Remove ads
కర్ణాటక లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మండ్య (కన్నడ: ಮಂಡ್ಯ) కర్ణాటక రాష్ట్రములోని నగరం, మండ్య జిల్లా (కన్నడం: ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ ) యొక్క ప్రధానపట్టణం. మండ్య మైసూరు నుండి 40 కిలోమీటర్లు, బెంగళూరు నుండి వంద కిలోమీటర్లు దూరములో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,808,680 వీరిలో 16.03% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు..[4]
Mandya district
ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
ప్రాంతం | Bayaluseeme |
డివిజన్ | మైసూరు డివిజన్ |
Established | 1 July 1939[1] |
ప్రధాన కార్యాలయం | Mandya |
Boroughs | Mandya, Malavalli, Maddur, Nagamangala, Krishnarajpet, Pandavapura, Srirangapatna |
Government | |
• Deputy Commissioner | B N Krishnaiah IAS |
విస్తీర్ణం | |
• Total | 4,961 కి.మీ2 (1,915 చ. మై) |
జనాభా (2011)[3] | |
• Total | 18,05,769 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (940/చ. మై.) |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-KA-MA |
Vehicle registration | KA-11,KA-54 |
లింగ నిష్పత్తి | 1.015 ♂/♀ |
అక్షరాస్యత | 61.21% |
Lok Sabha constituency | Mandya Lok Sabha constituency |
Climate | Tropical Semi-arid (Köppen) |
Precipitation | 691 మిల్లీమీటర్లు (27.2 అం.) |
Avg. summer temperature | 35 °C (95 °F) |
Avg. winter temperature | 16 °C (61 °F) |
మాండ్య జిల్లాకేంద్రం. మాండ్య కారణంగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. మాండ్య నగర నామం వెనుక పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇది మాండవ్య ముని నివసించిన ప్రాంతం కనుక నగరానికి ఈ పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ పరిశోధకులు, విద్యావంతులు పురాతన శిలాక్షరాలను అనుసరించి మన్- త- య (ಮಂಟಯ) అని పేర్కొన్నారు. ఇది పురాతన కాలం నుండి మానవ నివాసప్రాంతంగా ఉందని విశ్వసిస్తున్నారు. ("ಆವಾಸಸ್ತಾನ, ಅತ್ಯಂತ ಪ್ರಾಚೀನವಾದ ನಾಗರೀಕತೆಗೂ ಮುನ್ನಿನ ಜನವಸತಿ ಎಂಬ ಅರ್ಥವಿದೆ". "ಸುವರ್ಣ ಮಂಡ್ಯ" ಪುಸ್ತಕದಿಂದ - ಸಂಪಾದಕರು ದೇ. ಜವಾರೇಗೌಡ (ದೇಜಗೌ)). కాలక్రమంలో ఇది మాండ్య అయింది.
మాండ్య చరిత్రకు మైసూరు రాష్ట్రంతో సమీప బాంధవ్యం ఉంది. మాండ్య, కావేరీ ముఖద్వారం పరిసర ప్రాంతాలను గంగాలు, చోళులు, హొయసలలు తరువాత 1346 లో విజయనగర రాజులు పాలించారు. 1565 యుద్ధంలో విజయనగరం దక్కన్ నవాబుల సమాఖ్య చేతిలో ఓడిపోయిన తరువాత విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది. తరువాత క్రమంగా ఉడయార్లు బలపడసాగారు. తరువాత వారు దక్షిణభారతదేశంలోని ఒక చిన్న భూభాగానికి స్వతంత్ర పాలకులు అయ్యారు. అందులో పురాతన మైసూరు భూభాగం ఉంది. ఉడయార్లు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ కన్నడ, ధార్వార్ ప్రాంతాలను శ్రీరంగ పట్నం రాజధానిగా చేసుకుని పాలించారు.
ఉడయార్ల శక్తి 1761 వరకు నిరాఘాటంగా కొనసాగింది. వారి సైన్యాధికారులలో ఒకడైన హైదర్ అలి బలం పుంజుకుని ఒడయార్లను అధిగమించాడు. 1799లో హైదర్ ఆలి కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాడు.
1799 జూన్ 30 న మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనాధిష్టుడు అయ్యాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఒడయార్ల పాలన ముగింపుకు వచ్చింది. 1939 నుండి మాండ్య జిల్లాలోని తాలూకాలు మార్చకుండా స్థిరంగా ఉన్నాయి.
