతి కుమారుడు భవాని శంకరన్ రామ్నాడు భూ భాగాన్ని జయించి 9వ రాజైన సుందరేశ్వర రఘునాథను ఖైదుచేసాడు. తరువాత భవాని శంకర్ తనకుతానే రమ్నాడు రాజుగా ప్రకటినుకుని రమ్నాడు 10వ రాజైయ్యాడు. 1726 నుండి 1729 వరకు భవాని శంకర్ రామ్నాడును పాలించాడు. తరువాత భవాని శంకర్ నాలుకోట్టై అధిపతి అయిన శశివర్మ పెరియ ఉడైయారుతో తలపడి ఆయనను నాలుకోట్టై నుండి తరిమి కొట్టాడు. సుందరేశ్వర రఘునాథ సేతుపతి సహీదరుడు కట్టయ్య రామ్నాడు నుండి పారిపోయి తంజావూరు రాజా తులియాజీ శరణుజొచ్చాడు. ఒకవైపు నాలుకోట్టై నుండి తరుమికొట్టపడిన శశివర్ణదేవర్ అరణ్యాలలో తిరుగుతూ అడవిలో శివగంగై అనే జలపాతం సమీపంలో తపసు చేసుకుంటున్న సాతప్పయ్య అనే మునిని కలుసుకున్నారు. రాజ్యభ్రష్టుడైన రాజు ఆయన మీందు నిలిచి తన గాథను వివరించాడు. ఆ ముని రాజుకు ఒక మంత్రం ఉపదేశించి ఆ మంత్రాన్ని ఉపాసించిన తరువాత తంజావూరు పోయి అక్కడ పోటీకి ఉన్న పులిని చంపమని ఆదేశించాడు. అక్కడ శశివర్ణదేవర్ తనలాగే శరణార్ధి అయిన కాట్టయ్య దేవన్‌ను కలుసుకున్నాడు. వాతిరువురు ఒకరితో ఒకరు చర్చించుకుని భవానీ శంకర్‌తో తలపడడానికి అవసరమైన సహాయం అందించమని కోరారు. తంజావూరు రాజు వారికి పెద్ద సంఖ్యతో సైన్యాలను తీసుకుని సహకరించమని దళవాయిని ఆదేశించాడు. శశివర్ణదేవర్, కట్టయ్య దేవన్ సైన్యాలతో భవానీ శంకర్‌తో తలపడి 1730లో తిరిగి రామ్నాడును స్వాధీనపరచుకున్నారు. తరువాత కట్టయ్యదేవన్ రామ్నాడు 11వ రాజుగా అయ్యాడు.
కాట్టయ్య దేవన్ రామ్నాడును ఐదుభాగాలుగా విభజించి అందులో మూడుభాగాలను తన ఆధీనంలో ఉంచుకుని మిగిలిన రెండు భాగాలకు నాలుకోట్టని కేంద్రగా చేసి దానికి శశివర్ణదేవరును రాజప్రతినిధిగా చేసాడు. అంతేకాక శశివర్ణదేవరుకు " రాజా ముత్తు విజయ రఘునాథ పెరియ ఉడైయ దేవర్ అనే " బిరుదుప్రదానం చేసాడు.
శశివర్ణ పెరియ ఉడైయ దేవర్ 1750లో మరణించాడు. తరువాత ఆయన ఏకైక కుమారుడు ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు శివగగైకు 2వ పాలకుడయ్యాడు. ఆయన భార్య " రాణి వేలునాచ్చియార్" ఆయనకు మిత్రురాలిగా, మార్గదర్శిగా, ఫిలాసఫర్‌గా " వ్యవహరించింది. శివగంగైకు తాండవరాయ పిళ్ళై శక్తియుతులు కలిగిన మత్రిగా సేవలందించాడు. ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు ఆంగ్లేయులు నిరాకరించిన వాణిజ్య అవకాశాలను డచ్ వారికి అందచేసాడు. ఈ కార్యకలాపంతో ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం నవాబుకు సామంతరాజుగా కప్పం చెల్లించమని డచ్ వారుకి సహకరించడం ఆపివేయయమని ఆదేశాలు జారీ చేసారు. 1772లో తూర్పు నుండి స్మిత్ , పడమటి వైపు నుండి బెంజూరు శివగంగై మీద దాడిచేసారు. ఈ దాడిని ఎదురుచూసిన " రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు " కాళయర్‌కోయిల్ వద్ద సరికొత్త స్థావరం ఏర్పరుచుకుని శిగంగై నుండి తన మాకాం కాళయర్‌కోయిల్‌కు మార్చుకున్నాడు. 1772 జూన్ 25న శివగగైని ఆగ్లసైన్యాలు వశపరచుకున్నాయి. తరువాత రోజు ఆగ్లసైన్యాలు కాళయర్‌కోయిల్ మీద దాడిచేసి కీళనూరు, షోలపురం సైనిక స్థావరాలను స్వాధీనపరచుకున్నాయి. బెంజూరు దాడిని కొనసాగించి చివరకు రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు మీద దాడి చేసాడు. రాజా ముత్తు వడుగనాథ పెరియ ఉడైయారు తన అనుచరులతో యుద్ధంలో వీరమరణం పొందాడు. యుద్ధరంగంలో వేలునాచ్చియార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు పలువురి ప్రశంశలను అందుకున్నాయి. వేలునాచ్చియార్ తనకుమార్తె వేళాచ్చి నాచ్చియార్‌తో మంత్రి తాండవరాయ పిళ్ళై సాయంతో దిండిగల్ లోని విరుఇపాక్షికి పారిపోయింది. తరువాత వారు స్వాతంత్ర్య సమర యోధులు పెరియ మరిదు, చిన్న మరుదులతో కలిసింది.
