Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో బేగుసరాయ్ జిల్లా ఒకటి. బేగుసరాయ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
బేగుసరాయ్ జిల్లా
बेगूसराय जिला ضلع بیگو سراےء | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | దర్భంగా |
ముఖ్య పట్టణం | బేగుసరాయ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | బేగుసరాయ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,918 కి.మీ2 (741 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 29,54,367 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (4,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.23 % |
• లింగ నిష్పత్తి | 894 |
ప్రధాన రహదార్లు | NH 31, NH 28 |
సగటు వార్షిక వర్షపాతం | 1384 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
బేగుసరాయ్ అనేపేరుకు మూలం బేగంసరాయ్. ఇది కాలక్రమంలో బేగుసరాయ్గా మారింది..
బేగుసరాయ్ 1870లో ముంగర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1972లో దీనికి జిల్లా అంతస్తు ఇవ్వబడింది.[1] సిమరియా గ్రామం ప్రముఖ హిందీ కవి రాంధారి సింగ్ దినకర్ జన్మస్థానం. ఆయన జీవితంలో అత్యధిక భాగం ముంగర్‌లో గడిచింది. బేగుసరాయ్ పౌరాణిక మిథిలారాజ్యంలో భాగంగా ఉండేది.
బేగుసరాయ్ జిల్లా వైశాల్యం 1918 చ.కి.మీ.[2] ఇది ఇండోనేషియాలోని బియాక్ ద్వీపజనసంఖ్యకు సమానం.[3] జిల్లా గంగానది ఉత్తరతీరంలో ఉంది. బేగుసరాయ్ జిల్లా దర్భంగా డివిజన్లో భాగం. జిల్లా 25.15 నుండి 25.45 ఉత్తర అక్షాంశం, 85.45 నుండి 86.36 తూర్పు రేఖాంశంలో ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
ఉపవిభాగాలు | 4 బేగుసరాయ్ అండ్,మంజహుల్,బల్లియా,బఖరి,తెఘర |
అసెంబ్లీ నియోజక వర్గం | |
పార్లమెంటు నియోజక వర్గం | బేగుసరాయ్ |
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బేగుసరాయ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4] జిల్లాలో 1200 కోట్ల నగదు బదిలీలు జరుగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఉంది
జిల్లాలో బరౌని రైల్వేస్టేషను ప్రధానమైనది. పలు రైళ్ళకు ఇది ఆరంభస్థానంగా ఉంది. ఇది రాజేంద్ర వంతెన ద్వారా దక్షిణ బీహార్ రాష్ట్రంతో అనుసంధానితమై ఉంది.
ఇక్కడి నుండి బీహార్ రాష్ట్ర ఇతర ప్రాంతాలకు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు బసు సౌకర్యం లభిస్తుంది. ప్రాంతీయ బసులను ప్రైవేట్ సంస్ంస్థలు నడుపితున్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,970,541,[5] |
ఇది దాదాపు. | అర్మేనియా దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | మిసిసిపి నగర జనసంఖ్యకు సమం..[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 128 వ స్థానంలో ఉంది..[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1540 .[5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.44%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 895:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 63.87%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
నౌలాఘర్ (86° 04' 00"/25° 33' 15") బేగుసరాయ్ జిల్లా బీర్పూర్ నౌలా వద్ద ఉంది.
మౌండ్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. మౌండ్ ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంటుంది. రహదారి మార్గం మౌండును రెండుగా చేస్తుంది. ఎ.ఐ.హెచ్ కల్చర్, బేగుసరాయ్ లోని జి.డి కాలేజ్‌కి చెందిన ఆర్కియాలనీ శాఖ మైండును రెండుమార్లు పరిశోధించింది. మౌండ్ ఉత్తరభాగం సహజ సౌందర్యం, మానవ నిర్మిత నీటికాలువలతో అందంగా ఉంటుంది. బీర్పూర్కు పశ్చిమంలో 3.5 కి.మీ దూరంలో ఉంది. ఇది 1.5 కి.మీ పొడవున విస్తరించి ఉంది. మౌండ్ తూర్పున ఫాంసిరై తోలా, పడమర మాక్వా పంచాయితీ, దక్షిణంలో బైంటి మద్యన ఉంది. తూర్పున రెండు నదులు సంగమిస్తున్నాయి.
