Remove ads
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] దేశంలో అత్యల్పజనసాంధ్త్రత కలిగిన జిల్లాలలో ఇది 10వ స్థానంలో ఉంది.[3]
దిగువ దిబాంగ్ లోయ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | రోయింగ్ |
జనాభా (2011) | |
• మొత్తం | 53,986[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.4%[1] |
• లింగ నిష్పత్తి | 919[1] |
1980లో లోహిత్ జిల్లా లోని కొంతభూభాగం వేరుచేసిన నేపథ్యంలో దిబాంగ్ లోయ జిల్లా కొత్తగా రూపొందింది.[4]2001 డిసెంబరు 16న దీబాంగ్ లోయ జిల్లా, దిగువ దిబాంగ్ లోయ జిల్లాగా విభజించబడింది.[4]
దిగువ దిబాంగ్ లోయ జిల్లా కేంద్రంగా రోయింగ్. 2001 డిసెంబరున ఈ జిల్లా రూపొందించక ముందు అనిని జిల్లా కేంద్రంగా ఉందెది.[5]
దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో 2 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి రెండు అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గం భాగంగా ఉన్నాయి.[6]
2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో మొత్తం జనాభా 54,080. వీరిలో 28,053 మంది పురుషులుకాగా, 26,027 మంది స్త్రీలు ఉన్నారు.[7] జిల్లాలో మొత్తం 11,600 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 928.
జిల్లాలోని మొత్తం జనాభాలో 21.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 78.9% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 88.4% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 63.6%. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 878 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 941గా ఉంది. జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8009, ఇది మొత్తం జనాభాలో 15%. 0-6 సంవత్సరాల మధ్య 4112 మంది మగ పిల్లలు ఉండగా, 3897 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 948, ఇది దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (928) కంటే ఎక్కువ. జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 69.13%. దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 64.47% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 52.88% ఉంది.
దిగువ దిబాంగ్ లోయ జిల్లా ఇడు మిష్మి, ఆది, సినో-టిబెటన్ (అంతరించిపోతున్న భాధలలో ఒకటి) భాషలు వాడికలో ఉన్నాయి.[8]
దిగువ దిబాంగ్ జిల్లా వన్యమృగాలతో సుసంపన్నమై ఉంది. ఈ అరణ్యాలలో మిష్మి టాకిన్, రెడ్ గోరల్, ఏనుగులు, అడవి నీటి దున్న, మౌంట్జాక్ వంటి వన్యమృగాలు ఉన్నాయి. స్క్లటర్ మోనల్, బ్లిత్స్ ట్రాగోపన్, రుఫోర్స్ - నెక్డ్ హార్న్‌బిల్, బెంగాల్ ఫ్లోరికన్, వైట్ - వింగ్డ్ వుడ్ డక్ వంటి పక్షులు ఉన్నాయి.[9] సైన్సు ప్రపంచానికి సరికొత్త ప్రాణి అయిన మిష్మి హిల్స్ జైంట్ ఎగిరే ఉడుత " పెటౌరిస్టా మిష్మింసిస్ " ఈ ప్రాంతంలో కనిపిస్తుంది.[10] 1980లో దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో 282 చ.కి.మీ వైశాల్యంలో " మెహయో విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటుచేయబడింది.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.