జిల్లా వైశాల్యం 4850.8 చ.కి.మీ. జిల్లా భూభాగం చదరంగా ఉంటుంది. జిల్లా ఆగ్నేయ భూభాగంలో ఉన్న బిలిగిరిరంగన పర్వతశ్రేణిలోని పొడిగింపుగా అక్కడక్కడా రాళ్ళు ఉంటాయి. జిల్లాలో కావేరి, హేమవతి, లోకపావని, షింహ నదులు ప్రవహిస్తున్నాయి. నదీప్రవాహాలు జిల్లాకు ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రాకృతిక సౌందర్యం ఇస్తున్నాయి. నదులు ప్రయాణయోగ్యం కాకున్నా అందమైన జలపాతాలను సృష్టిస్తున్నాయి. జలపాతాల సమీపంలో, నదీతీరాలలో ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. భారతీయులకు నదులపట్ల ఉన్న పవిత్రభావానికి ఈ ఆలయాలే ప్రత్యక్షసాక్ష్యాలు.
మాండ్య పట్టణంలో 1933 జనవరిలో మాండ్య షుగర్ ఫ్యాక్టరీ స్థాపించిన తరువాత మాండ్య ప్రాధాన్యత పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఈ సంస్థ స్థాపనకు 20 లక్షలు ఖర్చుపెట్టారు. ఇది ఆకాలంలో అతి పెద్ద మొత్తం. ఈ సంస్థ భారతదేశంలో పెద్ద సంస్థలలో ఒకటని భావిస్తున్నారు. ఇది బెంగళూరుకు 99కి.మీ, ఉత్తర మైసూరుకు 40 కి.మీ దూరంలో ఉంది.
మాండ్య పట్టణంలో జనార్ధనస్వామి ఆలయం ఉంది. ఆలయ ప్రధానదైవం విష్ణుమూర్తి శంఖు చక్రాలు ధరించి శ్రీదేవి భూదేవితో కొలువైఉంటాడు. ఆలయగోపురం సమీపకాలంలో పునరుద్దరించబడింది. ఇక్కడ ఏప్రిల్ - మే మాసాలలో రథోత్సవం నిర్వహించబడుతుంది.
మద్దూర్ మాండ్య నుండి 21 కిమీ దూరంలో ఉంది. ఇది పౌరాణిక ప్రాధాన్యత కలిగి ఉంది. దీని అసలు పేరు అర్జునపుర. అర్జునుడు యాత్రా సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించాడని విశ్వసిస్తున్నారు. టిప్పు - బ్రిటిష్ యుద్ధాల కారణంగా పట్టణం విపరీతంగా సమస్యలను ఎదుర్కొన్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. టిప్పు సుల్తాన్ మద్దూరును కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలతో పోరాటాలు సాగించాడు. మద్దూరు కోటను టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలి నిర్మించాడు. ఈ కోటను కార్న్వాల్ 1791లో ధ్వంసం చేసాడు. ఇది మాంఢ్యకు 21 కి.మీ దూరంలో ఉంది.
మద్దూరులో నరసింహాలయం ఉంది. హొయసల రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆలయంలో నల్లరాతితో చేయబడిన 7 అడుగుల ఉగ్రనరసింహ మూర్తి ప్రతిష్ఠించబడి ఉంది.
అన్ని దైవాలు ముందుకు చూస్తుంటే అలియనంతనాథుడు వెనుకకు చూస్తుంటాడు.
మలవల్లి మాండ్య నుండి 37 కి.మీ దూరంలో ఉంది.ఇది బ్రిటిష్ వారికి ఉపకరించకుండా ఉండాడానికి టిప్పు సుల్తాన్ తనకు తానే దీనిని కొంత ధ్వంసం చేసాడు. ప్రస్తుతం మలవల్లిలో సెరికల్చర్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. మలవల్లిలో తోలుపరిశ్రమ కూడా అభివృద్ధి దశలో ఉంది.
మలవల్లి నుండి 20 కి.మీ దూరంలో ఉంది. మాండ్య నుండి 44 కి.మీ దూరంలో ఉంది. శివసముద్రం నుండి కావేరీ నది రెండుగా చీలి ప్రవహిస్తుంది. అవి 106.68 అడుగుల ఎత్తు నుండి కిందకు పడడం వలన కావేరీ జలపాతాలు ఏర్పడ్డాయి. పశ్చిమ జలపాతాన్ని గగనకుచ్చి అంటారు. గగనకుచ్చి జలపాతం 16వ శతాబ్ధానికి చెందిన నందిరాజా ఆత్మహత్యా ప్రదేశంగా భావిస్తున్నారు. నందిరాజా తనభార్యతో కలిచి గగనకుచ్చి జలపాతం నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. తూర్పు ప్రవాహం నుండి బారాకుచ్చి జలపాతం ఏర్పడింది. ఇది వర్షాకాలం (జూలై నుండి నవంబరు మద్య కాలం )ఇది అందంగా కనిపిస్తుంది.