రాణివేలునాచ్చియార్, ఆమె కుమార్తె వెళ్ళాచ్చినాచ్చియార్ హైదర్ ఆలి సంరక్షణలో దిండిగల్ సమీపంలోని విరూపాక్షిలో నివసించించారు. తరువాత నవాబు వేలునాచ్చియార్, మరుదు సహోదరులను శివగంగై పాలన చెయ్యమని తమ సంరాజ్యానికి కప్పం చెల్లించమని ఆదేశించాడు. రాణి వేలునాచ్చియార్ మరుదు సహోదరులను వెంటపెట్టుకుని శివగంగైకు వెళ్ళి 1780 నుండి రాజ్యపాలన చేపట్టి చిన్నమరుదును మంత్రిగా, పెద్దమరుదును సేనాధిపతిగా చేసి పాలన కొనసాగించింది.
1780లో వేలునాచ్చియార్ మరుదు సహోదరులకు పాలనా బాధ్యతలు అప్పగించి 1790 వరకు పాలన కొనసాగించి సుమారు 1790లో పరమపదించి ఉండవచ్చని భావించబడుతుంది. మరుదు సహోదరులు ఉడయార్ సరవై (మూకయ్యాపళనియప్పన్), సరవై అందాయర్ (పొన్నత్తాళ్)ల కుమారులు. వారు ప్రస్తుత రామనాథపురం కొంగులు వీధిలో నివసించారు. వారు పురాతన పొలిగర్ లేక దాని అనుబంధ జాతికి చెందినవారని భావించబడుతుంది.
సరవైకరన్ మరుదుషోదరుల జాతిని తెలుపుతూ వారు ఇంటిపేరుగా ఉంటూవచ్చింది. మరుదు సహోదరులు ముత్తువడుగనాదర్ వద్ద పనిచేస్తూ ఉండేవారు. తరువాత వారు సైనికాధిపతులుగా రాణించారు. చెక్కతో తయారు చెయ్యబడి చంద్రవంక ఆకారంతో పదునైన కొనతో ఉండే బూమరంగా (తమిళంలో వళరి కొయ్య) అనే ఆయుధం ప్రయోగించడంలో మరుదు సహోదరులు ఉద్దండులు అని ప్రఖ్యాతి వహించారు. మరుదు సహోదరులు ఆంగ్లేయులతో తలపడిన పొలింగర్ యుద్ధాలలో ఈ ఆయుధాన్ని ప్రయోగించారు. 12,000 సైనికులతో శివగంగ వద్ద నవాబు సైనికులతో తలపడి విజయం సాధించారు. పరాజితుడైన నవాబు 1789 మార్చి 10న మద్రాసు కౌంసిల్‌కు సహాయం కొరకు అభ్యర్ధన చేసుకున్నాడు. 1789 ఏప్రిల్ 29న ఆంగ్లసైనికులు కొల్లగడిని ముట్టడించారు. మరుదు సహోదరులు పెద్ద సైన్యం సాయంతో ఆంగ్లసైన్యాలను ఓడించారు.
