జమ్మూ కాశ్మీరు రాష్ట్ర 20 జిల్లాలలో రయాసీ జిల్లా ఒకటి. ఈ ప్రాంతం పూర్వం 8వ శతాబ్దంలో రాజాభీందేవ్ స్థాపించిన భీంగర్ రాజ్యంలోని సంస్థానంగా ఉంటూ ఉండేది. 1822లో సిఖ్ రాజ్యం ఆధీనంలో జమ్మూ హిల్ గవర్నర్ గులాబ్ సింఘ్ చిన్న సంస్థానాలను సమైక్యపరిచే వరకూ ఇది స్వతంత్ర సంస్థానంగా ఉండేది. 1948 వరకు రీసి జిల్లా జమ్మూ భూభాగంలో భాగాంగా ఉంది. 1948లో మొదటిసారిగా రీ ఆర్గనైజేషన్ చేపట్టిన తరువాత రీసి భూభాగంలోని అత్యధిక భాగం ఉధంపుర్ జిల్లాలో కలుపబడింది. మరికొంత భూభాగం పూంచ్ జిల్లాలో ( ప్రస్తుత రాజౌరీ జిల్లా) కలుపబడింది.
రియాసీ | |
---|---|
Coordinates (రియాసీ): 33.09°N 74.84°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
విభాగం | జమ్మూ విభాగం |
ప్రధాన కార్యాలయం | రియాసీ |
తహసీల్సు | 1. గూల్-గులాబ్‌గఢ్, 2. రియాసీ, 3. పౌని |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,719 కి.మీ2 (664 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 3,14,667 |
• జనసాంద్రత | 180/కి.మీ2 (470/చ. మై.) |
• Urban | 8.6% |
జనాభా | |
• అక్షరాస్యత | 58.15% |
• లింగ నిష్పత్తి | 890 |
Time zone | UTC+05:30 |
Vehicle registration | JK-20 |
Website | http://reasi.nic.in |
భౌగోళికం
జమ్మూ నుండి 64 కి.మీ దూరంలో ఉన్న రీసి జిల్లా ఉత్తర సరిహద్దులో గూల్-గులాబ్ తెహ్సిల్, పశ్చిమ సరిహద్దులో రాజౌరీ జిల్లాలోని సిందర్‌బని, కలాకోటే, తూర్పు సరిహద్దులోఉధంపుర్ తెహ్సిల్, దక్షిణ సరిహద్దులో జమ్మూ జిల్లాలోని జమ్మూ తెహ్సిల్, అఖ్నూర్ ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి రీసి సబ్ డివిషన్ జనసంఖ్య 1,20,380. వీరిలో 25.57% ముస్లిములు, హిందువులు ఉన్నారు. ఈ డివిషన్ వాతావరణం ఉపశీతోష్ణ మండలానికి చెందినది. మిగిలిన భూభాగంలో టెంరరేట్ భూభాగానికి చెందినది. వేసవి కాలం వెచ్చగా ఉంటుంది, శీతాకాలం చలిగానూ కొన్నిసమయాలలో ఎగువప్రాంతాలలో హిమపాతం ఉంటుంది. వేసవిలో జమ్మూలోని ఇతర జిల్లాలలో కంటే రీసి జిల్లాలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం అదే సమయం శీతాకాలంలో ఇతర జిల్లాలకంటే ఉష్ణోగ్రత అధికంగా ఉండడం ఈ జిల్లా ప్రత్యేకత. అందువలన పర్యాటకులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 314,667, [1][2] |
ఇది దాదాపు. | బహ్మాస్ దేశ జనసంఖ్యకు సమానం. .[3] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 570వ స్థానంలో ఉంది. .[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 184 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.06%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 891:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 59.42%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భీంగర్ ఫోర్ట్
చారిత్రాత్మక నామం కలిగిన భీంగర్ ఫోర్ట్ (సాధారణంగా రీసి ఫోర్టంటారు) రీసి పట్టణంలో ఉంది. 150 మీ ఎత్తైన ఇది కొండశిఖరం మీద ఉంది. ఈ కోట ముందుగా మట్టితో నిర్మించబడిందని తరువాతి కాలంలో ఇది రాళ్ళతో పునర్నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. ఆత్యవసర పరిస్థితిలో రాజకుటింబీకులు ఈ కోటలో నివసించారు. ప్రస్తుతం 1989 నుండి ఈ కోట జె.కె ప్రభుత్వపురాతత్వపరిశోధనాశాఖ ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ఈ కోట పట్టణానికి ముఖ్యచిహ్నాలలో ఒకటిగా నిలిచిఉంది. ఈ కోట నిర్మించిన నాటి నుండి ఇప్పటి వరకు పలు మార్లు దాడి, ప్రకృతిబీభత్సాల కారణంగా విధ్వంసానికి గురైంది. ప్రభుత్వాలు దీనిని తిరిగి పునర్నిర్మించాయి. అందువలన ఈ కోట ఇప్పటికీ నిలబడి రీసి పట్టణానికి మరింత మెరుగుకు తీసుకువస్తూ ఉంది.
