బప్పీ లహరి (ఆంగ్లం: Bappi Lahiri) (1953 నవంబరు 27 - 2022 ఫిబ్రవరి 16) హిందీ సంగీత దర్శకుడు. తాహిర్ హుస్సేన్ చిత్రం ‘జఖ్మీ’ (1975)తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తరువాత ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మారాడు, ఈయన హిందీ, బెంగాలీ సినిమాలతో కొన్ని తెలుగు , తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయము చేసిన ఘనత ఇతడిదే, బాలీవుడ్‌లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. 1985 లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీతకారుడిగా, 2018లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకొన్నాడు. కొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో 69 సంవత్సరాల వయస్సులో 15 ఫిబ్రవరి 2022న నవీ ముంబైలో మరణించాడు.[2]

త్వరిత వాస్తవాలు బప్పీ లహరి, జననం ...
బప్పీ లహరి
Thumb
విల్ టు లైవ్ మ్యూజిక్ లాంచ్‌లో బప్పి లాహిరి
జననం
అలొకేశ్ లహరి

(1953-11-27)1953 నవంబరు 27 చెన్నై, తమిళనాడు, భారతదేశం
మరణం2022 ఫిబ్రవరి 16(2022-02-16) (వయసు 68)[1]
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుబప్పీ దా
వృత్తిస్వరకర్త, శబ్దగ్రాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, వాద్యకారుడు
వెబ్‌సైటుhttps://www.bappilahiri.com/
మూసివేయి
Thumb
బి.సుభాష్, బాప్పీలహరి, పార్వతి ఖాన్

జననం

నవంబర్ 27, 1953లో జన్మించారు. ఆయ‌న అస‌లు పేరు అలోకేష్ ల‌హ‌రి బెంగాల్ జల్‌పైగురిలో జన్మించాడు, తండ్రి అపరేష్, తల్లి బన్సూరి త‌ల్లిదండ్రులిద్ద‌రూ గాయ‌కులు[3] అతను ఏకైక సంతానం. గాయకుడు కిషోర్ కుమార్ ఇతని బందువు(మామ),[4] మూడేళ్ల వయసులో ఉండగానే తబలా వాయించేవాడు, చిత్రాణి అనే గాయకురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా గాయకుల కుటుంబం నుంచి వచ్చినది. బప్పీలహరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె రేమా కూడా గాయకురాలు. ఆయన కుమారుడు బప్పా లహరి బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.

సంగీతాన్నందించిన తెలుగు సినిమాలు

సంవత్సరం సినిమా గమనికలు
1986 సింహాసనం
1987 తేనే మనసులు
త్రిమూర్తులు
శంఖారావం
సామ్రాట్
1988 కలెక్టర్ విజయ
మన్మధ సామ్రాజ్యం
1989 స్టేట్ రౌడీ
1990 చిన్నా
చిన్న కోడలు
1991 ఇంద్ర భవనం
గ్యాంగ్ లీడర్
రౌడీ గారి పెళ్ళాం
రౌడీ అల్లుడు
1992 దొంగ పోలీస్
రక్త తర్పణం
రౌడీ ఇన్‌స్పెక్టర్
బ్రహ్మ
1993 నిప్పు రవ్వ
రౌడీ రాజకీయం
1995 పెద్ద యజమాని
ముద్దాయి ముద్దుగుమ్మ
ఖైదీ ఇన్‌స్పెక్టర్
పుణ్య భూమి నా దేశం
2013 యాక్షన్ 3D తన కొడుకు బప్పా లహరితో కలిసి కంపోజ్ చేశారు
2020 డిస్కో రాజా రమ్ పమ్ బమ్ అనే పాటకు గాయకుడు[5]

రాజకీయ జీవితం

బప్పి లాహిరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో 31 జనవరి 2014న పార్టీలో చేరాడు[6]. అతను 2014లో శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా ఎంపికయ్యాడు, అయితే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ చేతిలో ఓడిపోయాడు.

ఇవి కూడ చూడండి

కసమ్ (1988 చిత్రం)

బయటి లింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.