Remove ads
భారతదేశం లోని కేరళ రాష్ట్రానికి చెందిన పట్టణం. From Wikipedia, the free encyclopedia
కన్నూర్, ఇది గతంలో అందరికీ తెలిసిన ఆంగ్లభాషలో కాన్ననోర్ ప్రాంతం, పోర్చుగీసు భాషలో కాన్ననోర్ నగరంగా ఉచ్చరిస్తారు. ఇదొక నగరపాలక సంస్థ. భారతదేశం లోని కేరళ రాష్ట్రానికి చెందిన ఉత్తర మలబార్ తీర ప్రాంతం లోది. ఇది కన్నూర్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయ స్థానం. దీని విస్తీర్ణం 518 కిలోమీటర్లు (322 మై.) ఉంది.ఇది రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి ఉత్తరాన 137 కిలోమీటర్లు (85 మై.) దూరంలో ఉంది. ప్రధాన ఓడరేవు నగరానికి దక్షిణాన ఉంటుంది. ఇక్కడ ఉన్నదే మంగుళూరు వాణిజ్య కేంద్రం. భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో, కన్నూర్, మలబార్ జిల్లాలో (మద్రాస్ ప్రెసిడెన్సీ)లో ఒక భాగంగా ఉన్నప్పుడు, ఈ నగరాన్ని కాన్ననోర్ అని పిలిచేవారు. కన్నూర్ అనేది ఉత్తర మలబార్ ప్రాంతంలోని పెద్ద నగరం. కేరళలో 6 వ పెద్ద పట్టణ సముదాయం. 2011 జనాభా లెక్కల ప్రకారం కన్నూర్ కార్పొరేషన్ జనాభా 2,32,486. దీనికి ముందు, కన్నూర్ బ్రిటిష్ పాలనలో మద్రాస్ రాష్ట్రంలోని చిరక్కల్ తాలూకాలో ఉండేది ప్రపంచంలోని ఈ భాగంలో బ్రిటిష్ వారు ఆధిపత్యం చలాయించినప్పుడు - వారు మద్రాస్, కొచ్చిన్లను తమ ప్రధాన స్టేషన్లుగా ఎంచుకున్నారు. కన్నూర్ క్రమంగా పాత కీర్తిని కోల్పోవడం ప్రారంభమైంది. కన్నూర్ ప్రజలు తమ నగరం తిరిగి గత కీర్తి పొందాలని ఎదురు చూసారు. అసలు నగరమైన కన్నూర్‌లో కొంత భాగం కేరళలో అరక్కల్ అని పిలుస్తుండే ఏకైక ముస్లిం రాయల్టీ కింద ఉంది. ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ నగరం అనే పిలుస్తుంటారు.[1]
కన్నూర్ | |
---|---|
Nickname(s): మగ్గాలు, లోర్ల భూమి | |
Coordinates: 11.8689°N 75.3555°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | కన్నూరు |
ప్రాంతం | ఉత్తర మలబారు |
తాలూకా | కన్నూరు తాలబకా |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | కన్నూర్ నగరపాలక సంస్థ |
• మేయర్ | టి.ఒ. మోహనన్, (ఐ.ఎన్.సి) |
• జిల్లా కలెక్టరు | టి.వి. సుభాష్ ఐఎఎస్ |
విస్తీర్ణం | |
• నగరం | 78.35 కి.మీ2 (30.25 చ. మై) |
• Metro | 1,003 కి.మీ2 (387 చ. మై) |
• Rank | 5 |
Elevation | 1.02 మీ (3.35 అ.) |
జనాభా (2011) | |
• నగరం | 2,32,486 |
• Rank | 6 |
• జనసాంద్రత | 3,000/కి.మీ2 (7,700/చ. మై.) |
• Metro | 16,40,986 |
Demonym | Kannurkari (Female) Kannurkar (Plural) |
Time zone | UTC+05:30 (ఐ.ఎస్.టి) |
పిన్‌కోడ్ | 670001 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 0497 |
ISO 3166 code | భారతదేశం|IN-కెఎల్ |
Vehicle registration | కెఎల్-13 |
లింగ నిష్పత్తి | పు.1000:స్త్రీ.1090 |
అక్షరాస్యత | 96.23% |
Website | , |
కన్నూర్ అనేది 12వ శతాబ్ది వాణిజ్య స్థావరం. పర్షియా, అరేబియాలతో చురుకైన వ్యాపార సంబంధాలు ఉండేవి.అది బ్రిటిష్ సైనిక ప్రధాన స్థావరంగా ఉంటుండేది. ఇది 1887 వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఉన్నదే పట్టణం. జిల్లా, పరిసర ప్రాంతాలను చాలా వరకు కొలతిరి రాజులు పరిపాలించారు. కేరళ రాష్ట్రం రూపొందిన తర్వాత, జిల్లాకు పేరు కన్నూర్ అయింది.పాలనా కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి.
