From Wikipedia, the free encyclopedia
మామ మంచు అల్లుడు కంచు 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, అల్లరి నరేష్, మీన, రమ్యకృష్ణ, ఆలీ, పూర్ణ, వరుణ్ సందేశ్‌లు ప్రధాన పాత్రలలో నటించారు. 2015 డిసెంబరు 25 న ఈ చిత్రం విడుదలయ్యింది.
మామ మంచు అల్లుడు | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
నిర్మాత | విష్ణు మంచు |
తారాగణం | అల్లరి నరేష్ మోహన్ బాబు మీనా రమ్యకృష్ణ పూర్ణ |
సంగీతం | రఘు కుంచె అచ్చు రాజమణి Koti |
నిర్మాణ సంస్థలు | 24 ఫ్రేంస్ ఫ్యాక్టరీ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹15 cr |
బాక్సాఫీసు | ₹19 cr |
ఇది 1991 లో వచ్చిన తెలుగు చిత్రం అల్లరి మొగుడుకు అనధికారిక సీక్వెల్. ఇందులో అదే తారాగణం నటించింది.
ఇద్దరు మహిళలను పెళ్ళి చేసుకున్న భక్తవత్సలం నాయుడు ( మోహన్ బాబు ), ఈ విషయాన్ని ఇద్దరికీ తెలియకుండా రహస్యంగా ఉంచగలిగాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ ( అలీ ) రహస్యాన్ని రక్షించడంలో అతనికి సహాయం చేస్తాడు. అతని మొదటి భార్య సూర్యకాంతం ( మీనా ) కు శ్రుతి ( పూర్ణ ) అనే కుమార్తె, రెండవ భార్య ప్రియంవద ( రమ్య కృష్ణ ) కు ఒక కుమారుడు గౌతమ్ నాయుడు ( వరుణ్ సందేశ్ ) ఉన్నారు. యాదృచ్ఛికంగా, అబ్బాయి, అమ్మాయి ఇద్దరి పుట్టినరోజులు ఒకటే. ఈ లోపాల కామెడీలో నాయుడు వాళ్లకిచ్చే పుట్టినరోజు బహుమతులు తారుమారౌతాయి. గౌతమ్, శ్రుతి తమ బహుమతులు మార్పిడి చేసుకోవడానికి ఒకరినొకరు కలవాలనుకుంటారు. తన రహస్యం బయటపడుతుందేమోనని నాయుడు వాళ్ళిద్దరూ కలవాలని కోరుకోడు. ఇందుకు అతడు, బాలరాజు ( అల్లరి నరేష్ ) సహాయం కోరుతాడు. కానీ బాలరాజు శ్రుతితో ప్రేమలో పడతాడు. బాలరాజును శ్రుతికి దూరంగా ఉంచడానికి ఒకవైపు, రహస్యాన్ని కాపాడాలనే ప్రయత్నం మరోవైపూ ఇదే ఈ సినిమ అంతా. తరువాత, నాయుడు బాలరాజు గురించి తన తండ్రికి తెలియజేస్తాడు. వాస్తవానికి బాలరాజు గ్రామంలో బాలరాజును ప్రేమించే ఒక అమ్మాయి (గ్రామ పెద్దకు సోదరి) ఉంది. ఆమె అన్న తన చెల్లెలిని పెళ్ళి చేసుకోమని బాలరాజును బలవంతం చేస్తూంటాడు. నాయుడు బాల్‌రాజు గురించి తండ్రికి తెలియజేసే లేఖ ఇచ్చి ఇస్మాయిల్‌ను పంపుతాడు. అమ్మాయి ఇస్మాయిల్ చూసిన మొదటి సందర్భంలోనే ప్రేమలో పడుతుంది. బాలరాజు గురించి తెలుసుకోవటానికి బాలరాజు ఇంటికి వెళ్ళమని నాయుడు శ్రుతికి చెబుతాడు. చాలా చర్చల తరువాత శ్రుతి బలరాజు ప్రేమను అంగీకరిస్తుంది. అలాగే బాలరాజు నాయుడు గురించి శ్రుతికి ఏమీ చెప్పడు. ఇది నాయుడు అతడి ప్రేమను అంగీకరించేలా చేస్తుంది. నాయుడు ఆ ఇద్దరినీ ఎందుకు పెళ్ళి చేసుకున్నాడనేది తరువాతి కథ.
సం. | పాట | సంగీతం | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తనలోని సగభాగాన్ని" | అచ్చు రాజమణి | మనో, అనిత | |
2. | "టింగు టింగు రంగడు" | రఘు కుంచె | రఘు కుంచె, మళవిక | |
3. | "చమ్మ చక్క" | కోటి | కుమారి, చిన్మయి, ప్రియా హేమేష్, టిప్పు | |
4. | "కింగులాంటొ సింగమంట" | కోటి | శివ, సాయిచరణ్ | |
5. | "టైటిల్ సంగీతం" | అచ్చు రాజమణి | అనుదీప్ దేవ్, శివ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.