Remove ads
కర్ణాటకలోని జిల్లా From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో మైసూరు జిల్లా (కన్నడం:ಮೈಸೂರು ಜಿಲ್ಲೆ) ఒకటి. మైసూరు పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి కర్ణాటక రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మైసూర్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో బెంగుళూరు, బెల్గాం జిల్లాలు ఉన్నాయి..[2]
Mysore district
ಮೈಸೂರು ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
డివిజన్ | మైసూరు డివిజన్ |
ప్రధాన కార్యాలయం | Mysore |
Boroughs | Mysore, Tirumakudalu Narasipura, Nanjangud, Heggadadevanakote, Hunsur, Piriyapatna, Krishnarajanagara |
Government | |
• Deputy Commissioner | Shikha C, IAS |
విస్తీర్ణం | |
• Total | 6,854 కి.మీ2 (2,646 చ. మై) |
జనాభా (2001)[1] | |
• Total | 26,41,027 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | KA-09,KA-45,KA-55 |
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఈశాన్య సరిహద్దు | మాండ్య |
ఆగ్నేయ సరిహద్దు | చామరాజనగర్ |
దక్షిణ సరిహద్దు | కేరళ రాష్ట్రం |
పశ్చిమ సరిహద్దు | కొడగు |
ఉత్తర సరిహద్దు | హాసన్ |
మైసూరు జిల్లాలో నాగర్హోల్ నేషనల్ పార్ మొదలైన పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రచరిత్రలో మైసూర్ ప్రధానపాత్ర వహించింది. మైసూరును వుడయార్లు 1399 నుండి 1947 వరకు పాలించారు. కర్ణాటక రాష్ట్రానికి గతంలో మైసూర్ రాజధానిగా ఉండేది. రాజధానిగా ఉన్నప్పుడు మైసూరు ప్రాభవం అధికంగా ఉండేది.
మైసూర్ జిల్లా కేంద్రమైన మైసూర్ పట్టణం పేరు జిల్లా పేరుగా నిర్ణయించబడింది. నగరంలో మహిషాసురుని శిల్పం ఉంది. ఇది మహిషాసురుని ప్రాంతంగా పురాణకథనాలు తెలియజేస్తున్నాయి. నగరంలోని చాముండీ కొండశిఖరం మీద మహిషాసురుని వధించిన మహిషాసుర మర్ధిని ఆలయం ఉంది. ఆలయ ప్రధాన దైవం చాముడీశ్వరిగా పూజలందుకుంటూ ఉంది.
మైసూరు జిల్లాను ఆరంభకాలంలో గంగాలకు చెందిన రాజా అవినిథ (సా.శ. 469-529)పాలించారు. గంగాలకాలంలో రాజధాని కోలార్ నుండి కావేరీ నదీతీరంలో ఉన్న తలకాడ్‌కు మార్చబడింది. తలకాడ్ ప్రస్తుతం తిరుమకూడలు నరసిపురా తాలూకాలో ఉంది.[3] గంగాల పాలన ముగిసే వరకు (11వ శతాబ్ద ఆతంభం వరకు) తలకాడ్ రాజధానిగా ఉంది. మైసూర్ జిల్లా చరిత్రలో గాగాల పాలన గంగావాడి పేరుతో అధికభాగం ఆక్రమించింది. 8 వ శతాబ్దం రాష్ట్రకూటుల దూర్వా ధరవర్ష గంగారాజు రెండవ శివవర్మాను ఓడించి గంగావాడీని తన వశం చేసుకున్నాడు. తరువాత ఈ ప్రాతానికి దూర్వా ధరవర్ష కుమారుడు కంబరాసాను రాజప్రతినిధిగా నియమించారు. అధికారాచ్యుతులైన గంగాలు వేచి చూసి వారి రాజు నీతిమార్గా ఎరెగంగా (853 నుండి 869) నాయకత్వంలో తిరిగి రాష్ట్రకూటుల రాజు రాజారాముని ఓడించి రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తరువాత గంగాల శక్తిమంతులయ్యారు. రాష్ట్రకూట రాజు మొదటి అమోఘవర్ష తన కుమార్తెను రేవకనిమ్మదిని ఎరెగంగ కుమారునికి ఇచ్చి వివాహం చేసాడు. తరువాత రెండవ బుటుగ గంగావాడి పాలకుడయ్యాడు. గంగాలా పాలన ఈ ప్రాంతాన్ని దీర్ఘ కాలం పాలించారు. గంగాల రాజు రక్కస గంగా (985 -1024) ను చోళులు ఓడించారు. .