కావేరీ ఫిషింగ్ క్యాంప్. మాండ్య నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఈ క్యాంప్ కావేరీ నదీ తీరంలో ఉంది. కావేరీ నది సహజసిద్ధంగా ఏర్పరిచిన అభయారణ్యంలో " మహ్సీర్ (ఆసియా ప్రీమియర్ స్పోర్టింగ్ ఫిష్ ) కి ఇది అభయమిస్తుంది. ఇది శివసముద్రం - మెకెడతు మధ్య కావేరీ నదీజలాలతో కావేరీ దిగువవ ప్రవాహంలో ఏర్పడింది. వర్దంత్ వ్యాలీలోని దట్టమైన అరణ్యాకలో ఏనుగు, సాంబార్, చిరుత, అడవి పంది, రంగురంగుల పక్షులు ఉన్నాయి. కావేరీ జలాలు మొసళ్ళకు కూడా ఆశ్రయం ఇస్తున్నాయి. అందమైన ఈ జలాశయ పరిసరాలలో కొందరు రిసార్ట్ స్వతదార్లు సౌకర్యవంతమైన టెంట్లు ఏర్పాటు చేసారు. ఈ ఫిషింగ్ కేంద్రం విహారకేంద్రంగా కూడా ఉంది.
పాండవపురా మాండ్య నుండి 26.4 కి.మీ దూరంలో ఉంది. హైదర్ అలి, టిప్పు సుల్తాన్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉంది. టిప్పు సుల్తాన్ సమయంలో ఫ్రెంచ్ సర్వీసుమెన్కు ఇది నివాసంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ బృహత్తర - ప్రణాళికలో స్థాపించబడిన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో పాండవపురాను హీరోడ్- దండు, ఫ్రెంచ్ రాక్స్ అనేవారు.
కుంతిబెట్టా పాండవపురా నుండి 2 కి.మీ దూరంలో ఉంది. లక్కాగృహ దహనం తరువాత అరణ్యాలలో సంచరిస్తున్న సమయంలో పాండవులు తమతల్లి కుంతితో కొంతకాలం ఇక్కడ నివసించాడని విశ్వసిస్తున్నారు.
మేల్కోటె పాండవపురా నుండి 25 కి.మీ దూరంలో, మాండ్య నుండి 38 కి.మీ దూరంలో ఉంది. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. 12 వ శతాబ్ధంలో మేల్కోటెలో శ్రీవైష్ణవ సప్రదాయానికి చెందిన శ్రీ రామానుజాచార్య 14 సంవత్సరాల కాలం నివసించాడని విశ్వసిస్తున్నారు. మైసూరు మాహారాజులు మేల్కోటె లోని చలువరాయస్వామి భక్తులు. మైసూరు మహారాజా ఆలయానికి విలువైన ఆభరణాలు సమర్పించారు. చలువరాయస్వామిని సంవత్సరానికి ఒకదారి మార్చ్- ఏప్రెల్లో ఈ ఆభరణాలతో అలంకరిస్తుంటారు. ఈ ఉత్సవసమయాన్ని " వీరముడి " అంటారు. ఆలయంలో 1785 కాలంనాటి శిలాశాసనాలలో ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్ కొన్ని ఏనుగులను కానుకగా సమర్పించాడని తెలియజేస్తున్నాయి. శిలాసదృశ్యమైన కొండలలో నిర్మించబడిన యదుగిరి పట్టణం సౌదర్యవంతమైన ప్రకృతి దృశ్యాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా ఉంటుంది..
తిరుమలసాగర మేల్కొటెకు 6 కి.మీ దూరంలో ఉంది. తిరుమలసాగర సరోవరం రామానుజాచార్య అభీష్టం మేరకు హొయశిల రాజు బిట్టిదేవ చేత నిర్మించబడింది. బిట్టిదేవ వైష్ణవ సంరదాయాన్ని స్వీకరించి విష్ణువర్ధన నామాన్ని స్వీకరించాడు. అందుకు ఇక్కడ నిర్మించబడిన నంకి నారాయణ స్వామి, వేణుగోపాలా ఆలయాలు హొయశిల నిర్మాణకళకు సాక్ష్యాలుగా ఉన్నాయి. 1749 లో బీజపూర్ సుల్తాన్ ఆదిల్షా ఈ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో విలీనం చేసి దీనికి " మోతి తలాబ్ " లేక్ ఆఫ్ పీర్ల్స్ " (ముత్యాల సరసు) అని నామకరణం చేసాడు.
