Remove ads
కేరళ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
వయనాడ్ జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రం లోని జిల్లా.[1] 1980 నవంబరు 1న కేరళ రాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా అవతరించింది. కోజికోడ్ జిల్లా, కణ్ణూర్ జిల్లా నుండి కొంత భూభాగం విభజించుట ద్వారా ఈ జిల్లా ఏర్పడింది. జిల్లాలో 3.79% నగరీకరణ చేయబడింది. జిల్లాలో కల్పెట్టా పురపాలక సంఘం ఒకటి మాత్రమే ఉంది.జిల్లా ప్రధాన కార్యాలయం కల్పెట్టా పురపాలక సంఘ పట్టణం.ఇది కేరళ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. కేరళలోని ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా,వయనాడ్ జిల్లాలో, అదే పేరుతో ఉన్న పట్టణం లేదా గ్రామం లేదు (అంటే, "వయనాడ్ అనే పట్టణం" లేదు).2018 గణాంకాల నివేదిక ప్రకారం, వాయనాడ్ జిల్లా జనాభా 8,46,637,ఇది కొమొరోస్ దేశం లోని జనాభాకు దాదాపు సమానం. [2]
Wayanad district | |
---|---|
District | |
Country | India |
State | కేరళ |
ప్రధాన కార్యాలయం | Kalpetta |
Government | |
• Member of Parliament | M I Shanavas |
• District Collector | K. G. Raju IAS |
• District Panchayat President | K.L. Poulose |
విస్తీర్ణం | |
• Total | 2,131 కి.మీ2 (823 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 8,16,558 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (990/చ. మై.) |
భాషలు | |
• అధికార | Malayalam, English |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-KL- |
Vehicle registration | KL-12, KL-72, KL-73 |
ఆరంభకాలంలో ఈ ప్రాంతం మయక్షేత్రంగా పిలువబడింది. మయక్షేత్రం క్రమంగా మయనాడు తరువాత వయనాడు అయింది.[3] ప్రజాబాహుళ్యంలో ఉన్న ఒక కథనం ఆధారంగా వయల్ అంటే " వరి పొలాలు " నాడు అంటే " భూమి " అని అర్ధం. అంటే " వరి పొలాల భూమి " అని అర్ధం. ఈ ప్రాంతంలో గిరిజన ప్రజలు ఎక్కువమంది నివాసం ఉన్నారు.[4]
జిల్లా పశ్చిమకనుమలలో సముద్రమట్టానికి 700-2100 మీ ఎత్తున ఉంది.[5][6] కేరళ రాష్ట్రంలో అత్యల్పజనసాంధ్రత కలిగిన జిల్లాగా వయనాడు గుర్తించబడింది.[7] కేరళలోని మిగతా జిల్లాల మాదిరిగా జిల్లాలో వయనాడు పేరుతో గ్రామం లేదా పట్టణం లేదు.
కేరళ రాష్ట్రంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఒకేఒక జిల్లా వయనాడు మాత్రమే. జిల్లా సరిహద్దులలో కేరళ రాష్ట్రానికి చెందిన కోజికోడ్, కణ్ణూర్ (కేరళ), మలప్పురం జిల్లాలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన నీలిగిరి జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన చామరాజనగర్ జిల్లా, మైసూర్ జిల్లా, కొడగు జిల్లా (కూర్గు జిల్లా) ఉన్నాయి. కర్నాటక
వయనాడు ప్రాంతంలో 3000 సంవత్సరాలకంటే ముందుగా మానవులు నివసించారని ఆర్కియాలజీ ఆధారాలు తెలియజేస్తున్నాయి. చరిత్రకారుల పరిశోధనల ఆధారంగా క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాలకు ముందే ఈప్రాంతంలో మానవులు నివసించారని భావిస్తున్నారు. ప్రస్తుత వయనాడు జిల్లాలోని కొండప్రాంతాలంతటా కొత్తరాతి యుగానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించాయి.అంపుకుదిమల లోని రెండుగుహలలోని కుడ్యచిత్రాలు, సంఙాలిపి ఇక్కడ నాగరికతకు చిహ్నంగా నిలిచి ఉన్నాయి. జిల్లా గురించిన వ్రాతపూర్వక ఆధారాలు 18వ శతాబ్దం నుండి లభిస్తున్నాయి.ఈప్రాంతంలో సా.శ. 1900 నుండి జిల్లాలో వ్యవసాయం ఆరంభం అయింది.పురాతనకాలంలో ఈప్రాంతాన్ని వేదా రాజవంశానికి చెందిన రాజాలు పాలించారు. తరువాత రోజులలో వయనాడు ప్రాంతం పళసి రాజా పాలించిన కొట్టయంరాజ్యంలో భాగంగా ఉండేది.
