ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]

త్వరిత వాస్తవాలు ముందు, వ్యక్తిగత వివరాలు ...
వంటేరు ప్రతాప్ రెడ్డి
Thumb


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 నవంబర్ 2019 - 6 నవంబర్ 2021
ముందు బండ నరేందర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1966
బూరుగుపల్లిగ్రామం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ & తెలుగుదేశం పార్టీ
నివాసం గజ్వేల్ & హైదరాబాద్
మూసివేయి

జననం, విద్యాభాస్యం

ఒంటేరు ప్రతాప్ రెడ్డి 1966లో తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా , గజ్వేల్ మండలం , బూరుగుపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన అహ్మదీపూర్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

వంటేరు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సిద్ధిపేట జిల్లా టిడిపి అధ్యక్ష్యుడిగా, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన గజ్వేల్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి చేతిలో 7175 ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతిలో 19391 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.

వంటేరు ప్రతాప్ రెడ్డి 11 ఏప్రిల్ 2018న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ లో రాహుల్ గాంధీ సమక్షంలో 25 మే 2018న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతిలో 58290 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[2] ప్రతాప్ రెడ్డి 18 జనవరి 2019న కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్ష్యుడు కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3][4]వంటేరు ప్రతాప్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్‌గా నియమిస్తూ 24 అక్టోబర్ 2019న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5] ఆయన 7 నవంబర్ 2019న చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[6] ఆయన పదవి కాలాన్ని రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 19 డిసెంబర్ 2021న ఉత్తర్వులు జారీ చేసింది.[7]

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.