కృష్ణరాజపేట్ హొయశిల ఆలయాలకు నిలయం. హొయశిలల కాలంలో ఇక్కడ పలు ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో లక్ష్మీనారాయణాలయం శిల్పకళాసౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం కృష్ణరాజపేటకు మూడు కి.మీ దూరంలో హొసహోలలు కుగ్రామం ఉంది. హొయశిల నిర్మాణవైభవానికి ఈ ఆలయం చిహ్నంగా ఉంది. ఇది ఒకప్పుడు అగ్రాహారంగా ఉండేది. ఇక్కడ ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న కోట ఉంది. ఈ కోటను విజయనగర రాజులు పునరుద్ధరించారు. హొసహోలలు లక్ష్మీనారాయణ ఆలయం శిల్పకళా శోభ సోమనాథపూర్, నుగ్గెహల్లి, జవగల్, హిరెనల్లూర్, అరలుకుప్పె ఆలయ శిల్పకళావైభవానికి సమానమని భావిస్తున్నారు. నిర్మాణ శైలిని అనుసరించి ఇది 13 వశతాబ్ధానికి చెందినదని భావిస్తున్నారు. ఇది నక్షత్రాకారంలో నిర్మించబడిన వేదిక మీద త్రికుటాచల (మూడు ద్వారాలు) నిర్మాణం. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి విశాలమైన ఆవరణను వదిలి ఈ ఆలయం నిర్మించబడింది.ఆలయం మద్య స్థాంభాల మండపం ఉంది. నవరంగ మండపంలో ఉన్న స్తంభాలు నృత్యభంగిమలో ఉన్న నర్తకీమణుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. నవరంగ మండపం పైకప్పు కూడా శిల్పాలతో అలంకరించబడి ఉంది.
ఆలయ కుడ్యశిల్పాలలో లతలు, ఏనుగులు, గుర్రాలు, పౌరాణిక దృశ్యాలు, స్క్రోల్స్, హంసలు, అనేక దైవాలు, దేవతలు వారి పరివారం శిల్పాలతో అలంకరించారు. ఆలయ కుడ్యాలలో రామాయణ, మాహాభారత, భాగవత కథలలోని దృశ్యాలను చెక్కారు. ఆలయంలో అదనంగా మాధవ, ధంవంతరి, దక్షిణామూర్తి, నృత్యసరస్వతి, కాళింది మర్ధన, పార - వాసుదేవ, నృత్యకారులు, సంగీతకారుల శిల్పాలు ఉన్నాయి. ఆలయం వెలుపలి కుడ్యాలలో అరగంబాలు, అరెగోపురాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ గాలిగోపురం అయిదు అంతస్తులతో నిర్మించబడి ఉంది. ఆలయగోపురం మీద వర్షపునీటిని వెలుపలికి పంపేవిధంగా చేసిన నైపుణ్యం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలయంలో హరిహరేశ్వర, ఆంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. 17వ శతాబ్ధానికి చెందిన ఆంజనేయ ఆలయంలో 10 అడుగుల ఎత్తైన గరుడ స్తంభం ఉంది. రంగబ హాబ్బ పేరుతో ఆలయంలో హీళి పండుగ సందర్భంలో వార్షిక జాతర నిర్వహించబడుతుంది. గ్రామంలో ఒక సరసు ఉంది. ఇక్కడ మోనోలిథిక్ బసవ విగ్రహం లభించింది.
కిక్కేరి లోని బ్రహ్మేశ్వరాలయం కృష్ణరాజపేట నుండి 14 కి.మీ దూరంలో ఉంది. హొయశిల రాజుల నిర్మాణకళకు ఇది ఉదాహరణగా ఉంది. ఈ ఆలయాన్ని 1171లో మొదటి నరసింహ నిర్మించాడు. ఆలయంలోని స్థాంభాలు అందంగా మలచబడి శిల్పకారుల నైపుణ్యానికి చిహ్నంగా ఉన్నాయి.