హైదర్ అలీ [8] మైసూర్ పాలుకుడైన తరువాత ఆయన వయనాడు మీద దండెత్తి వయనాడు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. టిప్పు సుల్తాన్ కాలంలో [9] కొట్టయం రాజవంశం తిరిగి వయనాడును స్వాధీనం చేసుకుంది.అయినా టిప్పు సుల్తాన్ ఉత్తర కేరళ ప్రాంతం అంతటినీ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం చేసాడు[10] ఇందు కొరకు " ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం " కొరకు అప్పటి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, కాలనియల్ అడ్మినిస్ట్రేటర్ కార్న్‌వాల్స్ సంతకం చేసాడు.[11]
తరువాత కోట్టయం పాలకుడు పళసిరాజా, బ్రిటిష్ ప్రభుత్వం మద్య భయంకరమైన, ఇరిపక్షాలకు విధ్వంసకరమైన కలహాలు జరిగాయి. పళసిరాజా అరణ్యమయమైన వయనాడుకు తరలించబడిన తరువాత ఆయన కురిచ్యా గిరిజనులతో కలిసి సైన్యసమీకరణ చేసి బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం కొనసాగించాడు. చివరిగా బ్రిటిష్ పళసిరాజా ఆత్మబలిదానం చేసుకున్న తరువాత ప్రభుత్వం పళశిరాజా మరణించిన తరువాత శరీరాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా వయనాడును బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వయనాడు సరికొత్త శకంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వం రహదారులు నిర్మించడం ద్వారా మైదానభూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చి టీ, ఇతర వాణిజ్యపంటలు పండించడం ఆరంభించింది.క్రమంగా ప్రమాదకరమైన వయనాడు, కోళికోడ్, తలస్సేరి కొండచరియలో వాణిజ్యపంటలు పండించబడ్డాయి.
తరువాత రహదారులు గుండలూరు మీదుగా కర్నాటకరాష్ట్రానికి చెందిన మైసూర్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఊటీ వరకు పొడిగించబడింది.తరువాత కేరళరాష్ట్రం అంతటి నుండి ప్రజలు వయనాడుకు వలసవచ్చి వాణిజ్యపంటలను అభివృద్ధి చేసారు. 1956లో కేరళ రాష్ట్రం అవతరించిన తరువాత వయనాడు జిల్లా కణ్ణూర్ జిల్లాలో భాగంగా మారింది. తరువాత దక్షిణ వయనాడు ప్రాంతం కోళికోడ్ జిల్లాలో భాగంగా మారింది.వయనాడు ప్రాంత కోరికను మన్నించి వయనాడు అభివృద్ధి కొరకు ఉత్తర వయనాడు, దక్షిణ వయనాడు ప్రాంతాలను విభజించి వయనాడు జిల్లాగా రూపొందించారు.1980 నవంబరు 1 నుండి కేరళరాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా ఉనికిలోకి వచ్చింది.[12] జిల్లాలో వ్యతిరి, మనంతవాడి, సుల్తాన్ బతెరి తాలూకాలు ఉన్నాయి.