చేరుకునే మార్గం
జమ్మూ - ఉధంపుర్ - శ్రీనగర్ జాతీయరహదారి - 1 ఎకు దూరంగా ఉన్నందున ఈ ప్రాంతానికి చేరుకోవడం కష్టతరం అయింది. అఫ్హికంగా ప్రథమయంగా ఉన్న ఈ ప్రాంతం రీసి సమీపంలోని ధ్యాంఘర్ వద్ద " సలాల్ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ " నిర్మించిన తరువాత ఆర్థికంగా అభివృద్ధి మొదలైంది. 1970లో మొదలైన ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చేపట్టింది. 1987 నాటికి ఇది 345 మగావాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుంది. రెండవస్థాయిలో ఈ ప్రాజెక్ట్ 1995 నాటికి 690 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసే స్థాయికి చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ నుండి ఉత్పత్తి ఔతున్న విద్యుత్తు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, చంఢీగడ్ లకు విద్యుత్తు సరఫరా ఔతుంది.
రైల్వే
జమ్మూ కాశ్మీరు రాష్ట్రం మార్గం రీసి మీదుగా నిర్మించబడింది. ఈ రైలు మార్గం కత్రా (జమ్మూ కాశ్మీరు) వరకు నిర్మించబడింది. కత్రా నుండి రైలు మార్గం రీసి- బనిహాల్ మీదిగా సాగే ఈ మార్గంలో రీసి, సలాల్ ఎ, సలాల్ బి, సురుకాట్, బారాల, సంగల్దాన్, కోహి, లావోల్ వద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. చీనాబ్ నది మీద సలాల్ వద్ద 1315 మీటర్ల పొడవు, 383.1 మీ ఎత్తైన వంతెన నిర్మాణదశలో ఉంది. ఈ నిర్మాణం పూర్తి అయితే ఇది ప్రపంచంలో ఎత్తైన వంతెనగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలు మార్గం రీసి అభివృద్ధికి సహకరిస్తుందని భావిస్తున్నారు.
జిల్లా అంతస్థు పొందడంలో సమస్య
ఈ పర్వతప్రాంత ప్రదేశం రీసికి జిల్లా అంతస్తు కోరుతూ పోరాటం చేసింది. ఇతర సిఫారసులతో వాజిర్ కమిషన్ రిపోర్ట్ రిసీ సబ్ డివిషన్‌కు జిల్లా హోదా లభించడానికి సహకరించింది. 2007 వరకూ రీసి జిల్లా హోదాను పొందలేక పోయింది. జనసంఘ్ నాయకుడైన రిషికుమార్ కౌషల్ జిల్లాహోదా కొరకు నిష్ఫల ప్రయత్నం చేసాడు. ప్రజల నిరంతర పోరాటఫలితంగా 2007 నాటికి రీసికి జిల్లాహోదా లభించింది. ప్రస్తుతం ఈ జిల్లా కాశ్మీర్ లోయలో ప్రధాన కేంద్రగా మారింది. వేసవిలో ఈ జిల్లాలో జనసమ్మర్ధం అధికంగా ఉంటుంది. ఈ జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రముఖ హిందూ క్షేత్రాలైన వైష్ణవీదేవి ఆలయం, శివ్‌ఖోరి, ధర్సర్ బాబా, బాబాసియాద్‌లు ఉన్నాయి.
పాలనావిభాగాలు
రీసి జిల్లాలో 2 తెహసిల్స్ ఉన్నాయి: రీస్, గూల్-గులాబ్గర్: వీటిలో వరుసగా 239, 60 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 4 బ్లాకులు ఉన్నాయి : అర్నాలు, మహోర్, రీసి, పౌని.[4] ఒక్కొక తెహ్సిల్‌లో పలు గ్రామాలు ఉన్నాయి.
రాజకీయాలు
రీసి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి: రీసి, గులాబ్గర్, గూల్ అర్నాస్.[5]
పర్యాటక ఆకర్షణలు
- భీంగర్ ఫోర్ట్
- శివ్ఖోరి
- వైష్ణవీ దేవి
- కాళికాలయం
- బాబాధంసర్
- ధ్యాన్గర్
- బాబాబిడ్డ
- సియార్ బాబా
- సులా పార్క్
- దేరా బాబా
జిల్లా సరిహద్దులు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.