బోథ్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఆదిలాబాదు జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో బోథ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.ఇది ఎస్టీ లకు రిజర్వ్ చేయబడిన నియోజక వర్గం.
బోథ్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
దేశం | భారతదేశం |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఆదిలాబాదు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
నియోజకవర్గంలోని మండలాలు
ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుల
సంవత్సరం | గెలుపొందిన
సభ్యుడు |
పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ |
---|---|---|---|---|
1962 | సి.మాధవరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఆర్.రెడ్డి | సి.పి.ఐ |
1967 | ఎస్.ఏ.దేవ్‌శా | కాంగ్రెస్ పార్టీ | డి.ఆశారావు | సి.పి.ఐ |
1972 | ఎస్.ఏ.దేవ్‌శా | కాంగ్రెస్ పార్టీ | ఏ.ఆర్.రావు | సి.పి.ఐ |
1978 | అమర్‌సింగ్ తీలావత్ | కాంగ్రెస్ పార్టీ | గణేష్ జాదవ్ | జనతా పార్టీ |
1983 | ఎం.కాశీరాం | కాంగ్రెస్ పార్టీ | వి.జి.రెడ్డి | సి.పి.ఐ |
1985 | గోడం రామారావు | తెలుగుదేశం పార్టీ | సి.భీంరావు | కాంగ్రెస్ పార్టీ |
1989 | గోడం రామారావు | తెలుగుదేశం పార్టీ | అమర్‌సింగ్ తీలావత్ | కాంగ్రెస్ పార్టీ |
1994 | గోదాం నగేశ్ | తెలుగుదేశం పార్టీ | కె.చౌహాన్ | |
1999 | గోదాం నగేశ్ | తెలుగుదేశం పార్టీ | కె.కోసురావు | కాంగ్రెస్ పార్టీ |
2004 | సోయం బాపూ రావు | తెలంగాణ | గోదాం నగేశ్ | తెలుగుదేశం
పార్టీ |
2009 | గోదాం నగేశ్ | తెలుగుదేశం పార్టీ | అనిల్ జాదవ్ | కాంగ్రెస్ పార్టీ |
2014 | రాథోడ్ బాపు రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | అనిల్ జాదవ్ | కాంగ్రెస్ పార్టీ |
2018 | రాథోడ్ బాపు రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | సోయం బాపూ రావు | కాంగ్రెస్ పార్టీ |
2023[1] | అనిల్ జాదవ్ | బీఆర్ఎస్ | సోయం బాపూ రావు | భారతీయ జనతా పార్టీ |
1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన జి.నాగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 19735 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బోథ్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థి సోయం బాపురావు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి నాగేశ్‌పై 12371 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బాపురావుకు 53940 ఓట్లు రాగా, నాగేశ్‌కు 41569 ఓట్లు లభించాయి.
- 2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
క్రమ సంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | సోయం బాపురావు | తెలంగాణ రాష్ట్ర సమితి | 53940 |
2 | జి.నాగేశ్ | తెలుగుదేశం పార్టీ | 41569 |
3 | మాధవిరాజు | జనతా పార్టీ | 3491 |
4 | పెండుఎ నీలం | ఇండిపెండెంట్ | 1853 |
2009 ఎన్నికలు
2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ జి.నగేష్ పోటీచేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ యాదవ్, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం..మనాజీ, ప్రజారాజ్యం తరఫున తొడసం విజయలక్ష్మి పోటీలో ఉన్నారు.
2023 ఎన్నికలు
2023 లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి.ఈ నియోజక వర్గంలో మూడు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ [3]23,023 ఓట్ల మెజారిటీతో బీజేపి అభ్యర్థి సోయం బాపురావు పై గెలుపొందారు. బోథ్ నియోజక వర్గంలో మొత్తం 22 రౌండ్లో వారీగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 11 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ కు76,297 ఓట్లు 44.13%, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు కు 53,274 ఓట్లు 31.03%, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడే గజేందర్ కు 32.797 ఓట్లు 18.85% ,నోటాకు 2,565 ఓట్లు1.47% వచ్చాయి.భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ 23,023 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు. బోథ్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పేయి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు.[4]
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | అనిల్ జాదవ్ | భారత రాష్ట్ర సమితి పార్టీ | 76.792 |
2 | సోయం బాపురావు | భారతీయ జనతా పార్టీ | 53,992 |
3 | ఆడే గజేందర్ | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ | 32,797 |
4 | నోటా | నోటా | 2565 |
5 | మెస్రం జంగుబాపు | బహుజన సమాజ్ వాది పార్టీ | 2071 |
6 | ఉహికే హీరాజీ | ఇతరులు | 1,391 |
7 | తోడసం ధనలక్ష్మీ | ఇండిపెండెంట్ | 878 |
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 8 | Boath | (ఎస్.టి) | Rathod Bapurao | TRS | Jadhav Anil Kumar | INC | ||||
2009 | 8 | Boath | (ఎస్.టి) | Godam Nagesh | M | తె.దే.పా | 64895 | Anil Kumar Jadhav | M | INC | 33900 |
2004 | 241 | Boath | (ఎస్.టి) | Soyam Bapurao | M | TRS | 53940 | Godam Nagesh | M | తె.దే.పా | 41567 |
1999 | 241 | Boath | (ఎస్.టి) | Godam Nagesh | M | తె.దే.పా | 49155 | Kodapa Kosu Rao | M | INC | 29420 |
1994 | 241 | Boath | (ఎస్.టి) | Godem Nagesh | M | తె.దే.పా | 51593 | Kishan Chauhan | M | INC | 10520 |
1989 | 241 | Boath | (ఎస్.టి) | Ghodam Rama Rao | M | తె.దే.పా | 18704 | Amar Singh Tilawat | M | INC | 15109 |
1985 | 241 | Boath | (ఎస్.టి) | Godam Rama Rao | M | తె.దే.పా | 25539 | Sidam Bheem Rao | M | INC | 11206 |
1983 | 241 | Boath | (ఎస్.టి) | Kasiram Marsakota | M | INC | 22578 | Vannela Ganga Reddy | M | CPI | 13243 |
1978 | 241 | Boath | (ఎస్.టి) | T. Amar Singh | M | INC (I) | 22333 | Ganesh Jadhav | M | JNP | 7071 |
1972 | 237 | Boath | (ఎస్.టి) | Dev Shah S A | M | INC | 24181 | Arka Rama Rao | M | CPI | 11242 |
1967 | 237 | Boath | (ఎస్.టి) | S. A. Devshah | M | INC | 16299 | D. A. Rao | M | CPI | 10676 |
1962 | 249 | Boath | GEN | C. Madhav Reddi | M | INC | 15990 | Raja Reddy | M | CPI | 10236 |
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.