బసరాలు ఒక చిన్న గ్రామ. ఇది 12వ శతాబ్ధానికి చెందిన మల్లికార్జునఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని హొయశిల సైనికాధికారి చేత నిర్మించబడింది. ఆలయ వెలుపలి కుడ్యాలలో రామాయణ, మాహాభారత, భాగవతం చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో ఉన్న అద్భుతచిత్రాలలో అంధకాసురుని తల మీద నర్తిస్తున్న 16 భుజాలు కలిగిన శివుని నటరాజమూర్తి, కైలాసాన్ని పైకెత్తుతున్న రావణాసురుని శిల్పాలు ఉన్నాయి.
శివపుర మాండ్య నుండి 1 కి.మీ దూరంలో ఉంది. శివపుర జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఒకటి. 1938 10-12 ఏప్రిల్ మద్య వేలాది స్వాతంత్ర్య సమర యోధులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంఢా ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య సమర యూధుల వీరత్వానికి చిహ్నంగా ఇక్కడ స్మారక చిహ్నం నిర్మించబడింది.
కొక్కరే - బెల్లూరు గ్రామం ప్రస్తుతం పక్షుల శరణాలయంగా అభివృద్ధి చేయబడ్జింది. కొక్కరే - బెల్లూరు కొంగలను, పెలికాన్లు, పెద్ద సంఖ్యలో వలస పక్షులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు అక్టోబరు - మార్చి మాసాలలో వలస పక్షులు అధికంగా వస్తుంటాయి కనుక పక్షులను వీక్షించడానికి ఇది అనుకూల సమయం.
బ్లఫ్ పవర్ జనరేటింగ్ స్టేషను తూర్పు ఆసియా మొదటి పవర్ జనరేటింగ్ స్టేషనుగా గుర్తించబడుతుంది. దీనిని 1902లో మైసూర్ దివాను దీనిని స్థాపించాడు. ఇక్కడకు 200 కి.మీ దూరంలో ఉన్న కోలార్ బంగారు గనులకు విద్యుత్తును అందించడానికి ఈ పవర్ ప్లాంటు స్థాపించబడింది. 137.16 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతం హైడ్రాలిక్ పైపులను అమర్చడానికి సౌకర్యం కల్పిస్తున్న కారణంగా ఈ ప్రాంతానికి బ్లఫ్ అని పేరు వచ్చింది. ఈ పవర్ హౌస్ చిన్న కొండ పాదాల వద్ద ఉంది. ఇక్కడకు ట్రాలీలో సులువుగా చేరుకోవచ్చు.
ముత్తాతి మలవల్లి నుండి 35 కి.మీ దూరంలో, ఫిషింగ్ క్యాంపు నుండి 6కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అందమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రామాయణ పురాణకథనం అనుసరించి సీతాదేవి తనచేతి ఉంగరాన్ని ఇక్కడ ఉన్న కావేరీ నదిలో పోగొట్టుకుందని హనుమంతుడు నదిలో సీతాదేవి ఉంగరం కొరకు శోధించాడని తరువాత ఇక్కడ హనుమంతుని ఆలయం నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. ఆలయం పలు భక్తులను ఆకర్షిస్తుంది. హనుమతునికి ప్రియమైన శనివారం నాడు ఈ ఆలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు.
నాగమంగళ పట్టణం హొయశిల కాలం నుండి ప్రాముఖ్యత కలిగి ఉంది. నాగమంగళ మాండ్య నుండి 42 కి.మీ దూరంలో ఉంది. నాగమంగళ లోహపు పనితనానికి నైపుణ్యం ఉన్న కళాకారులకు ప్రసిద్ధి చెందింది. నాగమంగళానికి చెందిన తిమ్మన్న శ్రీరంగపట్నం కోట నిర్మాణంలో పాల్గొన్నాడు. ఇక్కడ ఉన్న సౌమ్యకేశవ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. తరువాత ఈ ఆలయానికి విజయనగర రాజులు మెరుగులు దిద్దారని భావిస్తున్నారు. ఆలయ ప్రధానదైవం ఆదికేశవ విగ్రహం 1.83 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
నాగమంగళ సమీపంలో ఉన్న కంబదల్లి జైనులకు పవిత్ర ప్రదేశం. ఇక్కడ బ్రహ్మదేవుని స్తంభం ఉన్నందున ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ముదురు బూడిదరంగు సోప్స్టోన్తో నిర్మించబడిన ఎనిమిది ముఖాలు కలిగిన ఈ స్తంభం చివరన బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. స్థాంభానికి సమీపంలో ఏడు గుడులు ద్రావిడ శైలిలో
నాగమంగళానికి 16 కి.మీ దూరంలో ఆది చుంచనగరి ఒక యాత్రాస్థలం. ఇక్కడ సహజసిద్ధమైన రెండు గుహాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రధానదైవం సిద్ధేశ్వర స్వామి, సోమేశ్వరుడు. ఇక్కడ ఆది చుంచనగరి మఠం ఉంది. మఠం ఒక మెడికల్ కాలేజీని నిర్వహిస్తుంది. సమీపంలో ఉన్న మనోహరమైన మయూర వనంలో ఉదయ, సాయంత్రం వేళలలో నెమళ్ళు విహరిస్తుంటాయి.