సెయింట్ ఏంజెలో కోటను 1505లో భారతదేశపు మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ డోమ్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా నిర్మించాడు.1663లో డచ్ వారు పోర్చుగీసుల నుంచి కోటను స్వాధీనం చేసుకున్నారు. వారు కోటను ఆధునికీకరించారు. ప్రస్తుత నిర్మాణ ప్రధాన లక్షణాలైన హాలండియా, జీలాండియా, ఫ్రైస్లాండియా బురుజులను నిర్మించారు. ఈ కోట పెయింటింగ్, దాని వెనుక ఉన్న ఫిషింగ్ ఫెర్రీని చిత్రాల్లో చూడవచ్చు. డచ్ వారు 1772 లో అరక్కల్ రాజు అలీ రాజాకు ఈ కోటను అమ్మారు. 17 వ శతాబ్దంలో, కన్నూర్ అనేది కేరళలోని ఏకైక ముస్లిం సుల్తానేట్ రాజధాని నగరం. దీనిని అరక్కల్ అని పిలుస్తారు. [2] 1790 లో బ్రిటిష్ వారు దీనిని స్వాధీనం చేసుకున్నారు. మలబార్ తీరంలో వారి ప్రధాన సైనిక కేంద్రాలలో ఒకటిగా ఉపయోగించారు. బ్రిటిష్ రాజ్ కాలంలో, కన్నూర్ ఉత్తర మలబార్ జిల్లాలోని మద్రాస్ ప్రావిన్స్‌లో ఒక భాగం.
కొట్టాయం ప్రాంత పాలకుడు పజస్సీ రాజా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన గెరిల్లా యుద్ధం కన్నూర్ చరిత్రపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 20 వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో కేరళలో సామాజిక-ఆర్థిక,రాజకీయ రంగాలలో భారీ మార్పులు వచ్చాయి.కమ్యూనిస్ట్ పార్టీ వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను అవి సృష్టించాయి.
ఆ స్థితులు ఇవి:
ఆ కార్యకలాపాలు, పోరాటాలు మొదలైనవి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు చూపాయి. కేరళ సమాజంలో మార్పులను వేగవంతం చేయడానికి సహాయపడే కారకాలుగా అవి మారాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాద వలస పాలన నుంచి విముక్తి కోసం ప్రయత్నాలు విస్తృతంగా సాగాయి.ఈ ఉద్యమాలు, వాటితో ప్రారంభమైన పోరాటాలు ప్రజలతోనే కలిసి పెరిగాయి.