వయనాడు జిల్లా దక్షిణపీఠభూమి దక్షిణతీరాన ఉంది. పశ్చిమకనుమలలోని ఎగుడుదిగుడు భూమిలో నెలకొని ఉన్న వన్యసౌందర్యం జిల్లాకు ప్రత్యేకత సంతరించింది.దట్టమైన అరణ్యం మద్య పదునైన అంచులు కలిగిన కొండచరియలు, లోయలు జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. జిల్లాలో అధికభాగం విస్తరించి ఉన్న అరణ్యం ప్రస్తుతం ఆక్రమణకు చొరబాటుకు లోనౌతూ ఉంది.[13] జిల్లాలో అధికంగా ఆకురాల్చు వనం, పొడిభూములు, చిత్తడిభూములు ఉన్నాయి.పశ్చిమకనుమల పర్వతశ్రేణి మద్య విస్తరించిన వయనాడు కేరళరాష్ట్రం లోని హిల్ స్టేషన్లలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది.
జిల్లాలోని పర్వతశిఖరాలలో చంబా శిఖరం (ఎత్తు 2100 మీ), బాణాసురా శిఖరం (ఎత్తు 2073 మీ), బ్రహ్మగిరి (ఎత్తు 1608 మీ) మొదలైనవి ప్రధానమైనవి. ఇతర అనామధేయ శిఖరాలు కూడా ఉనికిలో ఉన్నాయి.
జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో కావేరి నదీ ఉపనదులలో ఒకటైన కబినీ నది (తూర్పుకు ప్రవహిస్తున్న మూడు కేరళరాష్ట్ర నదులలో ఒకటి) ఉంది. వయనాడు జిల్లా మొత్తంలో కబినీ నది, కబినీ నది మూడు ఉపనదులు (పనమరం, మనంతవాడి, కాలీనది) వ్యవసాయానికి అవసరమైన జలాలను అందిస్తున్నాయి.కబినీ నది ఉపనది మీద బాణాసురా ఆనకట్ట నిర్మించబడింది.
సముద్రమట్టానికి ఎత్తున ఉండడం, వన్యప్రాంతంతో కప్పబడి ఉండడం కారణంగా జిల్లాలో ఏప్రిల్, మే మాసాలలో మినహా అత్యంత శీతలవాతావరణం నెలకొని ఉంది.వేసవి ఏప్రిల్, మేమాసాలలో ఉంటుంది. అరుదుగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.వేసవిలో కూడా శితలపవనాలు వీస్తుంటాయి.వర్షాకాలంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 3200 మి.మీ. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్షియస్ చేరుకుంటుంది.
వయనాడు వర్షారణ్యప్రాంతంలో వర్షపాతం అధికగా ఉంటుంది.ఉత్తర వయనాడు ప్రాంతంలో చలి అత్యధికంగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత దాదాపు ఘనీభవన స్థితికి చేరుకుంటున్నది. జనవరి మాసం అత్యంత శీతలమాసంగా ఉంటుంది.శీతాకాలం నవంబరు, ఫిబ్రవరి మద్యకాలంలో ఉంటుంది." కొప్పెన్ - గెయిజర్ " వర్గీకరణ వయనాడు జిల్లాను " సబ్ ట్రాపికల్ హైలాండ్ "గా గుర్తించింది.[14]
శీతోష్ణస్థితి డేటా - వయనాడ్ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 21.1 (70.0) |
22.4 (72.3) |
25 (77) |
27.5 (81.5) |
28.9 (84.0) |
25.5 (77.9) |
23.3 (73.9) |
23.5 (74.3) |
22.1 (71.8) |
22.7 (72.9) |
21.8 (71.2) |
21.6 (70.9) |
23.8 (74.8) |
రోజువారీ సగటు °C (°F) | 17 (63) |
19.6 (67.3) |
25 (77) |
25.6 (78.1) |
25.9 (78.6) |
20.3 (68.5) |
19.3 (66.7) |
19.5 (67.1) |
19.6 (67.3) |
19.2 (66.6) |
18.3 (64.9) |
17.8 (64.0) |
20.6 (69.1) |
సగటు అల్ప °C (°F) | 7 (45) |
13.7 (56.7) |
13.1 (55.6) |
16.5 (61.7) |
17.8 (64.0) |
16.9 (62.4) |
15.3 (59.5) |
15 (59) |
14.7 (58.5) |
13.9 (57.0) |
10 (50) |
8 (46) |
13.5 (56.3) |
సగటు అవపాతం mm (inches) | 18 (0.7) |
29 (1.1) |
47 (1.9) |
129 (5.1) |
189 (7.4) |
500 (19.7) |
583 (23.0) |
650 (25.6) |
300 (11.8) |
253 (10.0) |
164 (6.5) |
64 (2.5) |
2,926 (115.3) |
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు | 248 | 232 | 248 | 240 | 217 | 120 | 124 | 124 | 150 | 155 | 180 | 217 | 2,255 |
Source 1: Climate-Data.org, altitude: 1461m[14] | |||||||||||||
Source 2: Weather2Travel for sunshine and rainy days[15] |
వయనాడు జిల్లా 3.79% నగరీకరణ చేయబడింది. జిల్లా ప్రజలు అధికంగా వ్యవసయ్యం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాఫీ, టీ, కొక్కో, నల్లమిరియాలు, వెలిల్లా మొదలైనవి ప్రధానపంటలుగా ఉన్నాయి. విదేశీమారకం సంపాదించడం ద్వారా జిల్లా రాష్ట్రానికి వాణిజ్యపంటల ప్రధాన కూడలిగా ఉంది.
