భదోహీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

భదోహీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో భదోహీ జిల్లా (హిందీ:भदोही ज़िला) ఒకటి. గ్యాన్‌పూర్ పట్టణం జిల్లాकु కేంద్రంగా ఉంది.

త్వరిత వాస్తవాలు భదోహీ జిల్లా, దేశం ...
భదోహీ జిల్లా
Thumb
ఉత్తర ప్రదేశ్ పటంలో భదోహీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమీర్జాపూర్
ముఖ్య పట్టణంగ్యాన్‌పూర్
మండలాలు3
Government
  లోకసభ నియోజకవర్గాలుభదోహీ
విస్తీర్ణం
  మొత్తం1,055.99 కి.మీ2 (407.72 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం15,54,203
  జనసాంద్రత1,500/కి.మీ2 (3,800/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత89.14%
ప్రధాన రహదార్లుNH 2
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

చరిత్ర

Thumb
హరిహరనాథ మందిరం, భదోహీ

1994 జూన్ 30 న భదోహీ జిల్లా రాష్ట్రంలో 65 జిల్లాగా రూపుదిద్దుకుంది. వైశాల్యపరంగా ఇది రాష్ట్రంలో అతిచిన్నదిగా ఉంది. మాయావతి నేతృత్వం లోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లా పేరును సంత్ రవిదాస్ నగర్ జిల్లాగా మార్చింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం దీన్ని మళ్ళీ భదోహీ గా మార్చింది. ఈ జిల్లా గతంలో వారణాసి జిల్లాలో భాగంగా ఉంది.

భౌగోళికం

జిల్లా గంగానదీ మైదానంలో ఉంది. జిల్లా నైరుతీ సరిహద్దులో గంగానది ప్రవహిస్తుంది. జిల్లాలో ప్రధానంగా గంగానది, వరుణానది, మొర్వ నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 1055.99 చ.కి.మీ.

సరిహద్దులు

జిల్లా ఉత్తర సరిహద్దులో జౌన్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో వారణాసి జిల్లా, దక్షిణ సరిహద్దులో మీర్జాపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో అలహాబాద్ జిల్లా ఉన్నాయి.

ఆలయాలు

భోగి వద్ద సీతా సమహిత్ స్థల్ (సీతామర్హి), సెంరథ్నాథ్ భోలే షంకర్ మందిర్, బాబా హరిహర్‌నాథ్ (గ్యాంపూర్), చక్వా మహావీర్, శివమందిర్ (సుందర్పూర్), తిలింగేశ్వర్ నాథ్, తిలంగ సివ్జత్పూర్, భద్రకాళీ ఆలయం ఉన్నాయి. ఇతహరా ఉపర్వర్ గ్రామంలో బాబా గంగేశ్వర్నాథ్ అనకట్ట నిర్మించబడింది.

విభాగాలు

  • జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: ఔరై, భదోహి, గ్యాన్‌పూర్.
  • జిల్లాలో 6 బ్లాకులు ఉన్నాయి:- బదోహి, సురియావన్, గ్యాన్‌పూర్, దీఘ్, అభోలి, ఔరై.
  • జిల్లాలోని నివాసిత గ్రామాలు:- 1075
  • జిల్లాలో నిర్జనగ్రామాలు:- 149 నిర్జన గ్రామాలు ఉన్నాయి
  • జిల్లాలో న్యాయ- పంచాయితీలు:- 79.
  • జిల్లాలో గ్రామపంచాయితీలి:- 489
  • జిల్లాలో పోలీస్ స్టేషన్లు:- 9

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,554,203,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 320 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1531 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.81%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 89.14%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

మాధ్యమం

  • " సత్యం న్యూస్ " జిల్లాలో మొదటి హిందీ వీక్లీగా గుర్తించబడుతుంది.
  • " గయాన్ గిర్వా " జిల్లాలో మొదటి హిందీ దినపత్రికగా గుర్తించబడుతుంది
  • వారణాసిలో ప్రచురితమై జిల్లాలో వినియీగిస్తున్నా దినపత్రికలలో దౌనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, ఆజ్ (వార్తాపత్రిక), హిందూస్థాన్, జన్‌సందేష్ టైంస్, అవాజ్ ఎ ముల్క్.

బయటి లింకులు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.