[4] 1117లో హొయశిల రాజా విష్ణువర్ధన గంగావాడీని స్వాధీనం చేసుకున్నాడు. విష్ణువర్ధన విజయానికి సంకేతంగా తలకాడులో కీర్తినారాయణా ఆలయం నిర్మించాడు. .[5] యరువాత గంగావాడి హొయశిలకు చెందిన మూడవ వీర బలలాల మరణం వరకు కొనసాగింది. తరువాత గంగావాడి విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. 1399 వరకు యదురాయ మైసూర్ ప్రాంతంలో వుడయార్ సామ్రాజ్య స్థాపన చేసాడు.[4] 1565 వరకు అది విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజ్యంగా ఉంది. విజయనగర సామ్రాజ్యం బలహీన పడిన సమయంలో రాజా వుడయార్ (1578-1617) ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించాడు. ఆయన వుడయార్ కుటుంబానికి ప్రధాన రాజుగా గుర్తించబడ్డాడు. కెసరే యుద్ధంలో ఆయన విజయమగర ప్రతినిధిని మైసూర్ వద్ద ఓడించాడు. తరువాత 1610లో రాజా వుడయార్ రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు.[6] తరువాత వుడయార్లు (1734-1766) వరకు నిరంతరాయంగా మైసూరు ప్రాంతాన్ని పాలించారు. తరువాత హైదర్ ఆలి, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకులయ్యారు.[4] 1799 లో బ్రిటిష్ సైన్యాలచేతిలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత వుడ్యార్లు తిరిగి మైసూర్ ప్రాంతానికి పాలకులు అయ్యారు. రాజధాని మైసూరుకు మార్చబడింది.[4] వుడయార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి సామతులుగా ఉన్నారు. మూడవ కృష్ణరాయ ఉడయార్ కాలంలో బ్రిటొష్ 1831లో బ్రిటిష్ వుడయార్ల నుండి రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.[7] బ్రిటిష్ ప్రభుత్వం కమీషనర్లను మైసూర్ భూభాగానికి పాలకులుగా నియమించారు. మార్క్ కబ్బన్ (కబ్బన్ తరువాత బెంగుళూరులో అయన ఙాపకార్ధం ఒక రోడ్డుకు కబ్బన్ రోడ్డు అని నామకరణం చేయబడింది), ఎల్.బి. బౌరింగ్ (ఎల్.బి. బౌరింగ్ తరువాత బెంగుళూరులో అయన ఙాపకార్ధం ఆయన పేరుతో బౌరింగ్ హాస్పిటల్ నిర్మించబడింది) బ్రిటిష్ తరఫున కమీషనర్లుగా నియమించబడ్డారు. వుడయార్లు బ్రిటిష్ పార్లమెంటులో మైసూర్ పాలనాధికారం కావాలని అభ్యర్థించారు. 1881లో మూడవ కృష్ణరాజ వుడయార్ కుమారుడు చామరాజ వుడయార్ (6వ వుడయార్ ) కు తిరిగి మైసూరు అధికారం ఇవ్వబడింది.[7] తరువాత వుడయార్లు మసూరు పాలనాధికారం చేజిక్కించుకున్నారు. తరువాత జయచామరాజ వుడయార్ 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వానికి సామంతులుగా పాలించారు. తరువాత మైసూరు భారత యూనియన్‌లో విలీనం చేయబడింది. భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించే వరకు వుడయార్లు మైసూర్ మహారాజాగా ఉన్నారు. తరువాత వుడయార్లు రాజప్రముఖులుగా ఉన్నారు. 1956 రాష్ట్ర విభజన సమయంలో మైసూర్ రాష్ట్రంగా అవతరించింది. తరువాత జయచంద్ర వుడయార్ 1964 వరకు మైసూర్ గవర్నరుగా నియమించబడ్డాడు.
