Remove ads
From Wikipedia, the free encyclopedia
వీర శంకర్ బైరిశెట్టి తెలుగు సినిమా దర్శకుడు, మ్యూజిక్ కోఆర్డినేటర్.[1] ఆయన 2024 ఫిబ్రవరి 11న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[2]
అతని జన్మస్థలం కర్ణాటక లోని గంగావతి. అతని తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ స్వగ్రామం తణుకు దగ్గర చిపటం గ్రామం. వీరశంకర్ కు వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు అనే ఇద్దరు సోదరులున్నారు.[3] అతను 1970 ఆగస్టు 17న జన్మించాడు.[4] అతను మొదట కోడి రామకృష్ణ దగ్గర సహ దర్శకుడిగా పనిచేసాడు. తరువాత 1997 హలో ఐ లవ్ యు సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించి తెలుగు సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసాడు. 2004 లో పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా తీసాడు.[5]
అతను ఈ క్రింది సినిమాలకు దర్శకత్వం వహించాడు.[6]
సంవత్సరం | సినిమా | భాష | వివరణము |
---|---|---|---|
1997 | హలో ఐ లవ్ యూ | తెలుగు | |
1999 | ప్రేమ కోసం | తెలుగు | |
2000 | విజయ రామరాజు | తెలుగు | |
2004 | గుడుంబా శంకర్ | తెలుగు | |
2005 | నమ్మ బసవ | కన్నడ | |
2008 | అంతు ఇంతు ప్రీతి బంతు | కన్నడ | ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు రీ మేక్ |
2015 | మన కుర్రాళ్ళే | తెలుగు | |
2018 | యువరాజ్యం | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.