తూంకుంట నర్సారెడ్డి

From Wikipedia, the free encyclopedia

తూంకుంట నర్సారెడ్డి

తూంకుంట నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
తూంకుంట నర్సారెడ్డి
Thumb


రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
పదవీ కాలం
2017 నవంబర్ 6 - 2018

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు జె. గీతారెడ్డి]
తరువాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు
నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963
గజ్వేల్, సిద్దిపేట జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు (2014 - 2018) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
తల్లిదండ్రులు వెంకట్ రెడ్డి
మూసివేయి

రాజకీయ జీవితం

తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. నర్సారెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి 2014 మే 20న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[1]

తూంకుంట నర్సారెడ్డి 2017 మే 29న తెలంగాణ రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3] ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని తెలియడంతో 2018 అక్టోబర్ 20న సస్పెన్షన్ చేశారు.[4][5] ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి[6] ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[7]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.