మైసూరు జిల్లా 11°45' నుండి 12°40' ఉత్తర అక్షాంశం, 75°57' నుండి 77°15' రేఖాంశంలో ఉంది. [
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | మాండ్య |
ఆగ్నేయ సరిహద్దు | చామరాజనగర్ |
దక్షిణ సరిహద్దు | కేరళ |
పశ్చిమ సరిహద్దు | కొడగు |
ఉత్తర సరిహద్దు | హాసన్ |
జిల్లావైశాల్యం 6,854. జసంఖ్యాపరంగా జిల్లా 12వ స్థానంలో ఉంది. మైసూర్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా మైసూర్ డివిషన్లో భాగంగా ఉంది.చామరాజనగర్ జిల్లా విభజించక ముందు మైసూర్ జిల్లాలో భాగంగా ఉంది.
జిల్లా దక్షిణ పీఠభూమిలోని అసమానమైన భూభాగంలో ఉంది. జిల్లాలో కావేరీ నది (ఈశాన్య, తూర్పు భూభాగంలో ప్రవహిస్తుంది) వాటర్ షెడ్ ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో కావేరీ నది మీద కృష్ణరాజ సాగర రిజర్వాయర్ నిర్మించబడి ఉంది. జిల్లాలో ఉన్న " నాగర్‌హోలె నేషనల్ పార్క్ " లోని కొంత భాగం పొరుగున ఉన్న కొడగు జిల్లా ఉంది.
విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వాతావరణ విధానం | |
వేసవి | |
వర్షాకాలం | |
శీతాకాలం | |
గరిష్ఠ ఉష్ణోగ్రత | 35 ° సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | 15 ° సెల్షియస్ |
వర్షపాతం | 785మి.మీ [8] |
జిల్లాలో ప్రధానంగా ఎర్రమట్టి (ఎరుపు గులక లోవామ్ మట్టి, ఎరుపు లోవామ్ మట్టి, ఎరుపు గులక మట్టి, ఎర్ర బంకమట్టి నేల) అధికంగా ఉంది. [9] జిల్లాలో కియానైట్, సిలిమనైట్, మాంగనీస్, సోప్స్టోన్, ఫెల్సైట్, కొరండం, గ్రాఫైట్, లైంస్టోన్, డోలోమైట్, సిలికోనైట్, డ్యూనైట్ మొదలైన ఖనిజాలు ఉన్నాయి.[10]
భారతదేశంలోని మిగిలిన జిల్లాలలో లాగా జిల్లా ఆర్థికరంగానికి వ్యవసాయం వెన్నెముకగా ఉంది. జిల్లాలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితంగా ఉంది. కావేరీ నది, కబిని నదులు వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తున్నాయి. 2001 గణాంకాల ఆధారంగా జిల్లాలో 3,25,823 మంది రైతులు ఉన్నారని భావిస్తున్నారు. 2001-2002 లో మైసూర్ జిల్లా జిల్లాలో 608,596 టన్నుల ఆహారధాన్యం ఉత్పత్తి చేయబడుతుంది. రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడుతున్న మొత్తం ఆహారధాన్యాంలో ఇది 6.94%.[11] జిల్లాలో ప్రధానంగా చనగలు, బఠాణీ, జొన్నలు, మొక్కజొన్నలు, రాగి, వరి, చెరకు, పొద్దుతిరుగుడు, కందిపప్పు.[12] హెచ్.డి కోట్ తాలూకాలో పాం ఆయిల్ ఉత్పత్తి చేయబడితుంది.[13]
మైసూర్ జిల్లాలో ప్రధానంగా పరిశ్రమలు నంజన్గూడ్ వద్ద కేంద్రీకరించబడ్డాయి. కర్ణాటక పారిశ్రామిక ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు (కె.ఐ.ఎ.బి) మైసూర్, నంజన్గూడ్ వద్ద రెండు పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, వీటిలో ఆరు పారిశ్రామిక ప్రాంతాలను మైసూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన కేంద్రాలను బెలగోలా, బెలవాడి, హెబ్బల్, (ఎలెక్ట్రానిక్ నగరం), హూతగల్లి వద్ద ఏర్పాటు చేసింది. నంజన్‌గూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన కేంద్రాలను తాండవపురా, నంజన్‌గూడ వద్ద ఏర్పాటు చేయబడ్డాయి. [14]1960లో మైసూర్ పారిశ్రామికంగా వెనుకబన ఉన్నసమయంలో మైసూర్ మహారాజ భాగస్వామ్యంలో మొదటిసారిగా ప్రధాన పరిశ్రమలు స్థాపించబడ్డాయి.ఐడియల్ జావా (ప్రస్తుతం మూతబడి ఉంది), జావా మోటర్ల సాంకేతిక పరిఙానంతో ఇండియా లిమిటెడ్ మోటార్ సైకిల్ స్థాపించబడ్డాయి.