అతి త్వరలో- సోషలిజం, సోవియట్ విప్లవం గురించి పలు ఆలోచనలు కేరళకు చేరుకున్నాయి. ఇటువంటివి అన్నీ స్వదేశభిమణి రామకృష్ణ పిళ్ళై, సహోదరన్ అయ్యప్పన్, పి. కేశవదేవ్, ఇతరుల రచనల ద్వారా కేరళలో ప్రచారం అయ్యాయి. 1930 లలోని ప్రారంభంలో, తర్వాత మరికొన్ని ఉపయోగకరమైన పరిణామాలు సంభవిస్తూ వచ్చాయి. వాటిలో ముఖ్యమైంది ట్రావెన్స్ కోర్ లోని వార్థనా ఆందోళన. అంటరానితనానికి గురైన వారు, బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వం లో పాల్గొనడానికి వీలుండేది కాదు. అంతవరకు అణచివేతకు గురైన ప్రజల డిమాండ్ అది. అదే ప్రభుత్వంలో దామాషా ప్రాతినిధ్యం, ఉద్యోగాల రిజర్వేషన్ వంటి పోరాటాలను తెరపైకి తెచ్చింది. ఇది అణగారిన ప్రజలలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. [3]
కన్నూర్, అందులోనూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను [4] వామపక్ష పార్టీల గళంగా సూచిస్తారు. స్థానికంగా దీనిని సహజంగా 'పార్టీ గ్రామం ' అని పిలుస్తూ ఉంటారు.గ్రామం అంటే... ముఖ్యంగా మలయాళంలో సాధారణంగా ఒక పార్టీకి మాత్రమే స్థానిక విధేయతను సూచిస్తుంది. నిజానికి కన్నూర్ ప్రాంతం దృఢమైన కార్మిక సంఘాలతో పాటు వామపక్ష సంస్థల బలమైన ఉనికిని కూడా కలిగి ఉంటున్నది. [5]
2011 భారత జనాభా లెక్కల [6] ప్రకారం కన్నూర్ నగరంలోనైతే ఉన్న జనాభా 56,823 మంది.జనసంఖ్యలో పురుషులు 46.2%, స్త్రీలు 53.8%. కన్నూర్ సగటు అక్షరాస్యత 96.23%, ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 98%, స్త్రీ అక్షరాస్యత 94%. కన్నూర్ లోని జనాభాలో 12% ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
నగర మొత్తం జనాభాలో హిందువులు మొత్తం 32,026 మంది. అంటే 56.3% ఉన్నారు. [6] దాదాపు 37.9% మంది అంటే 21,557 మంది ముస్లింలు. 2,892 మంది క్రైస్తవులు. జనాభాలో వీరు 5% ఉన్నారు. కన్నూర్‌లోని ఆంగ్లో-ఇండియన్ సమాజం ప్రధానంగా కన్నూర్ కంటోన్మెంట్ ఆఫ్ బర్నాచెరీ, దాని పరిసర ప్రాంతాలైన తిల్లెరి, నెంబర్ .3 బజార్, క్యాంప్ బజారు ప్రాంతంలో నివసిస్తుంది. ఇక్కడ మలయాళం పరిపాలనా, స్థానిక సంబంధమైన భాష.
కన్నూర్‌లో- మంగుళూరు, బెంగళూరు, మైసూర్, కొడగు, కొచ్చిన్లను అనుసంధానించే సరైన రోడ్ నెట్వర్క్ ఉంది. ఇక్కడి రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించి ఉంటుంది. నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం గతంలోనే తన కార్యకలాపాలు ప్రారంభించింది ఇది రాష్ట్రంలోని నాలుగో అంతర్జాతీయ విమానాశ్రయం. సమీపంలో ఇతర విమానాశ్రయాలు- కాలికట్, మైసూర్, మంగుళూరుల్లో ఉన్నాయి. కన్నూర్, కోజికోడ్, మంగుళూరు మధ్య జాతీయ రహదారి 66 లేదా NH 66 (గతంలో జాతీయ రహదారి 17) లో ఉంది. ఈ రహదారిని ఇకముందు నాలుగు లేన్లకు విస్తరించనున్నారు. ఎన్‌హెచ్ వెడల్పు ప్రాజెక్టుకు సంబంధించి, కన్నూర్ నగరానికి బైపాస్ ను ఇప్పటికే ప్రతిపాదించారు. కన్నూర్- కూర్గ్ - మైసూర్ రహదారి ద్వారా కన్నూర్... కర్ణాటకలోని కొడగు, మైసూర్, బెంగళూరులకు అనుసంధానించి ఉంది. ఈ రహదారిని 2017 లో జాతీయ రహదారిగా పెంపుదల (అప్‌గ్రేడ్) చేశారు
కన్నూర్ రైల్వే స్టేషన్ అనేది పాలక్కాడ్ పరిధిలో దక్షిణ రైల్వే జోన్‌కు చెందిన ప్రధాన స్టేషన్లలో ఒకటి. తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్,కొచువేలి గరీబ్ రధ్ సహా అన్ని రైలు బండ్లు కన్నూర్ వద్ద ఆగుతాయి. ఆరు రోజువారీ రైళ్లు, 15 వారపు లేదా రెండు వారాల రైళ్లు కన్నూర్‌ను రాజధాని తిరువనంతపురానికి కలుపుతాయి. కన్నూరు- మంగళూరు, కోజికోడ్ లతో రైలు ద్వారా పూర్తిగా అనుసంధానించి ఉంది. [8] [9] కన్నూర్ సౌత్ రైల్వే స్టేషన్, ఎడక్కాడ్ రైల్వే స్టేషన్లు కన్నూర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. చిరక్కల్ రైల్వే స్టేషన్ నగరానికి ఉత్తరాన ఉంది. ఈ మూడు స్టేషన్ల ప్లాట్ ఫారాలపైనా ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.