వాణిజ్యపంటలతో జిల్లాలో వరికూడా పండించబడుతుంది. వయనాడు జీరాకలస బియ్యం, వయనాడు గంధకసల బియ్యం ప్రపంచంలో అత్యంత సుగంధభరితమైనవని భావిస్తున్నారు. జిల్లాలోని మెట్టప్రాంతాలకు ఆనకట్టలను నిర్మించి వ్యవసాయ జలాలను తరలించి జిల్లాను సస్యశ్యామలం చేసారు. జిల్లాలో పంటభూమి విలువ రోజురోజుకు అధికరిస్తూ ఉంది.పశువుల పెంపకం వాయనాడ్ ప్రజలకు మరొక ప్రధాన ఆదాయాన్ని అందిస్తుంది.
జిల్లాకు వ్యవసాయ ఆదాయం తరువాత ఆదాయం లభిస్తున్న ఇతర రంగాలలో పర్యాటకరంగం ప్రధానమైనది. కేరళరాష్ట్రంలో ఆహ్లాదరమైన హిల్ స్టేషన్లలో వయనాడు ఒకటి. పశ్చిమకనుమల పర్వతశ్రేణి పలు జలాశయాలు, వన్యప్రాణి అభయారణ్యాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఇది ఆకర్షణీయమైన పర్యాటకగమ్యంగా ప్రత్యేకత సంతరించుకుంది.
వయనాడు జిల్లాలో పరిశ్రమలు అధికంగా లేరు. కాల్పెట్టా వద్ద ఉన్న " ది వయనాడు డెయిరీ ఆఫ్ మిల్మా " (కేరళ కో- ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ), కాల్పెట్ట వద్ద కింత్రా ఏర్పాటు చేసిన మినీ ఇండస్ట్రియల్ పార్క్ జిల్లా పరిశ్రలలో ప్రధానమైనవి. మినీ ఇండస్ట్రియల్ పార్క్‌లో గుర్తింపు పొందిన పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి.