శ్రీరంగపట్నం మాండ్య నుండి 27 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శ్రీరంగనార్హాలయం ఉన్నందున ఈ పట్టణానికీ పేరు వచ్చింది. ఇది పురాతన ఆలయం. గంగా రాజు తిరుమల సంబంధిత శిలాశాసనం అనుసరించి ఈ ఆలయం 894 లో నిర్మించబడిందని భావిస్తున్నారు. శ్రీరంగపట్నం ఒకప్పుడు మౌఉసురాజా రాజధానిగా ఉండేది. తరువాత హైదర్ అలి ఆతరువాత టిప్పు సుల్తానుకు రాజధానిగా ఉంది. 1799లో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యాలతో పోరాడి యుద్ధంలో మరణించిన తరువాత ఉడయార్లు రాజధానిని మైసూరుకు తరలించారు. బలమైన టిప్పుసుల్తాన్ కోట భారతదేశంలోని శక్తివంతమైన కోటలలో రెండవ స్థానంలో ఉంది. కోట ఉత్తర, పశ్చిమ దిశల గోడలను కావేరీ నది సరక్షిస్తూ ఉంది. కోటలో లాల్ మహల్, టిప్పు ప్యాలెస్ శిథిలాలు ఉన్నాయి. 1799లో కోటను చేపట్టే వరకు కోటలోని భాగాలను బ్రిటిష్ సైన్యం ధ్వంసం చేసింది. కోటకు 5 ప్రాకారాలు ఉన్నాయి. టిప్పు మిలటరీ భవనాలు ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
కావేరీ ఉత్తరతీరంలో హజారత్ టిప్పు సుల్తాన్ షహీద్, ది టైగ ఆఫ్ మైసూర్ దర్యా దౌలత్ బాఘ్ ( గార్డెన్ ఆఫ్ ది వెల్త్) సరాసీనిక్ ఆర్కిటెక్చర్ నమూనా, గోడల మీద పెయింటిగ్స్ ఉన్నాయి. శ్రీరంగపట్నానికి 3 కి.మీ దూరంలో గంజం గ్రామంలో టిప్పు సుల్తాన్ తండ్రి కొరకు టిప్పు గుంబజ్ నిర్మించబడింది. అక్కడే టిప్పు తల్లి, టిప్పు సుల్తాన్ కూడా సమాధి చేయబడ్డాడు. 1784లో నిర్మించబడిన ఈ భవనంలో 36 గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి.స్తంభాలను 2 లక్షల రూపాయల ఖర్చుతో ఇటలీ నుండి దిగుమతి చేసుకున్నారు. గుంబజ్ ముందు చిన్న ప్రదేశంలో దురంత చెట్లు ఉన్నాయి. ఇక్కడ టిప్పు సుల్తాన్ శరీరానికి చివరిసారిగా స్నానం చేయించబడింది. టిప్పు కాలంలో ఇక్కడ ఒక అందమైన మసీదు ఉండేది. ప్రస్తుతం ఇక్కడ మట్టిప్రదేశం మాత్రమే ఉంది. టిప్పుసుల్తాన్ మరణించిన తరువాత అది పడగొట్టబడి ఆ వస్తువులను ఉపయోగించి ఊటీలో చర్చినిర్మాణంలో ఉపయోగించారు. సంగం - గుంభజ్ మార్గంలో ఆ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి.
సంగమ శ్రీరంగపట్నం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. కె.ఎస్.టి.డి.సి అందమైన నదీతీర కాటేజీలను ఇక్కడ నిర్మించారు. పూర్తిగా అలంకరించబడిన, పూర్తిస్థాయి వసతులతో కూడిన ఈ కాటేజీలు, ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన రెస్టారెంటు దీనిని పర్యాటక ఆకర్షిత ప్రాంతంగా మార్చింది. ఇక్కడ నది ప్రశాంతంగా అందమైన పచ్చని ద్వీపాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
శ్రీరంగ పట్నం ఆనుకుని ఉన్న కావేరి, లోకపావని నదీతీరాలలోని చిన్న స్నానఘట్టాలు, ఆలయాలు పరిసరప్రాంతంలోని అందమైన ప్రాంతాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
శ్రీరంగపట్నానికి దక్షిణంగా ఉన్న సంగమ వద్ద రెండుగా చీలిన కావేరీ నది తిరిగి సంగమిస్తుంది. ఇక్కడ చిన్న వైర్ల్పూల్ ఉంది.
