Remove ads
From Wikipedia, the free encyclopedia
లియొనార్డో డా విన్సీ (ఆంగ్లం: Leonardo Da Vinci) (ఏప్రిల్ 15, 1452 – మే 2, 1519) ఇటలీకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.[2] ఇతను శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్టు, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత.[3] రినైజెన్స్ శైలిలో ఇతడు చిత్రీకరించిన మోనా లీసా, ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డా విన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చాయి.[4] ప్రత్యేకించి మోనా లీసా చిత్రపటం చిత్రకళకు సంబంధించిన అంశాల వలన, దాని చరిత్ర వలన సంచలనాత్మకం అయ్యి, డా విన్సీ పేరుప్రతిష్టలు నేలనాలుగు చెరుగులా వ్యాపింపజేసాయి. డా విన్సీ నోటుపుస్తకాలలో వేసిన స్కెచ్ లు, శాస్త్రీయ శోధన, యంత్ర నిర్మాణం లో సృజనాత్మకత లకు మచ్చుతునకలుగా మిగిలిపోయాయి. [2]
లియొనార్డో డావిన్సి | |
Self-portrait in red chalk, Royal Library of Turin Circa 1512 to 1515 [1] | |
జన్మ నామం | లియొనార్డో డి సెర్ పీరో |
జననం | విన్సి లేదా వించి, ఫ్లోరెన్స్, ప్రస్తుతం ఇటలీలో వున్నది | 1452 ఏప్రిల్ 15
మరణం | 1519 మే 2 67) అంబోయిసె, ఇండ్రె ఎట్ లోయిరె, ప్రస్తుతం ఫ్రాన్సులో వున్నది | (వయసు
జాతీయత | ఇటాలియన్ |
రంగం | కళలు శాస్త్రాలు కు చెందిన అనేక రంగాలు |
ఉద్యమం | హై రెనసాన్స్ |
కృతులు | మొనాలిసా, ద లాస్ట్ సప్పర్, ద విట్రూవియన్ మాన్ |
డా విన్సీ అంతెరుగని జ్ఞాన కాంక్షయే అతని ఆలోచనా ధోరణిని, ప్రవర్తనను నడిపించింది. సహజ సిద్ధంగాను, స్వాభావికంగా కూడాను కళాకారుడైన డా విన్సీ తన కళ్ళే తన జ్ఞానార్జన కు దారులు అని భావించాడు. అనుభవం యొక్క సత్యాలను, నిఖార్సుగా, ఖచ్చితంగా నమోదు చేసేది చూపే కాబట్టి, చూపే మనిషి యొక్క ఇంద్రియ శక్తులలో ఉన్నతమైనది అని డా విన్సీ భావన. ఈ భావనకు అత్యుత్తమ మేధస్సు, అసాధారణమైన పరిశీలనాత్మకత (గమనించే శక్తి), ప్రకృతిని అభ్యసించేందుకు తన చేతులతో దాగియున్న అత్యున్నత చిత్రలేఖన పటిమ వంతివి తోడు కావటంతో ఇటు పలు కళలలోను, అటు పలు శాస్త్రాలలోను డా విన్సీ రాణించేలా చేశాయి.[2]
Ser Piero, క్యాటరీనా దంపతుల వివాహ పూర్వమే లియొనార్డో జన్మించాడు. తండ్రి భూకామందు, నోటరీ కాగా, తల్లి వ్యవసాయదారు. లాటిన్, గణితం, రేఖాగణితం వంటి వాటి పై చిన్ననాట డా విన్సీ పెద్ద ఉత్సాహం ఏమీ కనబర్చలేదు. కానీ తన 30వ ఏట మాత్రం వీటిన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయటం గమనార్హం.[2]
తన 15వ ఏట లియొనార్డో కళలపై మొగ్గు చూపాడు. దీనితో తండ్రి అతడికి చిత్రలేఖనం, శిల్పకళ వంటి వాటిలో శిక్షణను ఇప్పించాడు. 1481 నుండి డా విన్సీ చిత్రకారుడిగా గుర్తింపబడ్డాడు. అయితే అప్పటికే అతని పుస్తకాలలో అతని చే చిత్రించబడ్డ పంపులు, రక్షణాయుధాలు, యాంత్రిక ఉపకరణాలు సాంకేతిక అంశాల పట్ల అతని లోని జ్ఞాన పిపాస కు అద్దం పడతాయి.[2]
డావిన్సి తల్లిపేరు రజెష్కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. ఈ కారణంగా డావిన్సి కొంతకాలం పాటు బాబాయి వరస అయ్యే వ్యక్తి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆర్జన మాత్రం యేమీ ఉండేది కాదు.
1482 లో డావిన్సి మిలాన్ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీర్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు,కాలవలు,చర్చిలు,గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495 లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని మొదలుపెట్టి 1497 లో పూర్తి చేశాడు.
1499 లో డావిన్సి వెనిస్ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు.
డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503 లో విశ్వ విఖ్యాతమైన "మొనాలిసా" పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ మోడల్ గర్ల్ వస్తూ పోతూ ఉండేది. ఈ పెయింటింగ్ కు పూర్తి అయ్యాక ఆ చిత్ర్ం లోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సిని సైత కట్టి పడేసింది.ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్. ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది.
"మోనాలిసా"తో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో "ది వర్జిన్ విత్ చైల్డ్", "పెయింట్ ఆన్నె" వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513 లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు (మొదటివాడు) ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు.
ఎగిరే యంత్రాల గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. విమానాల వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను డావిన్సి ఆకాలం లోనే యేర్పాటు చేశాడు. 1519 లో మరణించాడు.
లియొనార్డో డావిన్సి స్మారకంగా ప్రపంచ కళల అసోసియేషన్ డావిన్సి పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం నిర్ణయించింది.[5][6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.