2006లో పంచాయతీ మంత్రిత్వశాఖ భారతదేస 250 వెనుకబడిన జిల్లాలో ఒకటిగా వయనాడును గుర్తించింది.[16] ప్రస్తుతం " బ్యాక్వర్డ్ గ్రాంట్ ఫండ్ " నుండి నిధులను అందుకుంటున్న 2 కేరళ రాష్ట్ర జిల్లాలలో వయనాడు జిల్లా ఒకటి.[16]
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1901 | 75,149 | — |
1911 | 82,549 | +0.94% |
1921 | 84,771 | +0.27% |
1931 | 91,769 | +0.80% |
1941 | 1,06,350 | +1.49% |
1951 | 1,69,280 | +4.76% |
1961 | 2,75,255 | +4.98% |
1971 | 4,13,850 | +4.16% |
1981 | 5,54,026 | +2.96% |
1991 | 6,72,128 | +1.95% |
2001 | 7,80,619 | +1.51% |
2011 | 8,17,420 | +0.46% |
2018 | 8,46,637 | +0.50% |
source:[17] |
మతాల ప్రకారం వయనాడ్ జిల్లా జనాభా (2011)[18] | ||||
---|---|---|---|---|
మత వివరం | శాతం | |||
హిందూ | 49.48% | |||
ఇస్లాం | 28.65% | |||
క్రైస్తవులు | 21.34% | |||
మత వివరం తెలపని వారు | 0.53% |
2011 భారత జనాభా లెక్కలు భారతదేశంలోని మొత్తం 640 జిల్లాలలో జనాభాపరంగా జిల్లాకు 482వ ర్యాంక్ ఉంది జిల్లాలో జనాభా ప్రతి చ.కి.మీ (1.030 చ.మైళ్లు).సరాసరి 397 మంది జనసాంద్రతను కలిగి ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు జనాభా వరుసగా 3.87%, 18.86% ఉన్నారు. [20] ఇది కేరళ మొత్తం జనాభాలో అత్యధిక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు శాతం.[21]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 816,558,[7] |
ఇది దాదాపు. | కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[22] |
అమెరికాలోని. | సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[23] |
640 భారతదేశ జిల్లాలలో. | 482వ స్థానంలో ఉంది..[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 383 [7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 4.6%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1035:1000 [7] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 89.32%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో గిరిజనప్రజలు అధికంగా ఉన్నారు. వారు పురాతనమైన అలవాట్లు, ఆచారాలను అనుసరిస్తూ సంచార జీవనం సాగిస్తుంటారు. కొంతమంది పినియాలు, అదియాలు, కట్టునాయకన్లు, కురుమన్లు, కురుచియాలు ప్రధాన జాతులుగా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో ఆదివాసీలు అత్యధికంగా నివసిస్తున్న జీల్లాగా (36%) వయనాడు జిల్లా గుర్తించబడుతుంది.అధిక సంఖ్యలో వలసప్రజలు ఉన్న జిల్లాగా కూడా వయనాడుజిల్లాకు ప్రత్యేకత ఉంది. 13వ శతాబ్దంలో కర్నాటక రాష్ట్రం నుండి జైనిజం జిల్లాలో ప్రవేశించింది.14వ శతాబ్దంలో కణ్ణూర్ జిల్లా లోని కురుంబ్రనాడు, కొట్టయం ప్రాంతాల నుండి హిందువులు, నాయర్లు వయనాడుకు చేరుకుని రాజరికవ్యవస్థ స్థాపించారు. వారి తరువాత ముస్లిములు (26.87%) 1940లో దక్షిణ కేరళ ప్రాంతం నుండి వయనాడు ప్రాంతానికి వలసవచ్చారు.1950లో ట్రావన్‌కోర్ ప్రాంతం నుండి క్రైస్తవులు వయనాడు ప్రాంతానికి వలస వచ్చారు.గత కొన్ని శతాబ్దాలుగా స్థానికులు వారి హక్కుల కొరకు పోరాటం ప్రారంభించారు.