కరిఘట్ట శ్రీరంగపట్నం నుండి 6 కి.మీ దూరంలో లోకపావని నదీతీరంలో ఉంది. కొండమీద వెకటేశ్వరాలయం ఉంది. ఈ ఆలయానికి జూలై, నవంబరు మాసాలాలో భక్తులు అధికంగా వస్తుంట్టారు. ఆలయాన్ని చేరుకోవడానికి 100 మెట్లు ఉన్నాయి. మోటవాహనాలకు కూడా మర్గం నిర్మించబడి ఉంది. ఈ ప్రదేశం పర్వతారోహణకు అనుకూల ప్రాంతం.
రంగనాథ్తిట్టు కావేరి నదిలోని ద్వీపంలో ఉంది. రంగనాథ్తిట్టు పక్షులకు స్వర్గంగా ఉంది. ఇక్కడకు సైబీరియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా నుండి పక్షులు వస్తుంటాయి. ఈ పక్షుల శరణాలయం సందర్శించడానికి అనువైన కాలం మే - నవంబరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న బోటు సర్వీసులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు సరసులో విహరిస్తూ పక్షులను దగ్గరగా వీక్షించవచ్చు. బోట్ మన్ పక్షుల గురించి వివరిస్తుంటారు. మట్టి ద్వీపంలో ముసళ్ళు తిరుగుతూ ఉంటాయి.
కృష్ణరాజ సాగర్ మాడ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకాకు 18 కి.మీ దూరంలో ఉంది. కృష్ణరాజసాగర్ ఆనకట్ట 39.62 మీటర్ల ఎత్తు, 2621.28 మీటర్ల పొడవు ఉంటుంది. రిజర్వాయర్ నిండినప్పుడు కృష్ణరాయసాగర్ ఆనకట్టలో 38 .04 మీ ఎత్తున జలాలు నిలువచేయబడతాయి. ఆనకట్ట వద్ద అందమైన పూదోటలు ఉన్నాయి. బృదావన గార్డెంస్ " ది బెస్ట్ - ఇల్యూమనేటెడ్ టెర్రస్ గార్డెంస్ "లో అరుదైన వృక్షజాతులు సంరక్షిచబడుతుంటాయి. పూదోటలో వివిధ ఆకారాలలో, సైజులలో ఫౌంటెన్లు ఉన్నాయి. వీటిలో మ్యూజికల్ డాంసింగ్ ఫౌంటెన్లు ప్రాబల్యం సంతరించుకుంది. చీకటి ముసురుకుంటున్న వేళలో మ్యూజికల్ ఫౌంటెన్ దృశ్యాలు చూపరులకు కనువుందు చేస్తుంటాయి.
బెంగుళూరు - మైసూరు మద్యలో ఉన్నందున మాండ్య జిల్లా చక్కని ప్రయాణ సౌకర్యాలను అందుకుంటుంది. బెంగుళూరు రైలు మార్గం జిల్లాను బెంగుళూరు - మైసూరు నగరాలతో అనుసంధానిస్తుంది. అందువలన ముడిసరుకు సులువుగా అందుకునే వసతి ఉంది కనుక జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. జిల్లాలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజి, మూడు పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్లు పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవ వనరును అందిస్తుంది.
మాండ్య నుండి 50 కి.మీ పరిధిలోపల సి.ఎఫ్.టి.ఆర్.ఎల్, డి.ఎఫ్.ఆర్.ఎల్, సిపెట్, స్టెప్ సంస్థలు ఉన్నాయి.
జిల్లాలో మాండ్య వద్ద రెండు (కె.ఐ.ఎ.డి.బి) ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తుబినకెరె వద్ద ఉంది. మరొకటి మద్దుర్ సమీపంలోని సోమనాహలి వద్ద ఉంది. జిల్లాలో 6 (కె.ఎస్.ఎస్.ఐ.డి.సి) ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి మాండ్య గంజం (శ్రీరంగపట్నం), సోమనహళ్ళి (మద్దూరు), హరొహళ్ళి (పాండవపుర), నాగమంగళ వద్ద ఉన్నాయి.
