తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపద పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థ. మెరుగైన పద్ధతుల్లో సాగుచేసిన అటవీ ఉత్పత్తుల నుండి వచ్చిన ఆదాయంతో అడవుల సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంటుంది.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ | |
---|---|
సంస్థ అవలోకనం | |
స్థాపనం | 2015, మే 14 |
అధికార పరిధి | తెలంగాణ, భారతదేశం |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
Minister responsible | కొండా సురేఖ |
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ | పోదెం వీరయ్య, చైర్మన్ |
మాతృ శాఖ | అటవీ శాఖ |
వెబ్సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
అటవీ ఉత్పత్తుల దేశీయ, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికీ, క్షీణించిన అటవీ ప్రాంతాలను ఉత్పాదక వినియోగంలోకి తీసుకురావడానికి మానవ నిర్మిత అడవులను పెంచడం కోసం కంపెనీల చట్టం 2013, భారతదేశ ఆదాయపు పన్ను 1961 కింద 2015, మే 14న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.[1]
అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఈ సంస్థకు 2023 ఫిబ్రవరిలో జర్మనీ ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు (ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు (కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలప) ఐదేళ్ళపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్డీసీకి కౌన్సిల్ అనుమతినిచ్చింది. దీనిద్వారా అంతర్జాతీయంగా ఎఫ్డీసీ బ్రాండ్ ఇమేజ్ పెరుగడంతోపాటు అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు జర్మన్ కౌన్సిల్ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కింది.[2]
వంటేరు ప్రతాప్‌రెడ్డి: 2019 అక్టోబరు 24న ప్రతాప్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3] 2019 నవంబరు 7న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు.[4] 2021 డిసెంబరు 19న ఆయన పదవి కాలాన్ని రెండేళ్ళు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]
Seamless Wikipedia browsing. On steroids.