జిల్లా కేంద్రం: కలపెట్ట. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ చీఫ్, జిల్లా జడ్జి కలపెట్ట వద్ద ఉంటారు.తాలూకాల సంఖ్య: 3
రాష్ట్ర అసెంబ్లీ శాసనకర్తల సంఖ్య: 3 [24]
లోక్‌సభ ప్రాతినిధ్యం: 1
వయనాడు జిల్లా మీదుగా కోళికోడ్ - మైసూర్ జాతీయరహదారి 212 పయనిస్తుంది. ఈ రహదారి జిల్లా ప్రజలను కోళికోడ్, కొచ్చి, తిరువనంతపురం చేరుకోవడానికి అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, మైసూరు చేరుకోవడానికి సహకరిస్తుంది.[25][26]
మైసూరు మీదుగా పయనించే జాతీయరహదారి - 212 వయనాడు జిల్లా సరిహద్దులను తాకుతూ పయనిస్తుంది. జాతీయరహదారి - 212 " బండిపూర్ నేషనల్ పార్క్ " దాటి వెళుతుంది.2009 వరకు ఇక్కడ రాత్రివేళ వాహనాల రాకపోకలు నియత్రించబడ్డాయి.[29]
వయనాడు జిల్లా రైలుమార్గంతో అనుసంధానించబడి లేదు. సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ కాల్పెట్టాకు 72కి.మీ దూరంలో ఉన్న కోళికోడ్‌లో ఉంది. అలాగే తలస్సేరి రైల్వే స్టేషన్ (మనంతవాడి 80 కి.మీ దూరం), కణ్ణూర్ రైల్వే స్టేషన్ (మనతవాడి నుండి 93 కి.మీ దూరం, మైసూర్ రైల్వే స్టేషన్ (మనంతవాడి -110 కి.మీ. సుల్తాన్ భతేరి నుండి 115 కి.మీ దూరం) ఉన్నాయి.[30]
కరిపూర్ వద్ద ఉన్న " కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " జిల్లాకు సమీపంలోని విమానాశ్రయంగా ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 95కి.మీ దూరంలో ఉంది. కణ్ణూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (మట్టనూర్) నిర్మాణదశలో ఉంది.ఇది మనంతవాడి నుండి 70కి.మీ దూరంలో ఉంది.వయనాడు జిల్లాలోని చీక్కల్లుర్, పనమరం, నడవయల్ వద్ద " ఫీడర్ ఎయిర్ పోర్ట్ " నిర్మించాలని ప్రతిపాదన చేయబడింది.[31] [32]
వయనాడు జిల్లా పశ్చిమ కనుమల నడుమ పర్వతశ్రేణిలో ఉంది. జిల్లా నుండి తీరప్రాంత పట్టణాలు, కేరళ రాష్ట్రంలోని దిగువన ఉన్న పట్టణాలకు చేరుకోవడానికి పలు హెయిర్ పిన్ మలుపులు కలిగిన కొండమార్గాలు ఉన్నాయి. జిల్లాలో 5 కొండమార్గాలు ఉన్నాయి.
కొట్టియూర్, మొదలైనవి
వయనాడు జిల్లా కేరళరాష్ట్రంలోని గిరిజనతెగల ప్రజలకు కేంద్రంగా ఉంది. జిల్లాలో దాదాపు సగం మంది ప్రజలు ఆదివాసి ప్రజలే. వారికి వారి ప్రత్యేక శైలి నృత్యాలు ఉన్నాయి. వీటిలో ఫైర్ డాంస్ (అగ్నినృత్యం) ప్రత్యేకత సంతరించుకుంది. తిరునెల్లీ ప్రాంతంలో నివసించే ఆదివాసి ప్రజలు తేనెను స్వీకరిస్తూ వారికే ప్రత్యేకమైన ప్రపంచంలో నివసిస్తుంటారు. వయనాడు ఆదివాసి ప్రజలు పర్యావరణానికి సహకరించే విధంగా వెదురువస్తువులను తయారుచేసి విక్రయిస్తుంటారు. స్థానిక ఆదివాసీ ప్రజలు పనియాలు, కురుమాలు, అదియార్లు, కురుచ్యాస్, ఊరలిలు, కట్టునైక్కన్లు మొదలైన తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు.ఇక్కడ ప్రజలు మట్టి, ఇటుకలు, వెదురు ఉపయోగించి నిర్మించిన గుడిసెలలో నివసిస్తుంటారు. వీరు లోయలు, మైదానప్రాంతంలో నివసిస్తుంటారు.గిరిజనతెగలకు చెందిన ప్రజలు చారిత్రాత్మక మూలికా వైద్యం సమీపకాలంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివాసీప్రజలకు సుసంపన్నమైన హస్థకళలు, కళలు వారసత్వంగా కలిగి ఉన్నారు. ఇందులో సంగీతం, నృత్యం, ఆభరణాలు, హస్థకళలు అంతర్భాగంగా ఉన్నాయి. ఇందులో సహజమైన వస్తువులు, అంశాలు, వారి జీవనశైలి రూపకల్పనలు ప్రతిబింబిస్తుంటాయి. వయనాడు జిల్లా లోని కురిచ్యాలు గొప్ప వివాహసంప్రదాయం కలిగి ఉన్నారు. వారు పళసిరాజా సైన్యంలో పనిచేసారు. వారి సంతతికి చెందినవారు ఇప్పటికీ విలువిద్యలో నైపుణ్యం కలిగి ఉన్నారు. కురిచ్యాస్ వివిధ్యానైపుణ్యం సమీపకాలంలో వైవిధ్యమైన కేంద్రాలలో ప్రదర్శించబడింది. ఆదివాసీ ప్రజలు హిందూమతాన్ని అనుసరిస్తుంటారు. పూర్వీకుల ఆత్మలకు ఆరాధనా విధానాలు, నివేదనలు ఇప్పటికీ ప్రాముఖ్యతతో కొనసాగుతూ ఉన్నాయి.
