From Wikipedia, the free encyclopedia
భీష్మ పర్వము, మహాభారతంలోని ఆరవ భాగము. ఈ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం ఆరంభమవుతుంది. భీష్ముని నాయకత్వంలో జరిగిన పది రోజుల యుద్ధం భీష్మపర్వంలో ఉన్నది. భగవద్గీత ఈ పర్వంలో ఒక భాగం. పర్వం ఆరంభంలో వ్యాసుడు యుద్ధాన్ని ఆపుజేయమని ధృతరాష్ట్రునికి బోధిస్తాడు కాని ఆ ప్రయత్నం ఫలించదు. ఇక యుద్ధాన్ని చూడడానికి సంజయునికి అతీంద్రియ శక్తులను ప్రసాదిస్తాడు వ్యాసుడు. ఆ శక్తుల ద్వారా తాను చూసిన యుద్ధాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వర్ణిస్తూ ఉంటాడు.భీష్ముడు పదవనాటి యుద్ధంలో నేలకు ఒరిగి అంపశయ్యపై చేరడంతో ఈ పర్వం ముగుస్తుంది.
ఈ పర్వంలో రెండు ఆశ్వాసములున్నాయి. వాటిలోని విషయం సంగ్రహంగా ఇలా ఉన్నది.
దృతరాష్ట్రుడు
భీష్మ పర్వములో మొదటి పది రోజుల కురుక్షేత్ర సంగ్రామం వర్ణింబడింది. కాని యద్ధమే కాక ఈ పర్వంలో అనేక ఆధ్యాత్మిక విశేషాలున్నాయి.
ఈ పర్వంలో అంతర్గత భాగంగా ఉన్న భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంధాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.భగవద్గీత , భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
యద్ధారంభంలో కృష్ణుని సలహా మేరకు అర్జునుడు విజయాన్ని ఆశించి దుర్గాదేవిని స్తుతిస్తాడు.
నమస్తే సిద్ధ సేనాని, చార్యే, మందార వాసిని
కుమారి, కాళి, కాపాలి, కృష్ణపింగళే,
భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే
చండి, చండే నమస్తుభ్యం తారిణీం, వరవర్ణిని
కాత్యాయిని, మహాభాగే, కరాళి, విజయే, జయే
శిఖిపింఛ ధ్వజధరే, నానాభరణ భూషితే,
వేదశ్రుతి మహాపుణ్యే, బ్రహ్మణ్యే, జాతవేదసే
జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే
స్వాహాకారః స్వధాచైవ కళా కాష్ఠా సరస్వతి
సావిత్రీ వేదమాతాశ్చ తథా వేదాంతరూపిణి!
స్తుతాసిత్వం మహాదేవి! విశుద్ధేనాంతరాత్మనా
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాద్రణాజిరే
ఆ స్తోత్రం విని దేవి ప్రసన్నయై అర్జునునికి విజయం తప్పక లభిస్తుందని వరమిస్తుంది.
సంస్కృత రచనలో ఈ పర్వంలో ౬౦ నుండి ౬౪ వరకు ఉపపర్వములు ఉన్నాయి. ఆ ఐదు ఉపపర్వాలు:
ఆంధ్ర మహాభారతంలో ఈ పర్వాన్ని తిక్కన సోమయాజి వ్రాశాడు. తిక్కన యద్ధ వర్ణనా కౌశల్యం ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రీకరణలో తిక్కన భగవద్గీతను వదలి వేశాడు. ఇందుకు వివిధ కారణాలను విమర్శకులు ఊహిస్తున్నారు. భగవద్గీత స్వయంగా భగవంతుని వాక్కు గనుక దానిని తెలుగు చేయకుండా తిక్కన వదలివేశాడని. మరొక కారణం తిక్కన కథన విధానానికి ఈ భాగం అనుకూలంగా లేదని.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.