మత్తానూర్ లోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం 2018 డిసెంబరు 9 న ప్రారంభమైంది. ఇది కేరళలోని నాలుగో అంతర్జాతీయ విమానాశ్రయం. ఇందులో ఉన్న 4,000 మీటర్లు (13,000 అ.) రన్‌వే [10] రాష్ట్రంలో అతి పొడవైంది. అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇది రహదారుల సమగ్ర నెట్వర్క్ ద్వారా విస్తృతంగా అనుసంధానించి ఉంది. రైల్వే లైన్ కోసం ఒక ప్రతిపాదన కూడా రూపొందించి ఉంది. 2016–17 కేంద్ర రైల్వే బడ్జెట్లో, రూ. 400 కోట్లు అదనపు బడ్జెట్ రిసోర్స్ (ఈబీ ఆర్) కింద అంకితమై ఉన్నాయి. దీనిలో బిల్లు కొంత భాగాన్ని రైల్వే లైన్ వైపు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
కన్నూర్‌లో అనేక స్థానిక కేబుల్ టెలివిజన్ ఛానెల్స్ అందుబాటులో ఉంటు న్నాయి. అవి: సిటీ ఛానెల్, సిటీ గోల్డ్, సిటీ జూక్, నెట్వర్క్ ఛానెల్స్, జీల్ నెట్వర్క్, కన్నూర్ విజన్, వరల్డ్ విజన్, వరల్డ్ విజన్ మ్యూజిక్, చకరక్కల్, గ్రామికా ఛానెల్ కూతుపరంబా, కన్నూరోన్
ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) కార్యక్రమాలు 101.5 ఎంహెచ్ జడ్ వద్ద కన్నూర్‌లో ప్రసారం అవుతాయి. వీటిల్లో కన్నూర్ లోని ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు ఉన్నాయి.
పలు వార్తాపత్రికలు కన్నూర్ నుంచి ప్రచురితమవుతాయి. మలయాళ మనోరమ, మాతృభూమి, మాధ్యమం, దేశాభిమాని, దీపికా, రాష్ట్ర దీపికా, చంద్రికా, కేరళ కౌముది, , మంగళం, జన్మభూమి, వీక్షణం, తేజాస్, సిరాజ్, సుప్రభాతం, జన యుగం, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్.
కన్నూర్ అనేది సముద్ర తీరం వెంబడి 1.02 మీటర్లు లేదా 3.3 అడుగులు ఎత్తులో ఉంది, ఇదంతా ఇసుక తీర ప్రాంతం. నగరంలో 8 కిలోమీటర్లు (5.0 మై.) దీర్ఘ సముద్ర తీరం ఉంటుంది.దాదాపు 3 కిలోమీటర్లు (1.9 మై.) వద్ద బీచ్ -పొడవైంది ఉంది. అది పయ్యంబళం ప్రాంతంలోది. కన్నూర్ పరిసరాల్లో రేఖా రుతుపవన శీతోష్ణస్థితి ఉంటుంది. ( కొప్పెన్ వాతావరణ వర్గీకరణ . పరిధిలో ). ఇక్కడ ఏప్రిల్, మే నెలల్లో, సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత 35 సెంటీ గ్రేడ్ ఉంటుంది.మరో వైపు డిసెంబరు, జనవరిలో ఉష్ణోగ్రతలు మితంగా ఉంటాయి: అవి సుమారు 24 సెంటీ గ్రేడ్. మలబార్ తీరంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, ఈ నగరానికి నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. వార్షిక సగటు వర్షపాతం 3,438 మిల్లీ మీటర్లు. వీటిలో 68 శాతం సహజంగా వేసవిలో అందుతుంది. [11]
కన్నూర్ ప్రాంతం మంగళూరుకు దక్షిణాన ఉంది. కోజికోడ్ (భారత దేశంలోని కాలికట్) , పశ్చిమ కనుమల కూర్గ్, వయనాడ్ ప్రాంతపు మనంతవడి తాలూకాకు పశ్చిమాన ఇది కనిపిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.