మీర్జాపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

మీర్జాపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మీర్జాపూర్ జిల్లా (హిందీ:मिर्ज़ापुर ज़िला) (ఉర్దూ: مرزا پور ضلع) ఒకటి. మీర్జాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మీర్జాపూర్ జిల్లా మీర్జాపూర్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4521 చ.కి.మీ.

త్వరిత వాస్తవాలు మీర్జాపూర్ జిల్లా मिर्ज़ापुर ज़िला مرزا پور ضلع, దేశం ...
మీర్జాపూర్ జిల్లా
मिर्ज़ापुर ज़िला
مرزا پور ضلع
Thumb
ఉత్తర ప్రదేశ్ పటంలో మీర్జాపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమీర్జాపూర్
ముఖ్య పట్టణంమీర్జాపూర్
మండలాలు4
Government
  లోకసభ నియోజకవర్గాలుమీర్జాపూర్
విస్తీర్ణం
  మొత్తం4,521 కి.మీ2 (1,746 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం24,94,533[1]
సగటు వార్షిక వర్షపాతం1043 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి
Thumb
సిద్ధనాథ్ కి దరి జలపాతం

భౌగోళికం

జిల్లాలోని విద్యాచల్‌లో ప్రముఖ వింద్యవాసిని ఆలయం ఉంది. ఇక్కడ పలు స్నానఘట్టాలు, చారిత్రాత్మక శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి. గంగా ఉత్సవం జరిగే సమయంలో గంగానది స్నానఘట్టాలు విద్యుద్దీపాలు, తోరణాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[2]

సరిహద్దులు

జిల్లా ఉత్తర సరిహద్దులో భదోహీ జిల్లా, వారణాసి జిల్లా, తూర్పు సరిహద్దులో చందౌలీ జిల్లా, దక్షిణ సరిహద్దులో సోన్‌భద్ర జిల్లా, వాయవ్య సరిహద్దులో అలహాబాద్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు

  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి: మీర్జాపూర్ (సాదర్), లాల్గంజ్, మరిహాన్, చునార్.
  • జిల్లాలో 12 బ్లాకులు ఉన్నాయి:-

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మీర్జాపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,494,533,[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వవాడా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 17 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 561 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.89%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 900:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.38%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
మూసివేయి

భాషలు

జిల్లాలో ఆస్ట్రియాస్టిక్ భాషలలో ఒకటైన అగారియా భాష 72,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[6] 72.91% హిందీ భాషను పోలి ఉన్న అవధి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[7] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[8] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[7] అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగేలి భాష 40 000 000 మంది భగియా, షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి, కైతిలి లిపిని వాడుతున్నారు. జిల్లాలో భోజ్‌పురి భాషకూడా వాడుకలో ఉంది.[9]

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.