మాండ్య, భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, మాండ్య జిల్లా లోని ఒక నగరం. ఇది మాండ్య జిల్లాకు ప్రధాన కేంద్రం. ఈ నగరం బెంగళూరు నుండి 100 కి.మీ. (62మైళ్లు), మైసూరు నుండి 45 కి.మీ (28 మైళ్లు) దూరంలో ఉంది. నగరంలోని చక్కెర కర్మాగారాలు ప్రధాన ఆర్థిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి. చెరకు ఇక్కడ పండించే ప్రధాన పంట కాబట్టి దీనిని షుగర్ సిటీ ( కన్నడ: సక్కరే నగారా ) అని కూడా పిలుస్తారు. జిల్లా కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.నగరంలో మాండ్య నగరపాలక సంస్థ పరిధి 35 పురపాలక వార్డులుగా విభజించారు.
Mandya | |
---|---|
City Municipal Council | |
Nickname: Sugar City | |
Coordinates: 12.52°N 76.9°E | |
Country | India |
State | Karnataka |
Division | Mysore division |
District | Mandya |
Elevation | 678 మీ (2,224 అ.) |
జనాభా (2016) | |
• Total | 1,31,211 |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 571401[1] |
Vehicle registration | KA-11, KA-54 |
Website | https://mandya.nic.in/en/ |
చరిత్ర
మాండ్యా 2015లో 75వ వార్షికోత్సవాన్ని (అమృత మహోత్సవం) జరుపుకుంది. కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను కృష్ణ రాజా వడియార్ IV, మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాండ్యలో నిర్మించారు. దీనిని 1932లో ప్రారంభించారు.మాండ్య అనేక చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలకు నిలయం. 2016లో భారత పురాతత్వ సర్వేక్షణ జరిపిన తవ్యకాలలో , జైనులలో చాలా గౌరవనీయమైన వ్యక్తి 13 అడుగులు (4 మీటర్లు) ఎత్తుగల బాహుబలి విగ్రహం లభించింది.అతను జైనమతం మొదటి తీర్థంకరుడు ఆదినాథ్ కుమారుడు, 3వ తీర్థంకరుడైన భరత చక్రవర్తిన్ తమ్ముడు.[2] భారత పురాతత్వ సర్వేక్షణ 8వ శతాబ్దానికి చెందిన బాహుబలి విగ్రహాన్ని ఆర్తిపుర, మద్దూరు, మాండ్యలలో త్రవ్వించింది. 3 అడుగుల (0.91 మీటర్లు) వెడల్పు, 3.5 అడుగులు ఎత్తు,1.1 (మీటర్లు) పొడవు ఉన్న విగ్రహం లభంచింది. [3]
రవాణా
మాండ్య రైల్వే స్టేషన్ నగరం కేంద్రంలో ఉఁది. మైసూరు, బెంగళూరులకు బాగా అనుసంధానించబడి ఉంది. చెన్నై, హైదరాబాద్ , కొచ్చువేలి, మంగళూరు, బెలగావి, బాగల్ కోట్, హుబ్లీ, బళ్లారి, వారణాసి, దర్భంగా, జైపూర్, అజ్మీర్ లకు వారాంతపు రైలు సర్వీసులు ఉన్నాయి. నగరంలో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్ స్టాండ్ ఉంది,బెంగళూరు, మైసూర్‌లకు తరచుగా బస్సులు ఉన్నాయి. జాతీయ రహదారి 275 నగరం మీదుగా వెళుతుంది. [4]
భౌగోళికం
మాండ్య నగరంసముద్రమట్టానికి 678 మీటర్లు (2,224 అడుగుల) ఎత్తులో 12.52°N 76.9°E.[5] వద్ద ఉంది
జనాభా గణాంకాలు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మాండ్యాలో 1,37,358 మంది జనాభా ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1000 మంది స్త్రీలు ఉన్నారు.ఇది రాష్ట్ర సగటు 973 కంటే ఎక్కువ. మాండ్య సగటు అక్షరాస్యత రేటు 85.32%, ఇది రాష్ట్ర సగటు 75.36% కంటే ఎక్కువ ఉంది. పురుషుల అక్షరాస్యత 89.39% ఉంది. స్త్రీల అక్షరాస్యత 81.29% ఉంది. నగర మొత్తం జనాభాలో 10.14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు.
మాండ్య నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 13.40% కాగా, షెడ్యూల్డ్ తెగలు 1.17 మంది ఉన్నారు. [6]
ప్రముఖులు
- ఎం.ఎన్.సింగారమ్మ: పండితురాలు, రచయిత్రి, సామాజిక కార్యకర్త.
గ్యాలరీ
- కావేరీ పార్కు
- కార్మెల్ కాన్వెంట్ స్కూల్ ప్రవేశం, మాండ్య
- న్యాయ స్థానాలు సమూహం
- విశ్వేశ్వరయ్య స్టేడియం
- మాండ్య డి.సి. కార్యాలయం
- మాండ్య బస్సు స్టేషన్
- మాండ్య సెయింట్ జోసెఫ్స్ పాత చర్చి
ఇది కూడ చూడు
- మాండ్యలోని పర్యాటక ఆకర్షణలు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.