బొబ్బిలి కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, బొబ్బిలిలో ఉంది.ఇది విజయ నగరం జిల్లాకు 60.కి.మీ.దూరంలో ఉంది.ఇది 17వ శతాబ్దంలో మట్టితో నిర్మించబడిన కోట.[1] బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దా రాయుడు. (రాయుడప్ప రంగారావు). ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం (చికాకోల్) నవాబు షేర్ మహ్మద్ ఖాన్ (టైగర్) కు, వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు.[1] ఆరకంగా మహ్మద్ ఖాన్ వెంకటగిరి రాజులు బృందంలో భాగంగా ఇతను బొబ్బిలి ప్రాంతానికి వచ్చాడు.షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్ప(పెద్దారాయుడు)కు బహూకరించాడు.ఇతను పట్టణాన్ని స్థాపించి, ఒక కోటను నిర్మించాడు. పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని పేరు పెట్టాడు.తరువాత అది రానురాను బొబ్బిలిగా రూపాంతరం చెందింది.[2]ఈ రాజవంశీయులకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశాడు.[3]
తాండ్ర పాపారాయుడు వీరత్వం
బొబ్బిలి పట్టణం పేరు వినగానే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం గుర్తుకువస్తుంది.ఎందుకంటే, చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికున్న ప్రత్యేకత వేరు.విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా చెబుతారు.పరాయి పాలనకు జరిగిన యుద్దంలో తాండ్ర పాపారాయుడు వీరత్వం ప్రతాపానికి సాక్ష్యంగా నిలించింది.అందుకే ఈ యుద్దం గురించి వీరగాధ పాటగా, బుర్రకథగా, నాటకంగా, చలనచిత్రంగా ప్రజలలో ప్రాచూర్యం పొందాయి.అప్పటి యుద్దానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని భైరవసాగరం వద్ద స్మారక స్థూపం నొకదానిని చిహ్నంగా నిర్మించబడింది.[3]
కోట ప్రత్వేకతలు
ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ దర్బార్‌మహాల్ కోటకు ఆకర్షణగా ఉంది. బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్ హౌస్‌కు గొప్ప ప్రాచుర్యం ఉంది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్ హౌస్‌ను చూసేందుకు వెళుతుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పట్లో రాజులు వినియోగించిన సింహాసనాలు, పల్లకీలు రాచరిక భోగభాగ్యాలకు నిలువుటద్దంలా కనిపిస్తే, పురాతన నిర్మాణాలు, వస్తు సామగ్రి, వాహనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాణి చెల్లాయమ్మదేవి 18వ శతాబ్ధంలో నిర్మించిన మూడో కోట ఎంతో విశాలంగా, చారిత్రకు సాక్ష్యంగా కనిపించింది. దక్షిణ దేవుడు, పడమర దేవుడు, ఉత్తర దేవుడు అనే మూడు ముఖద్వారాలు ఈ కట్టడంలో ఉన్నాయి. రాజు వంశీయులు మాత్రమే ఉత్తర దేవుడు ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం కల్పించబడింది.మిగిలిన రెండు ద్వారాలు సందర్శకులు నిత్యం వచ్చివెళ్లేందుకు మాత్రం వీలు కలిగించబడింది. శత్రు దుర్భేద్యంగా కోట చుట్టూ నిర్మించిన ఎత్తయిన ప్రహరీ సందర్శకులును ఆకట్టుకుంటుంది. సుమారు 40 అడుగుల ఎత్తుగల సింహద్వారాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. కోటలోపల అనేక భవనాలు, లోగిళ్లు, మండపాలు కలిగి ఓ గ్రామంలా సందర్శకులకు అనిపిస్తుంది.[4]
ప్రత్యేక ఆకర్షణగా సప్తమహాల్స్
కోటలో నిర్మించిన ఏడు పురాతన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సప్తమహాల్స్‌గా పిలుస్తారు. వందల సంవత్సరాలు గడిచినా ఈ భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఒక దర్భార్‌మహాల్ యూరోపియన్ కట్టడంమాదిరిని తలపిస్తుంది. పూజమహాల్‌లో రాజవంశీయులు, ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యే సుజరు కృష్ణరంగారావు కుటుంబం నివాసం ఉంది. కృష్టవిలాస్‌లో ఎమ్మెల్యే సోదరుడు రామ్‌నారాయన్ నివాసముంటున్నారు. మిగిలిన నాలుగింటిలో ప్రాంగ్‌మహాల్, సీతారామ మందిరం, రాణీ మహల్, లక్ష్మీవిలాస్ ఉన్నాయి. కోట నిర్మాణంలో బర్మాటేకు, రోజ్‌వుడ్ ఎక్కువగా వినియోగించారు.కోట పడమట దిక్కున గోడకు ఆనుకునివున్న పార్కింగ్ స్థలంలో రాజులు ఉపయోగించిన పురాతన వాహనాలు ఇప్పటికీ కనిపిస్తాయి.[4]
మ్యూజియంగా ఏర్పాటు
మ్యూజియంలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన యుద్ధ సామగ్రి, ఫోటోలతో నిండిపోయింది. రాజులు వినియోగించిన కత్తులు, కటారులు చూడముచ్చటగా కనిపిస్తాయి. బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడు వినియోగించిన ఖడ్గం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. తాండ్ర పాపారాయుడు జరిపిన పోరులో ఖడ్గానికి బుల్లెట్ తగిలిన గుర్తు ఖడ్గం మీద సందర్శకులను ఆకట్టుకుంటుంది.బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన సింహాసనం, తుపాకులు, రాజులు ధరించిన అతిఖరీదైన వస్త్రాలు, తలపాగాలు, కిరీటాలు, వేటాడిన పెద్దపులుల చర్మాలు, ఏనుగు అంబానీ, చారిత్రక ఆధారాలను చూపించే మరిన్నిచిత్రాలు వందల కొలదీ ఈ మ్యూజియంలో ఉన్నాయి.[4]
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.