From Wikipedia, the free encyclopedia
రామబాణం 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. గోపిచంద్, డింపుల్ హయాతి, జగపతి బాబు, ఖుష్భూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 5న థియేటర్లలో విడుదల చేసి[2], సెప్టెంబర్ 14 నుండి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
రామబాణం | |
---|---|
దర్శకత్వం | శ్రీవాస్ |
రచన | భూపతి రాజా |
నిర్మాత | టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వెట్రి పళనిస్వామి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 3 మే 2023 (థియేటర్) 14 సెప్టెంబరు 2023 (నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రఘుదేవ పురం గ్రామంలో రాజారాం (జగపతి బాబు), అతని భార్య భువనేశ్వరి (ఖుష్బూ) ఆర్గానిక్ హోటల్ నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముడు విక్కీ (గోపీచంద్). చిన్నప్పుడే అన్నయ్యతో గొడవ పెట్టుకుని విక్కీ ఊరు వదిలి పారిపోయి కోల్కతాలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. (డింపుల్ హయతి)ని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో ఆమె తండ్రి (సచిన్ ఖేడ్కర్) కుటుంబం ఉంటేనే భైరవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో 14 సంవత్సరాల తర్వాత విక్కీ తన అన్న దగ్గరకి వస్తాడు. ఈ క్రమంలో బిజినెస్ మాన్ జీకే (తరుణ్ అరోరా) కారణంగా అన్నకి సమస్య ఉందని తెలుస్తుంది. ఈ సమస్యని విక్కీ ఎలా పరిష్కరించాడు? తమ్ముడు డాన్ అని రాజారాంకి తెలిసిందా ? ఆ తరువాత ఏమి జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[6]
1: ఐ ఫోన్ సాంగ్ , రచన: కాసర్ల శ్యామ్ గానం.రామ్ మిరియాల, మోహన భోగరాజు
2: దరువేయరా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కృష్ణ తేజస్వీ, చిత్ర అంబడిపూడి
3: నువ్వే నువ్వే, రచన: శ్రీమణి, గానం.రితేష్ జీ రావు
4: మోనాలిసా మోనాలిసా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.శ్రీకృష్ణ , గీతామాధురి .
Seamless Wikipedia browsing. On steroids.