Remove ads
గుజరాత్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మహెసనా జిల్లా (గుజరాతీ:મહેસાણા જિલ્લો) ఒకటి. మహెసనా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,837,892. జిల్లాలో 600 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 22.40% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.[1]
మహెసనా జిల్లా ఉత్తర సరిహద్దులో బనస్ కాంతా జిల్లా, పశ్చిమ సరిహద్దులో సరిహద్దులో పఠాన్ జిల్లా, సురేంద్రనగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో గాంధీనగర్ జిల్లా, అహమ్మదాబాదు జిల్లా, దక్షిణ సరిహద్దులో సబర్కాంత జిల్లాలు ఉన్నాయి.
ప్రధాన పట్టణాలు: విజపూర్, బహుచరజి, మొదెర, ఉంఝా, వాద్నగర్, కలోల్ (మెహసానా), కడి, (భారతదేశం) విస్నగర్, ఖెర్వ (గుజరాతీ :ખેરવા), జొతన, ఖదల్పుర్, సంగంపుర్ (સાંગણપુર, కాంచన్పూఱ్ (కొచ్వ) ).
జిల్లాలో లోతేశ్వర్ వంటి " సింధూనాగరికతకు" చెందిన పలు ప్రాంతాలు ఉన్నాయి.[2]
చారిత్రకంగా జిల్లాలోని భూభాగాలను వేరు చేసి ఇతర జిల్లాలు రఒందించబడ్డాయి.
జిల్లాలో ప్రధానంగా సజ్జలు, జొన్నలు, జిలకర, పత్తి, నూనె గింజలు (అముదాలు, ఆవాలు, పత్తి), కూరగాయలు, మిరపకాయలు, పెసలు, గొవర్ మొదలైన పంటలు పండించబడుతుంటాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,027,727, |
ఇది దాదాపు. | స్లోవేనియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 229వ స్థానంలో ఉంది.. |
1చ.కి.మీ జనసాంద్రత. | 462 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.91%. |
స్త్రీ పురుష నిష్పత్తి. | 925:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 84.26%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
నవసారి జిల్లా 5 తాలుకాలు విభజించబడింది:
మెహసానా 9 పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
మెహసానా జిల్లాలో ఐదు పైగా ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి,
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.