ఉన్న ముఖ్య పరిశ్రమలలో కొన్ని నంజన్గూడ్ ఉన్నాయి:
మైసూర్ కర్ణాటక రెండవ ఐ.టి కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఐ.టి రంగంలో అభివృద్ధి చెందిన 20 నగరాలలో మైసూరు ఒకటి అని గవర్నమెంటాఫ్ ఇండియా గుర్తించింది. [15] ప్రస్తుతం ఐ.టి సంస్థలన్ని మైసూర్ నగర పరిశరాలలో స్థాపించబడి ఉన్నాయి. మసూరులోని ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్.టి.పి)ను 1998 లో భారతప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ ద్వారా ఆరంభించబడింది. 2006 ఆగస్టు మాసంలో (ఎస్.టి.పి) లో 42 సంస్థలు నమోదు చేయబడ్డాయి. (ఎస్.టి.పి) కి చెందిన 42 ఐ.టి స్థల నుండి 2006-2007 ఆర్థిక సంవత్సరంలో మైసూర్ సఫ్ట్ వేర్ ఉత్పత్తులు 850 కోట్లకు చేరాయి. .[15]
మైసూర్లో స్థాపించబడిన ఐ.టి.సంస్థలు
మైసూర్ జిల్లా ఆర్థికరంగానికి పర్యాటకం విస్తృతంగా సహకారం అందిస్తుంది. పర్యటకపరంగా మఒసూరుకు ఉన్న ప్రాధాన్యతకు కర్ణాటక టూరిస్ట్ ఎక్స్పో 2006 ఏత్పాటు చేయడమే సాక్షి. [16] జిల్లాలో పర్యాటక పరంగా మైసూర్ నగరం ప్రాధాన్యత వహించినప్పటికీ జిల్లాలోని ఇతర ప్రాంతాలు కూడా క్రమంగా పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.[17]
మైసూర్ జిల్లా మూడు ఉపవిభాగాలు విభజించబడింది, గూడ్, మైసూర్, హన్సూర్. మైసూర్ జిల్లా యంత్రాంగం డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఉంటుంది. జిల్లా కమిషన అదనంగా మేజిస్ట్రేట్ బాధ్యత ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్లు, తహసిల్దార్ షిరస్తేదార్లు (తాలూకా స్థాయిలో ఆదాయం అధికారిక), రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామీణ అకౌంటెంట్స్ జిల్లా పరిపాలన డిప్యూటీ కమిషనర్ సహాయం చేస్తారు. మైసూర్ నగరం జిల్లా ముఖ్యపట్టణం. [|ఇది జిల్లాలోని ఈశాన్య భాగంలో నెలకొని ఉంది, దసరా సమయంలో సంబరాలకు (మైసూర్ దసరా) అందమైన రాజభవనాలు కేంద్రంగా ఉంటాయి.
2007గణాంకాలను అనుసరించి మైసూర్ జిల్లా 7 తాలూకాలుగా విభజించబడింది :
మైసూర్ జిల్లాలో ఒక రాజ్యసభ నియోజకవర్గం ఉంది. చామరాజనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నంజన్‌గూడ, తిరుమకూడలు నరసిసిపుర, బన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,994,744,[2] |
ఇది దాదాపు. | ఆర్మేనియా దేశ జనసంఖ్యకు సమానం.[18] |
అమెరికాలోని. | మిసిసిపి నగర జనసంఖ్యకు సమం..[19] |
640 భారతదేశ జిల్లాలలో. | 125వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | .437[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.39%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 982:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 72.56%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో హిందువులు 87.44%, ముస్లిములు 8.87% ఉన్నారు. మిగిలిన వారిలో క్రైస్తవులు, బౌద్ధులు, ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు..[20]
జిల్లాలో ప్రధానభాషగా కన్నడం ఉంది. జెనుకుర్బా, బెట్టకుర్బా, పనియ, పంజరి, యెరెవా, సొలిగ మొదలైన సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. [21]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.