ఎన్.బి.పి, బ్లాక్ స్లిప్డ్, కాల్చినవి (మెరుగుదిద్దిన సాదా పాత్రలు) రెడ్ వేర్ (మెరుగుదిద్దిన సాదా పాత్రలు), లోపల నల్లని వెలుపల ఎర్రని పాత్రలు, పదార్ధాలను పెద్ద మొత్తంగా నిల్వౌంచగలిగిన పాత్రలు, నీటి కూజాలు, వంట పాత్రలు, చిన్న, పెద్ద ప్లేట్లు, బౌల్స్, లోతైన పెనం, చదునైన పెనం మొదలైన మట్టిపాత్రలు తయారుచేయబడుతున్నాయి.
1950- 1952 మద్యన ఆర్.కె చౌదరి ఈ మౌండును పరిశోధించాడు. ప్రాంతీయ నివాసి అరవింద్ ప్రసాద్ సింగ్ మౌండ్ వద్ద లభించిన నాణ్యాలను, పురాతన వస్తువులను భద్రపరచి ఉంచాడు. ఆయన వీటిని బేగుసరాయ్ లోని జి.డి కాలేజ్ మ్యూజియానికి దానంగా ఇచ్చాడు. ఇక్కడ విరిగిన స్థితిలో మూడవ విగ్రహ పాలుని నల్లరాతి విగ్రహాలు మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. జి.డి కాలేజ్ బులెటిన్‌లో శాలాక్షరాలు ముద్రించబడ్డాయి.
1989లో జిల్లాలో 63 చ.కి.మీ వైశాల్యంలో " వన్యమృగ అభయారణ్యం " ఏర్పాటు చేయబడింది. .[8]
1994 నుండి బేగుసరాయ్ జిల్లాలో ప్రముఖ కంపూటర్, మేజ్మెంటు విద్యాసంస్థ విద్యార్థులకు ఐ.టి, మేనేజ్మెంటు సంబంధిత ఉన్నతస్థాయి విద్యను అందిస్తుంది. ఈ సంస్థలో విద్యను అభ్యసించిన 30,000 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఇప్పటికే విద్యను అభ్యసిస్తున్నారు. 2013 డిసెంబరు 23న రాంధారి సింగ్ దినకర్ ఇంజనీరింగ్ కాలేజ్‌కు శంకుస్థాపన జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. ఇది బీహార్ రాష్ట్రంలో 8 వ ఇంజనీరింగ్ కాలేజీగా అవతరించనుంది.[9][10] జిల్లాలోని కాలేజీలన్ని లలిత్నారాయణన్ మిథిల విశ్వవిద్యాలయం (దర్భంగ) ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రముఖంగా జి.డి కాలేజ్, కో-ఆపరేటివ్ కాలేజ్, మహిళా కళాశాల, సి.ఎ.బి.ఎస్ ఇంటర్ కాలేజ్ (ఖంహర్ ;బేగుసరాయ్) ఇగ్నో, నలంద ఓపెన్ విశ్వవిద్యాలయం జి.డి కాలేజ్ అండ్ కో-ఆపరేటివ్ కాలేజ్‌లు ఉన్నాయి.
బేగుసరాయ్ జిల్లా ఉన్నత విద్యకు రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధి చెంది ఉంది. ఎస్.టి పౌల్స్ స్కూల్ ఆర్ధ్వర్యంలో నిర్వహించబడుతున్న సైబర్‌స్కూల్ అనే కంప్యూటర్, ఇంఫర్మేషన్ స్కూల్ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తుంది. ఐ.టి గురుకుల్ విద్యార్థులకు సి.సి.ఎ, డి.సి.ఎ, ఎ.డి.సి.ఎ, పి.జి.డి.సి.ఎ, సి.ఎఫ్.ఎ, డి.ఎఫ్,ఎ, డి.సి.టి.టి, హెచ్.టి.ఎం.ఎల్, పి.హెచ్.పి.మొదలైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులను అందిస్తుంది. జిల్లాలో 3 కేంద్రీయ విద్యాలయాలు (కేంద్రీయ విద్యాలయ (ఐ.ఒ.సి.ఎల్ కాలనీ), హెచ్.ఎఫ్.సి కాలనీ, గర్హర) ఉన్నాయి.
జిల్లాలో పలు సి.బి.ఎస్.సి స్కూల్స్ (న్యూఢిల్లీ) ఉన్నాయి. జిల్లాలోని ఇతర స్కూల్స్:-
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.