చందౌలీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

చందౌలీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చందౌలి జిల్లా (హిందీ:चंदौली ज़िला) (ఉర్దూ: چندولی ضلع) ఒకటి. చందౌలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చందౌలి జిల్లా వారణాసి డివిజన్‌లో భాగంగా ఉంది. 1997 మే మాసంలో ఈ జిల్లా రూపొందించబడింది. 2004 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి మాయావతి చేత ఇది రద్దుచేయబడి వారణాసిలో విలీనం చేయబడింది. ఈ నిర్ణయం సవాళ్ళను ఎదుర్కొన్నందున 204 జూన్ 17న ఈ నిర్ణయం రద్దుచేయబడింది.

త్వరిత వాస్తవాలు చందౌలీ జిల్లా चंदौली ज़िला, దేశం ...
చందౌలీ జిల్లా
चंदौली ज़िला
Thumb
ఉత్తర ప్రదేశ్ పటంలో చందౌలీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనువారణాసి
ముఖ్య పట్టణంచందౌలీ
విస్తీర్ణం
  మొత్తం2,484.70 కి.మీ2 (959.35 చ. మై)
జనాభా
 (1991)
  మొత్తం11,48,732
  జనసాంద్రత460/కి.మీ2 (1,200/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి
Thumb
రాజదారి జలపాతాలు

ప్రత్యేకతలు

జిల్లాలోని ముగల్ సరాయ్ నగరంలోని రైల్వే స్టేషను తూర్పు భారతదేశంలో రద్ది అయిన స్టేషను. జిల్లాలో సుంఫరమైన " చంద్రప్రభా శాంక్చ్యురీ " ఉంది. జిల్లాలో దేవ్‌దారి, రాజ్‌దారి జలపాతాలు ఉన్నాయి. జిల్లాలో వరి, గోధుమ, వంటి ధాన్యాలు పండించబడుతున్నాయి. జిల్లా " ధాన్ కా కటోరా ఆఫ్ ఉత్తర ప్రదేశ్ " (ఉత్తర ప్రదేశ్ ధాన్యాగారం) గా గుర్తించబడుతుంది. జిల్లాలో అత్యధికంగా గంగామైదానం ఉండడమే ఇందుకు కారణం. భారతస్వాతంత్ర్య సమరంలో చైందౌలి జిల్లా ప్రధానపాత్ర వహించింది. చందౌలీ జిల్లాలో అభివృద్ధి తగినంత జరగలేదు. జిల్లాలో మౌలిక సౌకర్యాలు, విద్యావసతుల కొరత అధికంగా ఉంది. ప్రస్తుతం ప్రజలలో చౌతన్యం వచ్చింది. జిల్లాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఖఖారా గ్రామానికి స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర వహించిన ప్రత్యేకత ఉంది. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[1]

భౌగోళికం

జిల్లా 25,27 ° ఉత్తర అక్షాంశం, 83,27 ° తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా ఎత్తు సముద్రమట్టానికి 70 మీ ఎత్తులో ఉంది.

  • తాలుకాలు సంఖ్య: 3: చందౌలి, సకల్దీహ, చకీ
  • మండలాల సంఖ్య: 9: బరహని, చందౌలీ, నియంతబద్, చహనియ, సకల్దీహ, ధనపుర్ చకియ, షహబ్గంజ్, నౌఘర్. 
  • థనస్: 12: మొఘల్సరాయ్, అలినగర్, బలూ, చకియ, చందౌలీ, సైయ్యద్రజ, సకల్దీహ, షహబ్గంజ్, బబురి, ధీన, ధనపుర్, నౌఘర్.
  • గ్రామాల సంఖ్య: 1651;
  • నదులు: గంగ, ఖర్మనష, ఛంద్రప్రభ, ఇతరులు.
  • ఆనకట్టలు: నౌఘర్, ంఉషఖర్ద్, ఛంద్రప్రభ, ళతిఫ్షహ్, భైసొద.
  • పెద్ద కాలువలు: ఛంద్రప్రభ, ంఉషఖద్, నారాయణపూర్ కెనాల్ ఎత్తండి. 
  • జలపాతాలు: రాజ్ దారి, దేవదారి, ఆఉర్వతర్ద్, ఖర్మనష జలపాతం, ఇతరులు. 
  • లేక్స్: ఛంద్రప్రభ, భైసొద, నౌఘర్, ంఉషఖర్ద్, ళతిఫ్షహ్, ఇతరులు.
  • పంటలు: వరి, గోధుమ.

ఆర్ధికం

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చందౌలి జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,952,713, [3]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 238 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 738 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.83%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 913:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 73.86%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
మూసివేయి

ఇవికూడా చూడండి

బయటి లింకులు

త్వరిత వాస్తవాలు
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.