మరుధూరి రాజా
సినీ రచయిత From Wikipedia, the free encyclopedia
మరుధూరి రాజా తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.[1] 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత.
మరుధూరి రాజా | |
---|---|
జననం | |
వృత్తి | సంభాషణల రచయిత, దర్శకుడు |
వ్యక్తిగత వివరాలు
మరుధూరి రాజా గుంటూరులో జన్మించాడు. ఒంగోలు లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య ఎం. వి. ఎస్. హరనాథ రావు కూడా నాటక, సినీ రచయిత. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు వేయడం, దర్శకత్వం చేయడం ఆయనకు అలవాటు. సినిమాల్లోకి రాకమునుపే 18 నాటకాలు రచించాడు.
కెరీర్
ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతి లో ప్రదర్శనను చూసిన జంధ్యాల ఆయన్ను మద్రాసుకు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో ప్రజాస్వామ్యం సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న పరుచూరి బ్రదర్స్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత నవభారతం సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. రాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాశాడు.

సినిమాలు
సంభాషణల రచయితగా
- 6 టీన్స్ (2001)
- ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
- అమ్మాయి కోసం
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- ఆయుధం
- గౌరి (2004)
- మాతృదేవోభవ (2022)
- ఆరోప్రాణం
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- ఎగిరే పావురమా
- ఒంటరి పోరాటం
- కత్తి కాంతారావు
- కాంచనమాల కేబుల్ టి.వి.
- దేనికైనా రేడీ
- నవభారతం
- నువ్వు వస్తావని
- యజ్ఞం
- వీడెక్కడి మొగుడండీ?
- శుభాకాంక్షలు
- సిసింద్రీ
- సూర్య వంశం
- ఆరో ప్రాణం (1997)
దర్శకుడిగా
- అధ్యక్షా (2008)
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.