వరుస సంఖ్య . | పరిశ్రమ పేరు | వాణిజ్య ఉత్పత్తి |
---|---|---|
1 | మైసూర్ షుగర్ కో లిమిటెడ్, మాండ్యా | షుగర్ |
2 | బిపిఎల్ పిటిఐకి కెమికల్స్ లిమిటెడ్, సోమనహల్లి ఇండస్ట్రియల్ ఏరియా, మద్దూర్ తాలూకాలోని | డ్రై సెల్స్ |
3 | పాండవపురా సహకారి సక్కర్వ్ కార్కానె, పాండవపుర | షుగర్ |
4 | చాముండి చక్కెరలు లిమిటెడ్, భారతి నగర్, మద్దూర్ తాలూకాలోని | షుగర్ |
5 | లియాబిబ్ ద్రావణి వెలికితీత లిమిటెడ్, టి.బి.రోడ్డు, ఎస్.ఆర్.పాట్నా | వంటనూనెలు |
6 | ఎం.కె.అగ్రోటెక్, ఎస్.ఆర్.పాట్నా తాలూకా | వంటనూనెలు |
7 | మాండ్యా జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ఉత్పత్తులు సమాజం యూనియన్, గెజ్జలగెరె, మద్దూర్ తాలూకాలోని | మిల్క్ ప్రోసెసింగ్ |
8 | ఐ.సి.ఎల్. చక్కెరలు, మలవల్లి, కె.ఆర్.పి.టి తాలూకా | షుగర్ |
9 | కీలర పవర్ ప్రాజెక్ట్, కీలర, మాండ్యా తాలూకా | పవర్ తరం |
10 | కర్నాటక మల్లాది బయోటెక్ యొక్క లిమిటెడ్, ట్యూబిన్కెరే ఇండ్ ఏరియా, బల్క్ డ్రగ్స్ | మాండ్య తాలూకా. |
11 | ఎన్.ఎస్.ఎల్ చక్కెరలు లిమిటెడ్, కొప్ప, మద్దూర్ తాలూకాలోని |
జిల్లాలో తయారు చేయబడుతున్న విద్యుత్తు గృహావసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు వినియోగించబడుతుంది.
మాండ్య జిల్లా 12°13' నుండి 13°04' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 76°19' నుండి 77°20' డిగ్రీల తూర్పు రేకాంశంలో ఉంది.[5]
మాండ్య జిల్లాలో ఐదు నదులు ప్రవహిస్తున్నాయి; కావేరి, 4 ఉపనదులు: హేమవతి, షింహ, లోకపావని, వీరవైష్ణవి.[6]
విషయాలు | వివరణలు |
---|---|
ఉపవిభాగాలు | 2 మాండ్య, పాండవ పుర |
పాండవ పుర ఉపవిభాగంలో తాలూకాలు | పాండవ పుర, శ్రీరంగపట్నం, కృష్ణరాజపేట, నాగమంగళ [5] |
మాండ్య ఉపవిభాగంలో తాలూకాలు | మాండ్య, మద్దురు, మలవల్లి |
తాలూకాలు | 7 |
మాండ్య జిల్లా కావేరీ నదీ తీరంలో ఉంది. జిల్లాలో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, పత్తి, అరటి, రాగి, కొబ్బరి, పప్పు ధాన్యాలు పండించబడుతున్నాయి. ఉలవలు, కంది,ంకౌపీ, పెసలు, మినుములు, చిక్కుడు కూడా పండించబడుతున్నాయి. కూరగాయలు కూడా పండుతున్నాయి. [5]
మాండ్య జిల్లా విస్తారమైన రహదారి మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి 48, జాతీయ రహదారి 209 జిల్లా గుండా పయనిస్తున్నాయి. జిల్లాలో రోడ్ల సంఖ్య 73. జాతీయరహదార్ల పొడవు 467 కి.మీరాష్ట్రీయ రహదారి పొడవు 2968 కి.మీ.[7]
మాండ్య " సౌత్ వెస్టర్న్ రైల్వే " మార్గంలో ఉంది. జిల్లాలో పలు రైలు స్టేషన్లు ఉన్నాయి. జిల్లా రైలు స్టేషన్ల జాబితా: :[8] ' 'స్టేషను పేరు'
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,808,680,[9] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[10] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం..[11] |
640 భారతదేశ జిల్లాలలో. | 263 వ స్థానంలో ఉంది.[9] |
1చ.కి.మీ జనసాంద్రత. | 365 [9] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 2.55%.[9] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 989:1000 [9] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాశ్యత శాతం. | 70.14%.[9] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.