వయనాడు జిల్లా వృక్షజాలం పశ్చిమకనుమల వృక్షజాలంతో అనుబంధితమై శీతాకాల వాతావరణానికి అనుకూలమైన తోటపంటల పెంపకానికి సహకరిస్తూ ఉంటుంది.జిల్లా అధికమైన భూభాగంలో కాఫీ తోటలు ఉంటాయి. ఇక్కడ ఎర్రచందనం,అంజిలి (ఆర్టోకార్పస్), ముల్లుమురిక్కు (ఎర్త్రిన), పలు జాతుల కౌసియా, గుర్తించబడని పలుజాతుల మొక్కలు ఇప్పటికీ కాఫీ తోటలకు నీడ ఇవ్వడానికి సంరక్షించబడుతూ ఉన్నాయి. వయనాడు భూభాగానికి చెట్లు వన్యసౌందర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
ప్రధానంగా కాఫీతోటలు అధికంగా ఉన్నాయి. వయసైన చెట్ల స్థానంలో సరికొత్త సిల్వర్ - ఓక్ చెట్లు నాటబడుతున్నాయి.ఇవి శీఘ్రగతిలో పెరిగి కాఫీమొక్కలకు నీడను ఇస్తాయి. వీటిని ప్లేవుడ్ తయారీలో ఉపయోగిస్తారు కనుక ఇవి వ్యవసాయదారులకు అదనపు ఆదాయం అందిస్తున్నాయి.యూకలిప్టస్ గ్రాండ్స్, వాయువులు పరిసర ప్రాంతాలను సుగంధభరితం చేస్తున్నాయి. యూకలిప్టస్ పెద్ద ఎత్తున పండించబడుతుంది. వీటి ఆకుల నుండి తయారుచేయబడే తైలం వాణిజ్యపరంగా ఆదాయం ఇస్తుంది.
20,864 చ.హె. వైశాల్యంలో టేకు తోటలు సరంక్షించబడుతున్నాయి. పోక చెట్లు, పనస చెట్లు పెంచబడుతున్నాయి. టీ తోటలు ఎస్టేటుల స్త్యాయిలో నిర్వహించబడుతున్నాయి. వయనాడు వాతావరణం హార్టీకల్చర్కు అనుకూలంగా ఉంటుంది. కూరగాయల పెంపకం ప్రోత్సహించడం ద్వారా కేరళ అగ్రికల్చరల్ యూనివర్శిటీ అంబలవయల్ వద్ద " రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ " నిర్వహిస్తుంది.
జిల్లాలోని అరణ్యప్రాంతంలో బానెట్ మకాక్యూ, స్లెండర్ ఐరిస్, మాన్గూస్, అడవి పిల్లి, ఉడుతలు, జాకల్స్, హేర్స్ మొదలైన జతువులు ఉన్నాయి.జిల్లాలో ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన విషం కలిగిన రాజనాగం వంటి సర్పాలు కనుగొనబడ్డాయి. పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రంలో ఉన్న అభయారణ్యం నుండి ఏనుగు, ఎలుగుబంటు, ఇతర వన్యజంతువులు వచ్చిపోతూ ఉంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.