Remove ads
భార్యాభర్తలు విడిపోవడం From Wikipedia, the free encyclopedia
పెళ్ళి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలలో విడాకులు ఎక్కువగా జరుగుచున్నవి. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది.వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి.భాగస్వామికి కుష్టు, మానసిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇవ్వవచ్చు.వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయి.'పాత రోజుల్లో మన తాత, ముత్తాతలకు ఇలాంటి సమస్యలు లేవు. అప్పట్లో వివాహ వివాదాలు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే పరిష్కారమయ్యేవి. పిల్లలకోసం తల్లిదండ్రులు అహం వదులుకోవాలి.తల్లిదండ్రుల విడాకులవల్ల చివరకు బాధపడేది పిల్లలే. ఆడపిల్ల విషయంలోనైతే వివాహం సమయంలోపరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇస్లాం ప్రకారం భర్త మూడుసార్లు తలాక్ అంటే ఇక ఆ వివాహ బంధం రద్దు అయినట్లే. భర్త సరదాగా అన్నా కూడా ఇక ఆ వివాహం చెల్లదు. కతార్‌కి చెందిన ఒక వ్యక్తి సరదాగా ఇంటర్నెట్ లో తన భార్యకి తలాక్ అని మూడు సార్లు చెప్పాడు. దీంతో అతడి వివాహం రద్దు చేయబడింది. షరియా చట్టం ప్రకారం ఇస్లామిక్ మతసంస్థ దార్-ఉల్-ఉలూమ్ వివాహం చెల్లదని తీర్పు ఇచ్చింది. డియోబండ్ కి చెందిన దార్-ఉల్-ఇఫ్తా అతడికి ఇక నుంచీ తన భార్య హరామ్ అని పేర్కొంది. తనకి భార్య మీద ప్రేమ ఉన్నా ఇప్పుడు ఆమెతో అతడు జీవితం కొనసాగించలేకపోతున్నాడని వాపోయాడు. పోనీ మళ్ళీ ఆమెనే పెళ్ళి చేసుకుందామన్నా ఇందుకు ఇస్లామిక్ చట్టాలు అంగీకరించవు. ఇందుకు ఒక పరిష్కారం సూచించారు. అదే హలాలాహ్. అంటే ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అతడికి విడాకులిస్తేగానీ తిరిగి పాత భర్తని వివాహం చేసుకునేందుకు అర్హురాలు కాదు. అంతకన్నా ముందు ఆమె ఇద్దత్ ని అనుసరించాలి. అనగా విడాకులు పొందాక మూడు నెలలు పాటు మళ్ళీ వివాహం చేసుకోరాదు. అంతేగాక తను అన్ని సంతోషాలకు, సంబరాలకు దూరంగా ఉండాలి. ఇలా రెండు మార్లు ఇద్దత్ అనుభవించిన తర్వాత తిరిగి పాత భర్తని వివాహం చేసుకోవాలి. భార్య తలాక్ ఇచ్చిందా లేదా అన్న విషయంతో సంబంధం లేదని ఫత్వాలో పేర్కొనబడింది. ఈ విషయాలు బుఖారీలో (Vol. 2, P. 791), ఫతావా అల్-హిన్దియాలో పేర్కొనబడ్డాయని దార్-ఉల్-ఉలూమ్ కి చెందిన ముఫ్తీ ఆరిఫ్ కస్మీ చెప్పాడు.[1] మొబైల్ ఫోన్లో తలాక్ :మొబైల్ ఫోన్లో మూడుసార్లు తలాక్ చెప్పినప్పుడు నెట్‌వర్క్ సమస్య వల్ల కానీ ఇతర కారణాల వల్ల కాని అతని భార్యకు వినపడకపోయినా అది చెల్లుబాటు అవుతుందని దార్ ఉల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఫత్వా జారీ చేసింది.[2]
విడిపోయిన భార్య పోషణ కోసం భర్త చెల్లించవలసిన భరణం. ఎయిడ్స్ ఉన్నా మనోపర్తి చెల్లించాల్సిందే. విడిపోయిన భార్యాపిల్లలకు మనోవర్తి చెల్లించకుండా తప్పించుకోవడం కుదరదు.భర్తగా.. నైతిక, సామాజిక, చట్టపరమైన తన బాధ్యత నుంచి అతను తప్పించుకోలేడు.రెండో భార్యకు మనోవర్తి రాదు.వివాహితుడ్ని పెళ్లాడిన హిందూ మహిళ తనకు మనోవర్తి కావాలని కోరే అవకాశం లేదు.హిందూ చట్టం ప్రకారం మొదటి భార్య బతికుండగానే రెండో పెళ్ళి చేసుకోవడం కుదరదు. బహుభార్యలున్న భర్త తనను సరిగా చూసుకోవడం లేదని సమాన ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ ఓ ముస్లిం మహిళ నిశ్చయించుకొని విడాకులు కోరితే ముస్లిం వివాహ చట్టం 1939లోని సెక్షన్ 2 (6) (ఎఫ్) ప్రకారం కోర్టులు ఆమె వాదనను అంగీకరించాల్సిందే.భర్త తనపై వివక్ష చూపుతున్నాడా? లేదా అనే విషయాన్ని నిర్ణయించడంలో భార్యే సరైన జడ్జి.
పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈ విషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది.
భార్యా భర్తల మధ్య అపనమ్మకం; ప్రేమ లేకపోవడం; లైంగిక సామర్ద్యం లోపించడం; వివాహేతర సంబంధాలు; డబ్బు మీద వ్యామోహం; పాశ్చాత్య సంస్కృతి ప్రభావం; అత్యధిక జీతాలు; అహం; వరకట్న వేధింపులు; స్త్రీ ఉద్యోగ -ఆర్ధిక స్వేచ్ఛ దుర్వినియోగం; ఒకరిమీద ఒకరు ఆధారపడకపోవడం; నైతిక విలువలు లోపించడం; ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం; 498 ఎ గృహహింస చట్టం దుర్వినియోగం; మొదలగున్నవి కారణాలుగా చెప్పవచ్చు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.