మరుదసహోదరులకు వీరపాండ్యకట్టబొమ్మన్ సహోదరులతో గాఢమైత్రి ఉంటూవచ్చింది. వారిరువురు తరచూ చర్చలు సాగిస్తూ ఉండేవారు. 1799 అక్టోబరు 17న ఉరితీతకు గురైన తరువాత మూగదొరకు (ఊమైదొర)కు చిన్న మరుదు ఆశ్రయం ఇచ్చాడు. తరువాత మరుదుసహోదరులు ఆగ్లేయులను ఎదిరిస్తూ మతాతీతంగా దక్షిణభారతదేశ ముస్లిములు,క్రైస్తవులు, హొందువులను సమైక్యం చేస్తూ జంబూద్వీప ప్రకటన జారీచేసారు. ఆంగ్లేయుల నుండి మాతృదేశాన్ని విడుదల చేయాలని సంకల్పించి స్వాతన్య్రసమరంలో పాల్గొని మరుదుసహోదరులు సైతం ఓటమి పాలైయ్యారు. స్వాతంత్ర్యసమర యోధులకు నాయకత్వం వహించిన మరుదపాండ్యన్ గాయపడిన తన సహోదరుడు వెళ్ళై మరుదుతో కలిసి 1801 అక్టోబరు 24 శివగంగైజిల్లా లోని తిరుపత్తూరులో ఉన్న శిథిలమైన కోటలో ఉరితీతకు గురయ్యాడు. 1801న జరిగిన చివరి పోరాటంలో మరుదుసహోదరులు అసమానమైన ధైర్యం ప్రదర్శిస్తూ ఆంగ్లేయులను అడ్డుకుంటూ సిరువాయల్ గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేసారు. మరుదు సహోదరులు వీరులు మాత్రమే కాదు. వారు ఉత్తమమైన పరిపాలనాదక్షత కూడా ప్రదర్శించారు. వారు పాలించిన 1783-1801 మద్యకాలంలో చెరువులు, బావులు తవ్వించడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. వారిపాలనలో శివగంగైలో వ్యవసాయం అభివృద్ధి చేయబడి పాడిపంటలు మెరుగునపడ్డాయి. మరుదసహోదరులు శివగంగై ప్రాంతంలో పలు ఆలయాలను కూడా నిర్మించారు.
వరుసగా వచ్చిన పలువురు పాలకుల తరువాత శ్రీ కార్తికేయ వెంకటాచలపతి రాజయ్యా శ్రీషణ్ముగ రాజయ్యా శివగంగా సంస్థానం వారసుడయ్యాడు. ఈ ట్రస్టీ ఆధీనంలో 108 ఆలయాలు, 22 కట్టళైలు, 20 సత్రాలు నిర్వహించబడుతున్నాయి. డాక్టర్ వెంకటాచలపతి రాజయ్యా తన కుమార్తె శ్రీమతి మదురతంగై నాచ్చియారును వారసురాలిగా వదిలి 1986 ఆగస్టు 30న మరణించాడు. ప్రస్తుతం మదురతంగై నాచ్చియార్ శివగంగై సంస్థానాన్ని నిర్వహిస్తున్నారు. రామనాథపురం జిల్లా గజిట్ ఆధారంగా 1990 శివగంగై సంస్థానం నిర్వహింతున్న శివగంగై చరిత్రలో శివగంగైజిల్లా శివగంగై జమీన్, రామనాథపురం జమీను నుండి రూపుదిద్దుకున్నదని తెలుస్తుంది.
మతాల ప్రకారం శివగంగై జిల్లా జనాభా (2011)[5] | ||||
---|---|---|---|---|
Religion | Percent | |||
హిందూ | 88.57% | |||
క్రిష్టియన్లు | 5.64% | |||
ముస్లిం | 5.55% | |||
మతం తెలపనివారు | 0.24% |
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 5,07,437 | — |
1911 | 5,41,914 | +0.66% |
1921 | 5,58,870 | +0.31% |
1931 | 5,94,132 | +0.61% |
1941 | 6,45,707 | +0.84% |
1951 | 6,70,675 | +0.38% |
1961 | 7,47,159 | +1.09% |
1971 | 8,86,135 | +1.72% |
1981 | 9,96,235 | +1.18% |
1991 | 11,03,077 | +1.02% |
2001 | 11,55,356 | +0.46% |
2011 | 13,39,101 | +1.49% |
source:[6] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, శివగంగ జిల్లాలో 1,339,101 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,003 స్త్రీల లింగ నిష్పత్తి, జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ. జనాభాలో 30.83% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 137,235 మంది ఆరేళ్లలోపు వారు, 70,022 మంది పురుషులు, 67,213 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 17.01% మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు జనాభా 06% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 71.67%, జాతీయ సగటు 72.99%తో పోలిస్తే ఇదికొద్దిగా ఎక్కువ. జిల్లాలో మొత్తం 338,938 కుటుంబాలు ఉన్నాయి. జనాభా మొత్తంలో 6,20,171 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 1,17,030 మంది సాగుదారులు, 1,22,166 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 9,864 గృహ పరిశ్రమలు, 2,12,042 ఇతర కార్మికులు, 1,59,069 గృహ కార్మికులు, ఉపాంత కార్మికులు 23,77, మార్జినల్ కార్మికులు 39,977 పరిశ్రమలు మీద ఆధారపడినవారు, 52,907 ఇతర ఉపాంత కార్మికులు ఉన్నారు. 99.14% మంది మాట్లాడే ప్రధాన భాష తమిళం.
జిల్లా కేంద్రంగా శివగంగై నగరం ఉంది. జిల్లా 2 రెవెన్యూ విభాగాలుగా, 6 తాలుకాలుగా విభజించబడింది.
రెవెన్యూ విభాగం | తాలూకాలు | రెవెన్యూ
గ్రామాల సంఖ్య |
---|---|---|
శివగంగ | శివగంగ, మానామదురై, ఇళయంకుడి, తిరుభువనం | 267 |
దేవకోట్టై | దేవకోట, కారైకుడి, తిరుపత్తూరు | 255 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.